Khammam District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Khammam District: ఆశ్రమ స్కూల్లో హెడ్ మాస్టర్ ఇష్టా రాజ్యం.. ఉద్యోగం ఒకరిది విధుల్లో మరొకరు.. ఎక్కడంటే.?

Khammam District: కారేపల్లి మండలంలోని మేకలతండా గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో మరో విచిత్రం వెలుగులోకి వచ్చింది. ఈ స్కూల్లో ఏడాది నుంచి ఒకరికి బదులుగా మరొకరు విధులు నిర్వర్తించడానికి పాఠశాల హెడ్మాస్టర్ అనుమతి ఇవ్వడం అంటే ఇక్కడ హెడ్మాస్టర్ ఏ స్థాయిలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతుంది. తార్య(Tarya) అనే ఎస్ జి టి ఉపాధ్యాయుడు ఏడాది క్రితం అనారోగ్యానికి గురయ్యారు. అనారోగ్యానికి గురైన ఈ ఉపాధ్యాయుడి స్థానంలో తరగతులు బోధించేందుకు వేరొకరిని నిబంధనలకు విరుద్ధంగా హెడ్మాస్టర్ అతను(SGT)మాట్లాడుకొని ఏడాది నుంచి కొనసాగిస్తున్నారు.

నిబంధనలకు విరుద్ధం

ఆశ్రమ స్కూల్లో పనిచేసే ఓ వర్కర్ కూతురు ను నిబంధనలకు విరుద్ధంగా పర్మినెంట్ ఉపాధ్యాయుడి స్థానంలో క్లాసులు చెప్పిస్తున్నారు. పాఠశాలకు సంబంధం లేని వారితో ఉద్యోగం చేపిస్తూ స్కూల్లోనే ఉంచుతూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అనారోగ్యం పాలైన వారు వారికున్న హక్కుల ప్రకారం సిక్ లీవ్స్(Sick leaves) ఉపయోగించుకోవాలి. కానీ ఒకరికి బదులు మరొక ప్రైవేటు వ్యక్తి బాలికల ఆశ్రమ పాఠశాలలో పనిచేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇదే పాఠశాలలో తండ్రి లేని నిరుపేద గిరిజన బాలికను అనారోగ్యం కారణంగా ఆశ్రమ పాఠశాల నుంచి బయటకు పంపించిన అమానుష ఘటన కూడా ఇదే పాఠశాలలో జరగడం గమనార్హం.

Also Read: BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

కాళ్ళపై పడి ప్రాధేయపడిన కనికరం లేదా..

అనారోగ్యంతో ఉన్న బాలికకు టిసి(TC) ఇచ్చి ఇంటికి పంపించిన నిబంధన అనారోగ్యానికి గురైన ఉపాధ్యాయుడి స్థానంలో అదే పాఠశాలలో వర్కర్ గా పనిచేస్తున్న కూతురును పాఠశాలలో క్లాసులు చెప్పించేందుకు నిబంధనలు అడ్డు రాలేదా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనారోగ్యంతో ఉన్న నిరుపేద విద్యార్థిని తల్లి కాళ్ళ వేళ్ళ పడి ప్రాధేయపడిన హెడ్మాస్టర్ కనికరించకుండా టిసి(TC) ఇచ్చి ఇంటికి పంపిందని ఆరోపణలు కూడా ఉన్నాయి. నిత్యశ్రీ(Nithyasri)ని ఇంటికి పంపించిన నిబంధన అనారోగ్యంతో ఉన్న ఉపాధ్యాయుడికి ఎందుకు వర్తించడం లేదో తెలపాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగం ఒకరికి ఉంటే మరొకరు అదే స్థానంలో పిల్లలకు పాఠాలు చెప్పడంలో నిబంధన వర్తించదు హెడ్మాస్టర్ వెంకటరమణ(Venkataramana)ను స్థానికులు నిలదీస్తున్నారు.

Also Read: Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Just In

01

Wanaparthy Police: వనపర్తిలో పోలీస్ విభాగం ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభం

RBI Grade B Recruitment 2025: RBI‌ లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు..

Mana Shankara Vara Prasad Garu: చిరు, నయన్ పాటేసుకుంటున్నారు.. తాజా అప్డేట్ ఇదే!

Viral Video: ఏనుగులనే హడలెత్తించిన.. డాడీ లిటిల్ ప్రిన్సెస్.. మీకో దండం తల్లి!

Chris Gayle: పంజాబ్ కింగ్స్ జట్టుపై క్రిస్ గేల్ సంచలన ఆరోపణలు