Bigg Boss Tanuja
ఎంటర్‌టైన్మెంట్

Bigg Boss9 Telugu: డబుల్ హౌస్, డబుల్ జోష్.. స్టార్టింగే కింగ్ నాగ్‌కు పరీక్షలు

Bigg Boss9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) మొదలైంది. సెప్టెంబర్ 7, ఆదివారం ఈ షో‌ని గ్రాండ్‌గా ప్రారంభించారు. ముందుగా నాగార్జున ఎంట్రీ అదిరిపోగా, వెంటనే నాగ్‌కు బిగ్ బాస్ కొన్ని పరీక్షలు పెట్టి డబుల్ హౌస్‌లను చూసే అవకాశాన్ని కల్పించారు. రెండు హౌస్‌లను చూపించేందుకు నాగార్జున (King Nagarjuna) ఆ పరీక్షలను ఎదుర్కొన్నారు. ఎంత పెద్ద రాజ్యమైనా రాజుకి కోట ఉండాలి కదా.. అలాగే బిగ్ బాస్‌కి హౌస్ ఉండాలి అంటూ ప్రేక్షకులకు హౌస్‌లను పరిచయం చేశారు. బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిన తర్వాత కూడా నాగార్జునకు పరీక్షలు పెట్టారు. లాంజ్ రూమ్‌లోకి వెళ్లడానికి జరిగిన పరీక్షలో కింగ్ నాగార్జున ఓ కార్డును సెలక్ట్ చేసుకోని, ఆ రూమ్‌ని.. స్ట్రాటజీలు, గాసిప్స్, ప్రేమలు జరిగేది ఇక్కడే అంటూ నాగ్ పరిచయం చేశారు. తర్వాత వాష్ రూమ్ చూపించారు.

Also Read- Teja Sajja: ‘మిరాయ్’ కన్నడ ఈవెంట్‌లో ‘ఓజీ’ అంటూ అరుపులు.. తేజ సజ్జా రియాక్షన్ ఇదే!

హౌస్‌లను చూసేందుకు నాగ్‌కు పరీక్షలు

బిగ్ బాస్ సెకండ్ హౌస్‌ని చూపించడానికి నాగ్‌కు మరో పరీక్ష పెట్టారు బిగ్ బాస్. సెకండ్ హౌస్ అవుట్ స్టాండింగ్‌గా ఉందని నాగ్ అన్నారు. డబుల్ హౌస్, డబుల్ జోష్ అంటూ నాగ్ సంతోషం వ్యక్తం చేశారు. డబుల్ హౌస్‌లను చూసిన నాగార్జున హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం ఇటీవల జరిగిన అగ్నిపరీక్షలో మిగిలి ఉన్న 13 మంది కంటెస్టెంట్స్‌తో మాటామంతీ జరిగింది. అందులో నుంచి 5 గురు మాత్రమే హౌస్‌లోకి వెళతారని నాగ్ చెప్పారు. అనంతరం బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి ఫస్ట్ హౌస్‌మేట్‌ను నాగ్ పిలిచారు.

Also Read- Ganesh Immersion: వెరీ గుడ్ ఆఫీసర్స్, స్టాఫ్.. సీఎం రేవంత్ అభినందనలు.. ఎందుకంటే?

ఫస్ట్ హౌస్‌మేట్: తనూజ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9‌లో హౌస్‌లోకి వెళ్లి మొదటి సెలబ్రిటీని కింగ్ నాగ్ పిలిచారు. ఫస్ట్ సెలబ్రిటీగా హీరోయిన్ తనూజ అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌‌తో ఎంట్రీ ఇచ్చారు. ఆమెకు కింగ్ నాగ్ గ్రాండ్ వెల్ కం చెప్పారు. నాగ్‌ మీద ఉన్న ఇష్టంతో ఆయన కోసం తనూజ స్పెషల్‌గా మటన్ బిర్యానీ చేసి తీసుకొచ్చారు. కన్నడలో హీరోయిన్‌ అయిన తనూజ.. తెలుగులో ‘ముద్దమందారం’ సీరియల్‌తో అందరికీ పరిచయమే. తనూజ హౌస్‌లోకి వస్తున్నట్లుగా తన తండ్రికి తెలియదని చెప్పారు. తెలిస్తే మాత్రం.. తనతో మాట్లాడరని ఆమె చెప్పుకొచ్చింది. అమాయకురాలిని, ఫ్యామిలీ గర్ల్‌ని అని తనని తాను పరిచయం చేసుకుంది.

రెండో హౌస్‌మేట్: ఆషా షైనీ (ఫ్లోరా షైనీ)

హౌస్‌లోకి రెండో హౌస్‌మేట్‌గా తెలుగు ప్రేక్షకులకు ‘లక్స్ పాప’గా పరిచయం ఉన్న ఆషా షైనీ (ఫ్లోరా షైనీ) ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్‌లో ఇవివి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమ కోసం’ మూవీతో ఎంట్రీ ఇచ్చానని ఆ తర్వాత చాలా సినిమాలు చేశానని ఓ ఎమోషనల్ స్టోరీని ఫ్లోరా షైనీ చెప్పుకొచ్చారు. తన అసలు పేరు ఫ్లోరా షనీ అని చెప్పారు. చాలా కాలంగా వెండి తెరకు దూరంగా ఉన్న ఆమె తాజాగా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. హౌస్‌లోకి అడుగు పెట్టిన ఫ్లోరా షైనీ‌కి తనూజ గ్రాండ్ వెల్‌కమ్ చెప్పింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!