Bandla-and-Mouli
ఎంటర్‌టైన్మెంట్

Bandla Ganesh: దున్నేయ్.. ఇక టాలీవుడ్ నీదే.. ‘లిటిల్ హార్ట్స్’ హీరోకి బండ్ల బూస్ట్!

Bandla Ganesh: స్టేజ్ మీదనే కాదు.. సోషల్ మీడియాలోనూ సెన్సేషన్ ఎవరయ్యా? అంటే వెంటనే వినిపించే పేరు బండ్ల గణేష్ (Bandla Ganesh). ఆ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) గురించి ఓ స్టేజ్‌పై ఆయన మాట్లాడిన ప్రసంగం ఎంత వైరల్ అయిందో తెలియంది కాదు. పవన్ కళ్యాణ్ అంటే చాలు ఆయనకు పూనకాలు వచ్చేస్తాయి. అందుకే, పవన్ కళ్యాణ్ ఏ ఫంక్షన్ జరిగినా, బండ్లన్న నువ్వు రావాలి.. అంటూ ఫ్యాన్స్‌ రిక్వెస్ట్ చేస్తుంటారు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్స్‌కు బండ్ల గణేష్‌ని రానివ్వడం లేదు. ఆయన మాట్లాడటం మొదలు పెడితే.. క్రెడిట్ మొత్తం కొట్టేస్తాడనో.. లేదంటే గురూజీ ఎఫెక్టో తెలియదు కానీ, పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్స్‌కు బండ్ల గణేష్‌ను ఫ్యాన్స్ బాగా మిస్ అవుతున్నారు. ఆ విషయం సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి స్పష్టంగా తెలుస్తుంది. సరే.. ఈవెంట్స్‌కి రాకపోతేనేం.. సోషల్ మీడియాలో మాత్రం తన తడాఖా చూపిస్తూనే ఉన్నారు బండ్ల గణేష్.

Also Read- Kishkindhapuri: మొదట్లో వచ్చే ముఖేష్ యాడ్ లేకుండానే బెల్లంకొండ బాబు సినిమా.. మ్యాటర్ ఏంటంటే?

దున్నేయ్.. ఇక టాలీవుడ్ నీదే

ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన చేసిన ట్వీట్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన ట్విట్టర్‌ పిట్టకు పని కల్పించారు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్‌ గురించి ఆయన ట్వీట్ వేయలేదు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ మూవీ హీరో మౌళి తనూజ్‌ (Mouli Tanuj) పై ట్వీట్ వేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అప్పుడెప్పుడో మౌళి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌ను తీసుకుని, దానికి రిప్లయ్ ఇస్తున్నట్లుగా బండ్ల గణేష్ పోస్ట్ చేశారు. ఆయన పోస్ట్‌లో.. ‘కొడితే నీలా కొట్టాలి రా బాబు దెబ్బ… చంపేశావ్.. ఇక దున్నే టాలీవుడ్ నీదే’ అని పేర్కొన్నారు. అయితే, వెంటనే ఈ పోస్ట్‌ను డిలీట్ చేసి.. మళ్లీ నార్మల్‌గా సేమ్ పోస్ట్ చేశారు. ముందు చేసిన పోస్ట్‌లో మౌళి తనపై ఇంటర్నెట్‌లో వస్తున్న వ్యతిరేకతపై చేసిన పోస్ట్ ఉంది. మరి ఏమనుకున్నారో.. ఏమో వెంటనే ఆ ట్వీట్ డిలీట్ చేసి.. మళ్లీ నార్మల్‌గా పోస్ట్ చేశారు. దీనికి నెటిజన్లు.. ఏమైంది అన్నా.. డిలీట్ చేశావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read- Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

రెండు రోజుల్లోనే బ్రేకీవెన్

‘90s మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనూజ్, ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ఫేమ్ శివానీ నాగరం లీడ్ రోల్స్‌లో నటించిన ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts) మూవీ థియేటర్లలో దూసుకెళుతోంది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా హౌస్ ‌ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి. సెప్టెంబర్ 5న ‘ఘాటి’, ‘మదరాసి’ చిత్రాలకు పోటీగా వచ్చిన ఈ సినిమా, ఆ రెండు సినిమాలను పడగొట్టి.. సక్సెస్ ఫుల్‌గా థియేటర్లలో సత్తా చూపిస్తోంది. కేవలం రెండంటే రెండే రోజుల్లో ఈ సినిమా బ్రేకీవెన్ సాధించినట్లుగా మేకర్స్ చెబుతున్నారంటే.. ఏ రేంజ్‌లో బాక్సాఫీస్ వద్ద సునామీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్‌ రిలీజ్ చేశారు. ఈ సినిమాతో నిర్మాతలకు భారీగా లాభాలు వస్తాయని ట్రేడ్ రిపోర్ట్స్ సైతం చెబుతుండటం విశేషం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Dr. Sakinalla Jeevan Chandra: నిత్య కృషీవలుడు..పేద ఇంట్లో వికసించిన జ్ఞాన దీపం.. జీవన్ చంద్ర!

Weight Loss Challenge: కొవ్వు కరిగించుకో.. రూ.లక్షల్లో బోనస్ దక్కించుకో.. ఉద్యోగులకు బంపరాఫర్!

Shrasti Verma: శ్రష్ఠి వర్మ టార్గెట్ అతడేనా.. బిగ్ బాస్ హౌస్‌లో ఆ నిజాలన్నీ బయటపెడుతుందా?

Kalyani Priyadarshan: ‘కొత్త లోక’ విడుదలకు ముందు దుల్కర్ సల్మాన్ కల్యాణీకి ఏం చెప్పాడంటే.. అందుకేనా ఆ కలెక్షన్స్

Vice President Election: రేపే ఎన్నిక.. తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు?.. క్రాస్ ఓటింగ్ టెన్షన్!