Ganesh Laddu issue ( Image Source: Twitter)
తెలంగాణ

Ganesh Laddu issue: తాగిన మత్తులో గణేష్ లడ్డూను డ్రైనేజీలో పడేసిన యువకులు.. ఎక్కడంటే?

Ganesh Laddu issue: గద్వాల పట్టణంలో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. చిన్న గొడవగా మొదలై చివరకు అర్ధరాత్రి ఇండ్ల మీదకు వెళ్లి దాడికి పూనుకున్నారు. ఈ సంఘటనలో వార్డు మాజీ కౌన్సిలర్ మహేష్, వారి కుటుంబ సభ్యులకు ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి,అక్కడ నుండి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్సు లో తరలించారు. గద్వాల పట్టణంలోని అంబేద్కర్ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

Also Read: Ganesh Immersion 2025: పాతబస్తీ గణనాధులపై స్పెషల్ ఫోకస్.. మంత్రి పొన్నం, డీజీపీ, మేయర్ విజయలక్ష్మి ఏరియల్ సర్వే

గద్వాల్ చింతలపేటకు చెందిన యువకులు మద్యం కొనుగోలు కోసం హట్కర్ పేటలోని బెల్ట్ షాప్‌కు వెళ్లారు. అక్కడ అంబేద్కర్ నగర్‌కు చెందిన యువతతో అకారణంగా గొడవ పడ్డారు.గొడవను స్థానిక మాజీ కౌన్సిలర్ మహేశ్ మధ్యవర్తిత్వం చేసి శాంతింపజేశారు. మధ్యరాత్రి మహేశ్‌ను ఎంబీ మిస్సా చర్చి సమీపంలో సిసి యూత్ సభ్యులను వెంటవేసుకొని వచ్చి దాడికీ పాల్పడ్డారు.

Also Read: Ganesh Immersion 2025: హైదరాబాద్‌లో 2 లక్షల 54 వేల 685 విగ్రహాలు నిమజ్జనం.. జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడి

రాళ్లు, కర్రలతో దాడి చేయగా, అడ్డుకునేందుకు వచ్చిన వార్డు కౌన్సిలర్ మహేశ్ తండ్రి శ్రీనివాసులు, వినయ్ ను కూడ గాయపరిచారు. ఈ దాడిలో గణేష్ మండపం వద్ద ఉన్న లడ్డూను డ్రైనేజీలో పడేయడంతో పాటు, బాధితుల బంగారు గొలుసు కూడా దుండగులు లాక్కెళ్లారు.అంతకు ముందే ఇదే బ్యాచ్ దౌదర్ పల్లి లో కూడ దాడికి యత్నించినట్లు సిసి ఫుటేజ్ లో రికార్డ్ అయిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది..కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

గతంలో కూడా పలు కేసులలో కీలక సూత్రదారులుగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రి వేళలో మద్యం దుకాణాలు మూసిన అనంతరం కూడా ఒక బెల్ట్ షాపు నిర్వాహకుడు నిత్యం అందుబాటులో మద్యం ఉంచడంతో తరచుగా ఆకతాయి యువకులు అక్కడికి వెళ్లి మద్యం సేవిస్తూ రాత్రి వేళల్లో బండ్లపై గ్యాంగ్ లుగా తిరుగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని పట్టణ ప్రజలు ఆపోతున్నారు.

Just In

01

Dr. Sakinalla Jeevan Chandra: నిత్య కృషీవలుడు..పేద ఇంట్లో వికసించిన జ్ఞాన దీపం.. జీవన్ చంద్ర!

Weight Loss Challenge: కొవ్వు కరిగించుకో.. రూ.లక్షల్లో బోనస్ దక్కించుకో.. ఉద్యోగులకు బంపరాఫర్!

Shrasti Verma: శ్రష్ఠి వర్మ టార్గెట్ అతడేనా.. బిగ్ బాస్ హౌస్‌లో ఆ నిజాలన్నీ బయటపెడుతుందా?

Kalyani Priyadarshan: ‘కొత్త లోక’ విడుదలకు ముందు దుల్కర్ సల్మాన్ కల్యాణీకి ఏం చెప్పాడంటే.. అందుకేనా ఆ కలెక్షన్స్

Vice President Election: రేపే ఎన్నిక.. తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు?.. క్రాస్ ఓటింగ్ టెన్షన్!