Lunar Eclipse: ఆ రాశుల వారికీ పెద్ద ముప్పు?
Lunar Eclipse ( Image Source: Twitter)
Viral News

Lunar Eclipse: నేడే చంద్రగ్రహణం.. ఆ రాశుల వారికీ పెద్ద ముప్పు.. మీ రాశి ఉందా?

Lunar Eclipse : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, గ్రహణాలు చెడు శకునంగా చెబుతారు. ఈ రోజు రాత్రి 9:58 గంటలకు చంద్ర గ్రహణం ప్రారంభమవుతుంది, అయితే దాని సూతక కాలం మధ్యాహ్నం 12:57 నుంచే మొదలవుతుందని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో ఆహారం తీసుకోవడం, వంట చేయడం కూడా మానేయాలని చెబుతున్నారు. ఒక వేళ మీరు ఆహారం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే.. తులసి ఆకులు లేదా దర్భ గడ్డి ఉంచితే కలుషితం కాకుండా ఉంటుంది. అంతే కాదు, గ్రహణ సమయంలో పూజలు, శుభ కార్యాలు చేయకూడదు. ఈ రోజు రాత్రి మొదలైన గ్రహణం సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26 గంటలకు ముగుస్తుంది. ఆ తర్వాత దానాలు చేస్తే శుభ ఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు వెళ్లడం, చంద్రుడిని చూడడం లాంటి పనులు అస్సలు చెయ్యకూడదు. ఎందుకంటే ఇది శిశువుకు హానికరమని నమ్ముతారు.

సంపూర్ణ చంద్ర గ్రహణం ఈ రాత్రి 8:58 నుంచి కనిపిస్తుంది, 11:00 నుంచి 12:22 వరకు పూర్తిగా కనిపించనుంది. సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 2:25కి గ్రహణం ముగుస్తుంది. భారత్‌తో సహా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్రికా, యూరప్ దేశాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు ఈ సందర్భంగా తాత్కాలికంగా మూసివేయనున్నాయి.

గ్రహణ సమయంలో దైవ చింతన, జపం, ధ్యానం మానసిక శాంతిని ఇస్తాయి. గ్రహణానికి ముందు, తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి ముందు పట్టు స్నానం, తర్వాత విడుపు స్నానం. ఇవి గ్రహణ దోషాలను తొలగిస్తాయని నమ్ముతారు. మేష, వృషభ, కన్య, ధనుస్సు రాశుల వారికి సానుకూల ఫలితాలు సంభవించవచ్చు, అయితే మిథున, కర్కాటక, కుంభ, మీన రాశుల వారీకి పెద్ద ముప్పు అని అంటున్నారు. ఇప్పటి నుంచి ఆర్థిక సమస్యలు, ఖర్చులు ఎదుర్కొనే అవకాశం ఉంది. జాతకంలో గ్రహాల స్థానాలను బట్టి ఫలితాలు మారవచ్చు.

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క