Karthik Gattamneni
ఎంటర్‌టైన్మెంట్

Karthik Gattamneni: తొమ్మిది గ్రంథాలు దుష్టుల బారిన పడితే.. ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్

Karthik Gattamneni: సూపర్ హీరో తేజ సజ్జా (Teja Sajja) నటించిన మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ చిత్రం ‘మిరాయ్‌’ (Mirai Movie). కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamneni) దర్శకత్వం‌లో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో రాకింగ్ స్టార్ మనోజ్ మంచు (Manoj Manchu) పవర్ ఫుల్ పాత్రను పోషించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేసి, సినిమా కోసం ప్రేక్షకులు వెయిట్ చేసేలా చేశాయి. సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మీడియాకు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ..

మెయిన్ కాన్సెప్ట్ ఇదే..

‘‘మిరాయ్ స్టోరీ ఐడియా ఏడేళ్ల క్రితమే పుట్టింది. ఈ ఆలోచనకి ఇతిహాసాలని ఎలా ముడి పెట్టవచ్చనే ప్రాసెస్‌కే చాలా టైమ్ పట్టింది. చిన్నప్పటి నుంచి పురాణ ఇతిహాసాలను గురించి విన్న కథలు, ప్యాషనేటింగ్ ఎలిమెంట్స్‌తో ఈ కథని డెవలప్ చేశాను. ఇది మన రూటేడ్ కథలా వుంటుంది. ఆడియన్స్ తప్పకుండా కనెక్ట్ అవుతారు. అందిరికీ మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. అశోకుని వద్ద తొమ్మిది గ్రంధాలు ఉన్నాయానే ఒక మిత్ వుంది కదా.. ఆ తొమ్మిది పుస్తకాలు దుష్టుల బారిన పడితే, వాటిని మన ఇతిహాసాల ఆధారంగా ఎలా కాపాడవచ్చనేదే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం ఇతిహాసాల్లో, పురాణాల్లో వుంటుందనే నమ్మకంతో చేసిన కథ. ఈ కథని యాక్షన్ అడ్వంచర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. ఇది కంప్లీట్‌గా ఫిక్షనల్ స్టోరీ.. దాదాపు ప్రజెంట్‌లోనే జరుగుతుంది.

Also Read- Pushpa 3: ‘పుష్ప 3’ ప్రకటించిన సుక్కు.. ఈసారి ర్యాంపేజే!

రియల్ లొకేషన్స్‌లో..

ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు యాంబిషన్ చాలా పెద్దదని తెలుసు. ఈ సినిమా చేసిన ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్. నటీనటులందరినీ రియల్ లోకేషన్స్‌‌కి తీసుకెళ్ళాం. మంచు పర్వతాల్లో, ఎడారుల్లో, అడవుల్లో.. ఇలా అన్నిచోట్ల రియల్‌గానే చేశాం. మొత్తం షూటింగ్‌లో ఒక్క సీనియర్ యాక్టర్‌కి కూడా కార్వాన్ లేదు. వారి సపోర్ట్ వలన ఈ సినిమాకి ఇంత అద్భుతంగా వచ్చిందని భావిస్తున్నాను. శ్రీలంక, నేపాల్, రాజస్తాన్, బుర్జు, థాయిలాండ్.. ఇలా మొత్తం ఏసియా అంతా తిరిగేశాం. ఇందులో ఆరేడు యాక్షన్ సీక్వెన్స్‌లు వుంటాయి. తేజ ఈ సినిమా కోసం థాయిలాండ్‌లో శిక్షణ తీసుకున్నారు. మంచు మనోజ్‌ని తీసుకోవడానికి కారణం.. పాజిటివ్ సైడ్ ఉంటూ నేచురల్ అగ్రేషన్ ఉన్న ఒక యాక్టర్ అవసరం. మనోజ్ కరెక్ట్‌గా ఈ పాత్రకి సెట్ అవుతారు. అందులోనూ ఆయనకు మార్షల్ ఆర్ట్స్‌లో కూడా అనుభవం వుండటం చాలా హెల్ప్ అయింది. ఇందులో శ్రియా పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది. జయరాం అగస్త్య ముని పాత్రలో, జగపతి బాబు తాంత్రిక గురువు పాత్రలో కనిపిస్తారు. ఈ రెండు పాత్రలు కూడా కీలకంగా వుంటాయి.

Also Read- Kishkindhapuri: మొదట్లో వచ్చే ముఖేష్ యాడ్ లేకుండానే బెల్లంకొండ బాబు సినిమా.. మ్యాటర్ ఏంటంటే?

ఆడియన్స్‌కు స్పెషల్ సర్ప్రైజ్

అవుట్‌పుట్ మేము అనుకున్న దానికంటే బెటర్‌గా వచ్చిందనే ఫీలింగ్‌లో ఉన్నాం. ఇందులో ఒక ట్రైన్ సీక్వెన్స్ ఉంటుంది. అది పేపర్ మీద చూసుకున్నప్పుడు నిజంగా అలా చేయగలమా అని అనుకున్నాం. శ్రీలంకలో షూట్ చేశాం. చాలా అద్భుతంగా వచ్చింది.. అది ఆడియన్స్‌కు స్పెషల్ సర్ప్రైజ్. బడ్జెట్ పరంగా మేము అనుకున్న దానికంటే కొంచెం క్రాస్ అయ్యింది. నిర్మాత విశ్వప్రసాద్ మా విజన్‌కు పూర్తిగా సపోర్ట్ ఇచ్చారు. ఆయన ప్యాషన్‌తోనే సినిమా ఇంత గ్రాండ్‌గా వచ్చింది. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఆయన చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఈ సినిమాకు సీక్వెల్ చేసే పొటెన్షియల్ ఈ కథకి వుంది. ఈ సినిమాకి వచ్చే రిజల్ట్‌ని బట్టి సీక్వెల్ ఆలోచన చేస్తాం’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bigg Boss 9 Contestants: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లోకి అడుగు పెట్టిన మొత్తం కంటెస్టెంట్స్ వీరే..

Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. 11,12,13,14వ కంటెస్టెంట్స్‌గా ఎవరంటే! ట్విస్ట్ 15 కూడా!

TS BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి కొత్త ఇబ్బంది?. ఏ విషయంలో అంటే!

Heavy Rain In Warangal: వరంగల్ నగరంలో దంచికొట్టిన వర్షం.. పలుచోట్ల వరదలు

Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. రీతూ చౌదరి, డీమాన్ పవన్, సంజన!