Gaddam Prasad Kumar: మహిళలు తమకు నచ్చిన రంగాల్లో తమ నైపుణ్యాన్ని పెంచుకొని ఆర్థికంగా ఎదగాలని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో స్ఫూర్తి గ్రామీణ అభివృద్ధి సంస్థ వారి సౌజన్యంతో ఉచిత శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సీ మహిళకు ఉచిత కుట్టుమిషన్లు, సర్టిఫికెట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా స్పీకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత నిమిత్తం వివిధ రంగాల్లో మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటునందిస్తుందన్నారు.
కుట్టు మిషన్ లో శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ లు పంపిణీ
వికారాబాద్ జిల్లా(Vikarabad District) కేంద్రంలో 35 మంది మహిళలకు 90 రోజుల పాటు కుట్టు మిషన్ లో శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ లు పంపిణీ చేయడం సంతోషదాయకమన్నారు. కుట్టుమిషన్ల శిక్షణ పొందిన మహిళలు తమ కుటుంబాలకు ఆర్థిక తోడ్పడుకు ఎంతగానో దోహద పడుతుందన్నారు. కుట్టు మిషన్ లో నైపుణ్య శిక్షణ పొందిన మహిళల ఆర్థిక అభివృద్ధికి వివిధ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతను ఎస్సీ కార్పొరేషన్ అధికారులు తీసుకోవాలని స్పీకర్ సూచించారు. చదువుతోపాటు మహిళల్లో ఉపాధి కల్పనకు గాను ఉచిత నైపుణ్య శిక్షణలను ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు.
యువతను కూడా ప్రోత్సహించాలి
నైపుణ్య శిక్షణలను సద్వినియోగం చేసుకొని గ్రామీణ ప్రాంత యువతను కూడా ప్రోత్సహించాలని ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా మరిన్ని ఉచిత శిక్షణ కేంద్రాలను నిర్వహించేందుకు తల వంతు సహకారం అందిస్తానని స్పీకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం.సుధీర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్, ఆర్టిఏ సభ్యులు జాఫర్, స్ఫూర్తి గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి, టెక్నికల్ ట్రైనింగ్ ఇంచార్జ్ ప్రసన్న లు తదితరులు పాల్గొన్నారు.
Also Read: AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు