Viral Video (Image Source: twitter)
Viral

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Viral Video: ఉత్తర్ ప్రదేశ్ లక్నోలోని అమిటీ యూనివర్సిటీ (Amity University) లో సంచలన ఘటన చోటుచేసుకుంది. యూనివర్సిటీ పార్కింగ్ ప్రదేశంలోని ఓ కారులో సెకండ్ ఇయర్ లా విద్యార్థిపై తోటి స్టూడెంట్స్ దాడికి తెగబడ్డారు. ఆగస్టు 26న జరిగిన ఈ దాడి జరగ్గా.. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దాడి తర్వాత తన కుమారుడు తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు బాధితుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

45 నిమిషాల పాటు దాడి..
జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఆ రోజు బాధితుడు శిఖర్ (Shikhar Mukesh Kesarwani) తన స్నేహితుడు సౌమ్య సింగ్ యాదవ్ తో కలిసి కారులో క్యాంపస్‌కి వచ్చాడు. వారు పార్కింగ్‌కి చేరుకున్న వెంటనే కొంతమంది విద్యార్థులు అతని దగ్గరకు వచ్చి మాట్లాడాలని చెప్పి కారులోకి ఎక్కారు. ఆ తర్వాత అతనిపై దాదాపు 45 నిమిషాల పాటు దాడి, బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

బాధితుడి తండ్రి ఆవేదన
ఘటనకు సంబంధించి స్థానిక పోలీసు స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యింది. అందులో ఆయుష్ యాదవ్, జాన్వీ మిశ్రా, మిలయ్ బెనర్జీ, వివేక్ సింగ్, ఆర్యమన్ శుక్లా అనే ఐదుగురు విద్యార్థుల పేర్లను పోలీసులు చేర్చారు. నిందితుల్లోని ఆయుష్, జాన్వి అనే ఇద్దరు తన బిడ్డను 50-60 సార్లు చెంపదెబ్బ కొట్టారని శిఖర్ తండ్రి ఆరోపించారు. మిగతావారు ఆ దాడిని వీడియో తీసి క్యాంపస్‌లో వైరల్ చేశారని పేర్కొన్నారు. దాడి సమయంలో శిఖర్ ఫోన్ పగలగొట్టి.. మళ్లీ దాడి చేస్తామని హెచ్చరించారని వివరించారు.

Also Read: Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

101 సెకన్ల వీడియో వైరల్
శిఖర్ పై దాడికి సంబంధించిన 101 సెకన్ల వీడియో సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతోంది. అందులో జాన్వీ అనే యువతి.. శిఖర్ చెంపపై పదే పదే దాడి చేస్తూ కనిపించింది. చేతులు అడ్డుపెట్టుకోబోతుంటే కిందకి దించాలని బెదిరించింది. శిఖర్ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా మరో విద్యార్థి ఆయుష్ అతని చేతులను బలంగా అదిమిపట్టి దాడి చేశాడు. అంతేకాదు శిఖర్ ను దారుణంగా దుర్భాషలాడటం కూడా వీడియోలో స్పష్టంగా కనిపించింది.

Also Read: Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

యూనివర్శిటీ సైలెంట్..
ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందిన శిఖర్.. కళాశాలకు వెళ్లడం మానేశాడు. దీంతో బాధితుడి తండ్రి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అమిటీ యూనివర్సిటీ ఇప్పటివరకు ఈ ఘటనపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఆధారాలు, వైరల్ వీడియో ఆధారంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Also Read: Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Just In

01

Sahu Garapati: ‘కిష్కింధపురి’ గురించి ఈ నిర్మాత చెబుతుంది వింటే.. టికెట్ బుక్ చేయకుండా ఉండరు!

VV Vinayak: చాలా రోజుల తర్వాత దర్శకుడు వివి వినాయక్ ఇలా..!

Blast in Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లో పేలుడు.. పాక్‌లో షాకింగ్ ఘటన

Karthik Gattamneni: తొమ్మిది గ్రంథాలు దుష్టుల బారిన పడితే.. ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్

BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!