Ponguleti Srinivasa Reddy (imagecredit:twitter)
తెలంగాణ

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivasa Reddy: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండింటిని జోడేద్దుల వలె ముందుకు తీసుకువెలుతున్నామని, గత పాలకులు రాష్ట్రం పై 8.19 లక్షల కోట్ల అప్పులు మిగిలిపోయారని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivassa Reddy) అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని మంత్రి తెలిపారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, స్థానిక శాసన సభ్యులు తుది మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి ప్రారంభించారు.

రూ. 21 వేల కోట్లతో

ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడారు. రాష్ట్రం పైన ఇన్ని అప్పులు ఉన్నా ప్రతి నెల చేసిన అప్పులకు వడ్డీ చెల్లిస్తూనే అభివృద్ధి, సంక్షేమాన్ని జోడేద్దుల వలె ముందుకు తీసుకువెళుతున్నామని అన్నారు. ఇది ప్రజల దీవెనలతో ఏర్పడిన ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి అని ప్రజల చేత శభాస్ అని మెప్పులు పొందుతున్నారని అన్నారు. అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే సిలిండరు, రూ. 21 వేల కోట్లతో రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణ మాఫీ, గత ప్రభుత్వం సంవత్సరానికి ఎకరాకు 10 వేల చొప్పున రైతు భరోసా ఇస్తే ఈ ప్రభుత్వం 12 వేల చొప్పున ఇచ్చిందన్నారు. గత ప్రభుత్వం వారి వేస్తే ఉరి అని అంటే ఈ ప్రభుత్వం రైతును రాజు చేయాలనే ఉద్దేశ్యంతో సన్న రకం వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో కొత్తగా 7 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు పాత రేషన్ కార్డుల్లో పెళ్ళైన, పుట్టిన వారి పేర్లు కొత్తగా చేర్చడం జరిగిందన్నారు.

వందకు ఒకరిద్దరి మాత్రమే

రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) మాట్లాడుతూ గత పాలకుల ముందు ప్రభుత్వాలు నడిపిన పాలకులు 70 వేల కోట్ల రుణాలు చేస్తే గత పాలకులు 10 సంవత్సరాల్లో 8 లక్షల కోట్ల అప్పులు ప్రజల నెత్తిన పెట్టిపోయారన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని ప్రజలకు మాట ఇచ్చి వందకు ఒకరిద్దరి మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయిన వారందరూ త్వరగా ఇళ్ళు కట్టుకోవాలని సూచించారు.

Also Read: Madhya Pradesh: అత్యంత ఘోరం.. బాలికపై 2 సార్లు అత్యాచారం.. బెయిల్‌పై వచ్చి మరి!

గత పాలకుల మాదిరి

రాష్ట్ర పశుసంవర్ధక డైరీ క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి(Vakiti Srihari) మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్క నిరుపేద కుటుంబం సొంత ఇల్లు లేదు అని బాధపడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామనీ అన్నారు. రాష్ట్రంలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని ఇందుకోసం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5.00 లక్షల చొప్పున రూ. 22,500 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇందిరమ్మ ఇంటి మంజూరులో గత పాలకుల మాదిరి ముఖం చూసి బొట్టు పెట్టలేదని, పార్టీలకతీతంగా అర్హులైన వారికి పారదర్శకంగా ఇళ్ళు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇంటి నిర్మాణానికి డబ్బుల ఇబ్బందులు లేకుండా ప్రతి సోమవారం ఇంటి నిర్మాణం స్థాయి చూసి డబ్బులు వేయడం జరుగుతుందన్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి స్వయంగా ఫోన్ చేసి మీ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లు ఎందుకు ఆలస్యం అవుతుంది అని అడుగువున్నారని తెలిపారు.

పాలేరు నియోజకవర్గం తర్వాత

స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల సందర్భంగా వనపర్తి నియోజక వర్గంలో తూడి మేఘా రెడ్డిని గెలిపిస్తే వనపర్తి నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా అని మాట ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం నియోజక అభివృద్ధి కొరకు ఇప్పటికే రూ. 1000 కోట్లు ఒకసారి మరోసారి 280 కోట్లు మంజూరు చేయగా పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. అభివృద్ధి పరంగా రాష్ట్రంలో పాలేరు నియోజకవర్గం తర్వాత అంతటి ప్రాధాన్యత వనపర్తి నియోజకవర్గానికి కల్పించాలని మంత్రిని కోరారు. ప్రాంతంలో గిరిజనులు అధికంగా ఉన్నందున ఇందిరమ్మ ఇల్లు అదనంగా మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, మార్కెట్ కమిటి చైర్మన్ పి. శ్రీనివాస్ గౌడ్, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read: Shilpa Shetty fraud: ఆ దంపతులకు లుక్అవుట్ నోటీసులు అందజేత.. ఇక అదే తరువాయి!

Just In

01

Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు