Telangana Jagruthi: 18 ఏళ్లు మిమ్మల్ని కుటుంబ సభ్యులుగా చూసిన ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)పై విమర్శలు చేయడం ఏమిటని తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు మండిపడ్డారు. ప్రెస్ క్లబ్ లో రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జాగృతిలో పనిచేసిన నాయకులకు కవిత అండగా ఉన్నారని, నమ్ముకున్నవారికి పార్టీ పదవులతో పాటు కార్పొరేషన పదవులను సైతం ఇప్పించారన్నారు. వారిని రాజకీయంగా ఎదుగుదలకు సహకరించారని, అలాంటి కవిత(Kavitaha)పై కొంతమంది జాగృతిలో పనిచేసిన వారు ఇప్పుడు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.
తెలంగాణ జాగృతికి దూరం
19ఏళ్లు తమను అన్ని రకాల వినియోగించుకుని, ఇప్పుడు రోడ్డున పడేశారని ఎమ్మెల్సీ కవితపై కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్ నిప్పులు చెరిగారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఓ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా కవిత మాట్లాడినప్పటి నుంచి మేము తెలంగాణ జాగృతికి దూరం అయ్యామని ఆయన అన్నారు. కవిత లేఖ రాసినప్పటి నుంచే కేసీఆర్‌కు ఆమె వ్యతిరేకం అయ్యారని, అప్పటి నుంచే మేము జాగృతిని దూరం పెట్టామని గతలో విమర్షించారు. కేసీఆర్ కోసమే తెలంగాణ జాగృతికి పని చేశామని తేల్చిచెప్పారని, జాగృతి నాయకులం ఎప్పుడూ కేసీఆర్ కోసమే పని చేస్తామన్నారు ఈ వ్యాక్యలు నిరసనగా తెలంగాణ జాగృతి నాయకులు మీడియా సమావేశాన్ని ఎర్పాటు చేసి వారు మాట్లడిని మాటలను విమర్షించారు
Also Read: Drugs Seized: ఈ డ్రగ్ వాడితే.. డా.సమరంతో పనిలేదట.. నైజీరియన్ అరెస్ట్
మర్శించడం వెనుక కుట్ర
కవిత మీకు ఏం చేసిందో చర్చకు సిద్దమా? అని సవాల్ చేశారు. రాజకీయ రాజకీయ భవిష్యత్ ఇచ్చిన కవితపై మాట్లాడటం ఏమిటని నిలదీశారు. తామంతా కవిత వెన్నంటి ఉంటామని, ప్రాణాలు వదులు కుంటాం కానీ అక్కను కించపర్చం అని స్పష్టం చేశారు. కవితను మీరు విమర్శించడం వెనుక కుట్రదాగి ఉందన్నారు. కవితను విమర్శించేవారు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. కవితకు వెన్నుపోటు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో రాజకీయాల్లో కవిత పాత్ర ఎంతో కీలక మని వారు అన్నారు. కవిత గురించి మాట్లాడే టప్పుడు వారు ఎస్ధాయిలో ఉన్నారో గుర్తుంచుకోని మాట్లాడాలని అన్నారు.
Also Read: Huzurabad Farmers: రైతులకు తీరని యూరియా కష్టాలు.. టోకెన్ల కోసం తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు