Telangana Politics (imagecredit:twitter)
Politics

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Telangana Politics: ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ లో కవిత వ్యవహారంపై చర్చ జరిగినట్లు తెలిసింది. గత కొన్ని రోజుల నుంచి ఆమె వ్యవహరిస్తున్న తీరు, కేసీఆర్(KCR) కుటుంబికుల మీద చేస్తున్న విమర్శలపై పూర్తి స్థాయిలో కాంగ్రెస్ స్క్రీనింగ్ చేస్తున్నది. పదేళ్ల పవర్ లో ఉన్నప్పుడు, బీఆర్ ఎస్(BRS) పదవి కోల్పోయిన రెండేళ్ల పాటు మౌనంగా ఉండి, సడన్ గా విరుచుకుపడటంపై ఆరా తీస్తున్నది. ఆమెను కాంగ్రెస్ లోకి తీసుకోవాలని కొందరు తమ అభిప్రాయాలను వెల్లడించినప్పటికీ, అవినీతి మరకలు ఉన్నోళ్లను పార్టీలోకి తీసుకోకపోవడమే బెటర్ అంటూ మెజార్టీ మెంబర్లు విముఖత చూపినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ దెబ్బతీయాలని చూసిన కేసీఆర్ ఫ్యామిలీకి చెందిన ఆమె ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోవద్దని స్టేట్ పార్టీ ఏఐసీసీ కి సమాచారం ఇచ్చింది. పీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్(PCC Mahesh Kumra Goud) కవితను చేర్చుకోవద్దనే రిపోర్టు ఇచ్చారు. ఆమెను కాంగ్రెస్ లోకి తీసుకోవాల్సిన అవసరం తమకు లేదని ఆయన తేల్చి చెప్పడం గమనార్హం. ఏఐసీసీ(AICC) కి కూడా ఇదే వివరించినట్లు పీసీసీ చీఫ్​ వెల్లడించారు. అయితే రాజకీయల్లో తుది నిర్ణయాలు కొన్ని సార్లు ఊహించని విధంగానే ఉంటాయని కొందరు నేతలు స్పష్టం చేస్తున్నారు.

క‌విత వెనుక కేసీఆర్..? ఢిల్లీకి రిపోర్టు…?

కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో జ‌రిగిన అవ‌త‌వ‌క‌లపై విచార‌ణ జ‌రిపిన జ‌స్టిస్ పీసీ ఘోష్ క‌మిష‌న్(Justice PC Ghose Commission) త‌న 665 పేజీల నివేదికలో గత ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను బాధ్యుడిని చేసిన విష‌యం తెలిసిందే. బ్యారేజీల వైఫ‌ల్యం వెనుక‌ ప్ర‌త్యేక్షంగా, ప‌రోక్షంగా కేసీఆర్ పాత్ర ఉంద‌ని క‌మిష‌న్ స్ప‌ష్టం చేసింది. ప్లానింగ్‌, నిర్మాణం, నిర్వ‌హ‌ణ‌, వాట‌ర్ స్టోరేజీ స‌హా ప్ర‌తి అంశంలో గ‌త సీఎం జోక్యం చేసుకున్నార‌ని త‌ప్పుబ‌ట్టింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌ను కుదిపేస్తున్న ఈ వ్య‌వ‌హారం నుంచి రాజ‌కీయంగా బ‌య‌ట‌ప‌డేందుకు కేసీఆర్ ప్ర‌త్యేక వ్యూహాన్ని ర‌చించారని, అందులో క‌విత(Kavitha) కీల‌క పాత్ర పోషిస్తున్నారనే ప్ర‌చారం రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా నడుస్తున్నది. టీపీసీసీ(TPCC) కూడా ఏఐసీసీకి ఇదే వివరించింది. ఆమె సస్పెన్షన్, ఎమ్మెల్సీ, పార్టీ పదవి, సభ్యత్వాల రాజీనామాల తర్వాత ఇచ్చిన స్పీచ్ లలో కేసీఆర్, కేటీఆర్ లను రక్షించే విధంగా ఉన్నట్లు టీపీసీసీ నివేదికలో పేర్కొన్నది.

Also Read: Mahabubabad District: జీవో నెంబర్ 99 తోమాల విద్యార్థుల భవిష్యత్తును నాశనం

కేసీఆర్‌ను ర‌క్షించే ప్ర‌య‌త్నం

“కాళేశ్వ‌రం అవినీతిలో కేసీఆర్ తప్పు లేదు.. చేసిందంతా హ‌రీష్‌రావు, సంతోష్ రావులే” అని క‌విత వ్యూహత్మకంగా వ్యవహరించినట్లు పార్టీ తన నివేదికలో స్పష్టం చేసింది. త‌ద్వారా కాళేశ్వ‌రం అవినీతి మ‌ర‌క‌ల నుంచి కేసీఆర్‌ను ఆమె ర‌క్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే విష‌యాన్ని గమనించాల్సి ఉంటుందని వివరించారు. కాళేశ్వ‌రంపై విచార‌ణ‌ను సీబీఐ(CBI)కి అప్ప‌గించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన త‌రువాతే ఇలాంటి వ్యవహారం జ‌రుగుతున్నాయ‌నే విష‌యాన్ని గమనించాలని పార్టీ ఏఐసీసీకి వెల్లడించింది.

వచ్చే ఎన్నికలకూ కీలక అజెండా…

కాళేశ్వరం కేసు సీబీఐకి అప్ప‌గింత‌పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అసెంబ్లీలో ప్ర‌క‌ట‌న త‌రువాతే ఇవ‌న్నీ జ‌రుగుతున్నాయి. వాస్తవానికి ఒక్క‌సారి సీబీఐ విచార‌ణ మొద‌లైంద‌టే వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు బీఆర్ఎస్ మ‌నుగ‌డ‌కు కాళేశ్వ‌రం అవినీతి స‌వాల్ విసురుతూనే ఉంటుంది. త‌దుప‌రి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈ వ్య‌వ‌హారం అతిపెద్ద రాజ‌కీయ అజెండాను సెట్ చేసే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఈ నేప‌థ్యంలోనే బీఆర్ఎస్‌ను ర‌క్షించుకోవ‌డానికి, కాళేశ్వ‌రం అవినీతి నుంచి ప్ర‌జ‌ల‌ దృష్టి మ‌ర‌ల్చ‌డానికి కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా క‌విత‌ను రంగంలోకి దింపార‌నే ప్ర‌చారం విస్తృతంగా జ‌రుగుతున్నట్లు పార్టీ ఢిల్లికి వివరించింది. అందుకు అనుగుణంగానే “కాళేశ్వ‌రం అవినీతిలో కేసీఆర్ త‌ప్పులేదు” అనే న్యారేటివ్‌ను ఉనికిలోకి కవిత తెచ్చి..హ‌రీష్ రావు, సంతోష్ రావుల‌పైకి నెపం నెట్టేశార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోందని టీపీసీసీ వెల్లడించింది.

బీఆర్ఎస్ క్యాడ‌ర్ ప‌క్క‌చూపులు

ప్ర‌జ‌ల‌ను న‌మ్మించేలా క‌విత తన వాణి వినిపిస్తున్నారనే ప్ర‌చారం చేస్తూ.. బీఆర్ఎస్ క్యాడ‌ర్ ప‌క్క‌చూపులు చూడ‌కుండా ఉండేందుకు కవితస్ట్రాటజీ అమలు చేస్తుందని రాష్ట్ర పార్టీ ఢిల్లీ(Delhi) పెద్దలకు నివేదించింది. కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో జ‌రిగిన‌ అవినీతి, అక్ర‌మాలను కాంగ్రెస్(Congress) ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్ల‌డం, గ్రామ‌గ్రామానా దీనిపై చ‌ర్చ జ‌రుగుతుండ‌డంతో కేసీఆరే కవిత రూపంలో ఈ వ్యూహానికి తెర‌లేపిన‌ట్టు పార్టీ ఏఐసీసీ నాయకులకు రిపోర్టు చేసింది.కేసీఆర్ వ‌దిలిన బాణ‌మే క‌ల్వ‌కుంట్ల క‌విత అని టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ అగ్రనేతలకు వివరించారు.

Also Read: Tummala Nageswara Rao: వ్యవసాయ శాఖ వాట్సాప్ ఛానెల్.. ఇకపై అన్నీ అందులోనే..?

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్