Nagarkurnool Politics ( IMAGE credit: swtcha reporter)
Politics, నార్త్ తెలంగాణ

Nagarkurnool Politics: నాగర్ కర్నూల్ జిల్లాలో రాజకీయ వేడి… మర్రి మాటలకు కూచుకుళ్ల కౌంటర్

Nagarkurnool Politics: నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, (Marri Janardhan Reddy)నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి(MLA Dr. Rajesh Reddy)పై యూరియా ధర్నా సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఏ పని కావాలని అడిగితే పప్పాతో చెప్పాలంటారని, అటు ఇటు కానోనికి ఎన్నికల్లో ఓటు వేశారని, ఎమ్మెల్యే చేశారని, అసలు ఎమ్మెల్యేది ఏ ఊరో తెలుసా అంటూ… ధర్నాకు వచ్చిన కార్యకర్తలతో చులకన చేసేలా ప్రవర్తించారు. ఇలా మర్రి వ్యక్తిగతంగా చేసిన విమర్శలు కూచుకుళ్ల కుటుంబంలో, కాంగ్రెస్ శ్రేణుల్లో కాక పుట్టించింది.

 Also Read: Anushka prostitution racket: వ్యభిచారం చేయిస్తూ అడ్డంగా బుక్కయిన నటి అనుష్కా.. ఎలా పట్టుకున్నారంటే?

రాజకీయ కక్షపూరిత చర్యలు

ఎమ్మెల్యేగా ఎన్నికైన గత 20 నెలల కాలంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి,(Rajesh Reddy) మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి (Marri Janardhan Reddy)ని ఏనాడూ విమర్శించలేదు. అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతున్నారు. సున్నిత మనస్కుడైన తన తండ్రి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి బాటలోనే నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుల పట్ల దురుసుగా మాట్లాడటం గాని రాజకీయ కక్షపూరిత చర్యలు కానీ చేపట్టలేదు. కాగా ఇటీవల బీఆర్ఎస్ పార్టీ యూరియా కోసం చేపట్టిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాటలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిని చులకనగా చేసేలా కొనసాగాయి. దీంతో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సైతం అంతే స్థాయిలో మర్రి జనార్దన్ రెడ్డికి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

జనార్దన్ రెడ్డి గతంలో షాడో ఎమ్మెల్యే

ఎంఎల్సీగా ఉన్న తాను తన కొడుకుకు సలహాలు ఇవ్వడం తాను తన కొడుకు సలహాలు తీసుకోవడం సహజమే అన్నారు అదే మరి జనార్దన్ రెడ్డి గతంలో షాడో ఎమ్మెల్యేగా పేరు ఉన్న జక్కా రఘునందన్ రెడ్డి సలహాలు సూచనలతోనే పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేశారని విమర్శించారు. కనీసం తన కొడుకు ప్రేమించిన అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోనీయకుండా కూడా ఇబ్బంది పెట్టిన తీరు మరి జనార్దన్ రెడ్డిది అని వ్యక్తిగతంగా విమర్శించారు అంతటితో ఆగకుండా మర్రి నియోజకవర్గంలో భూదందాలు, మట్టి తరలింపులో హస్తం, రియల్టర్లకు అనుకూలంగా పరిపాలన చేశారన్నారు. మర్రి క్యాంటీన్ ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలంలో నిర్మించడంతోపాటు ఇప్పటికీ కనీసం పన్ను చెల్లించడం లేదన్నారు.

సంస్కారహీనంగా మాట్లాడటం సహించం

దోచుకున్న సొమ్ములో పేదలకు కొంతైనా క్యాంటీన్ ద్వారా పంచుతున్నారనే మానవతా దృక్పథంతోనే తాము క్యాంటీన్ జోలికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. మర్రి సంస్కారహీనంగా మాట్లాడటం సహించమని హెచ్చరించారు. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కలిసిమెలిసి సాగిన మర్రి, కూచుకుళ్ల ఇప్పుడు ప్రత్యర్థులు గా ఒకరినొకరు విమర్శించుకోవడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేగుతుంది. ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న నాగర్‌కర్నూల్ నియోజకవర్గ రాజకీయాల్లో ఇరువురి నేతల మాటలు స్థానిక ఎన్నికలకు ముందే పంటలు పుట్టించాయి. ఈ వ్యాఖ్యలు ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులకు సైతం తాకాయి. కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు కూడా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ పరస్పరం సవాళ్లు ప్రతి సవాలు విసురుకుంటున్నారు.

 Also Read: Japanese woman: అంతరిక్షంలో చిక్కుకున్నా.. ఆక్సిజన్ కావాలంటూ.. డబ్బు దోచేసిన ఫేక్ వ్యోమగామి

Just In

01

Jubliee Hills Bypoll: జూబ్లీలో పోలింగ్ పెంచేందుకు కొత్త ప్లాన్.. రంగంలోకి యూసీడీ, స్వయం సహాయక బృందాలు!

Crime News: ఓ యువకుడు గంజాయి సేవిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్..!

Vijayawada Airport Fire: గన్నవరం విమానశ్రయంలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడ్డ మంటలు

CM Revanth Reddy: రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు.. అధికారులకు సీఎం వార్నింగ్..!

Harish Rao Father Death: హరీశ్ రావు తండ్రి మరణం.. సీఎం రేవంత్ సంతాపం.. పరామర్శించిన కేసీఆర్