Final Team | ఫైనల్ జట్టు ఇదే! దిగ్గజ క్రికెటర్‌ రివీల్‌
Sunil Gavaskar Suggests India Should Opt For 3 Spinners Two Fast Bowlers t20 WorldCup
స్పోర్ట్స్

Final Team: ఫైనల్ జట్టు ఇదే! దిగ్గజ క్రికెటర్‌ రివీల్‌

Sunil Gavaskar Suggests India Should Opt For 3 Spinners Two Fast Bowlers t20 WorldCup: జూన్‌ 2 నుంచి మహా సంగ్రామం షురూ కానుంది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్‌కు అమెరికా వెస్టిండీస్ ఉమ్మడిగా అతిథ్యం ఇస్తున్నాయి. వన్డే ప్రపంచ కప్‌ను తృటిలో చేజార్చుకున్న భారత్‌ పొట్టి కప్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఈసారి కప్‌ను ముద్దాడాలని పక్కా ప్రణాళికలతో అమెరికాలో ఎంట్రీ ఇచ్చింది.

అయితే ప్రత్యర్థితో జట్టు కూర్పుతోనే భారత్ ఎక్కువగా పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది. గాయాల నుంచి కోలుకున్న రిషబ్‌ పంత్, హార్దిక్ పాండ్య రీ ఎంట్రీ ఇవ్వడంతో జట్టు బలోపేతంగా మారింది. ఇందులో మరో చిక్కు ఏర్పడి అంతా గందరగోళంగా మారింది. అంతేకాక ప్రపంచకప్‌కి ఎంపిక చేసిన భారత జట్టులో కొందరు ఫామ్ కోల్పోవడం ఆందోళనకరంగా మారింది. అయితే సూపర్ 8 మ్యాచ్‌లు జరిగే వెస్టిండిస్ పిచ్‌లపై సమతూకమైన బౌలింగ్ దళంతో భారత్ బరిలోకి దిగాలని దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్ సూచించాడు. శివమ్ దూబె, హార్ధిక్‌ పాండ్య తుదిజట్టులో ఉండాలని పేర్కొన్నారు. హార్దిక్‌ని బ్యాకప్ పేసర్ ఆప్షన్‌గా ఉపయోగించుకోవాలని తెలిపాడు.

Also Read: చెస్ టోర్నీలో గ్రాండ్‌ మాస్టర్‌ ఓటమి

ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో టీమిండియా తుదిజట్టు ఎంపిక చేయాలని అన్నాడు. వెస్టిండిస్‌లో మన బౌలింగ్‌ ఎటాక్ సమతూకంగా ఉండాలని సూచించాడు. అప్పుడే జట్టు బ్యాలెన్సింగ్ ఉంటుందని అన్నాడు. ప్రస్తుతం టీమిండియా అనుభవజ్ఞులు, యువతతో గొప్పటగా ఉంది. రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రాతో పాటు యువ ప్లేయర్లు యశస్వీ జైస్వాల్, శివమ్ దూబె, రిషబ్‌ పంత్‌తో జట్టు బలోపేతంగా ఉందని సునీల్ గవాస్కర్ అన్నాడు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..