Manchu Manoj: సూపర్ హీరో తేజ సజ్జా (Teja Sajja) హీరోగా రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్’ (Mirai). కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రాకింగ్ స్టార్ మనోజ్ మంచు (Manchu Manoj) విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేయగా, సెప్టెంబర్ 12న ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా రాకింగ్ స్టార్ మనోజ్ మంచు మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. (Manoj Manchu Interview)
బద్దకంగా వుండేవాడు బతకకూడదు
‘‘మిరాయ్ ప్రాజెక్ట్‌లోకి నేను రావడానికి కారణం.. నాకు కార్తిక్ ఎప్పటినుంచో తెలుసు. అలాగే తేజ చిన్నప్పటి నుంచి తెలుసు. తను చాలా క్యూట్‌గా ఉంటాడు. ఎక్కడ కనిపించినా బుగ్గలు గిల్లేసేవాడిని. తను ఒక ఈవెంట్‌లో కలిసినప్పుడు ‘మంచి స్క్రిప్ట్ వుంటే కలిసి సినిమా చేద్దాం తమ్ముడు’ అని చెప్పాను. ‘నిజమా అన్నా’ అన్నాడు. ఓ రోజు మా గేమింగ్ స్టూడియోలో వున్నప్పుడు తేజ వచ్చి ‘మిరాయ్’ గురించి చెప్పాడు. కథ, మా ఇద్దరి పాత్రల గురించి ఇప్పుడే ఎక్కువ రివీల్ చేయకూడదు. కార్తిక్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ముఖ్యంగా శ్రీరాముల వారి నేపథ్యం, తొమ్మిది పుస్తకాల బ్యాక్ డ్రాప్, ఇతిహాసల కోణం ఇలా కథ అద్భుతంగా అనిపించింది. అలాగే ఇందులో నా పాత్ర చాలా పవర్ ఫుల్‌గా వుంటుంది. బద్దకంగా వుండేవాడు బతకకూడదనే క్యారెక్టర్. కార్తిక్ చాలా అద్భుతంగా నా పాత్రను డిజైన్ చేశాడు. చాలా స్పెషల్ కేర్ తీసుకున్నాం. ఇంకా చెప్పాలంటే నా పాత్రని మోడరన్ రావణతో పోల్చుకోవచ్చు, కానీ ఆడవారి జోలికి మాత్రం వెళ్లడు.
Also Read- OG Ticket: రూ. 5 లక్షలకు ఓజీ టికెట్ సొంతం చేసుకున్న వారు సంచలన నిర్ణయం
రజినీకాంత్ ఆశీర్వదించారు
సూపర్ స్టార్ రజినీకాంత్ సార్‌ని ‘కూలీ’కి ముందు కలిశాను. ‘మిరాయ్’ ట్రైలర్ చూపించగా, ఆయనకు చాలా నచ్చింది. ఇలాగే కంటిన్యూ చెయ్, ఇక గ్యాప్ లేకుండా సినిమాలు చేయ్ అని ఆశీర్వదించారు. చాలా ఎంకరేజ్ చేశారు. మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చారు. నా లైఫ్‌లో హైయస్ట్ రెస్పాన్స్ వచ్చిన ట్రైలర్ ఇది. ఇనిషియల్ డేస్‌లో ‘మిస్టర్ నూకయ్య, నేను మీకు తెలుసా’ సినిమాలకు కూడా చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఈ స్కేల్‌లో సినిమా రావడం, ప్రపంచం నలుమూలల నుంచి రెస్పాన్స్ రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్. ఇంత అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్‌కు రుణపడి ఉంటాను. ఇందులోని యాక్షన్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. అలాగే నాకు చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ వచ్చు. హైదరాబాద్‌లో జాక్సన్ మాస్టర్ దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. దాదాపు 8 నెలల ప్రాక్టీస్ చేశాను. ‘మిరాయ్’ నా కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది.
Also Read- Allu Arjun and Anushka: ‘పుష్ప’ యూనివర్స్‌లో ‘ఘాటి’ కూడా భాగమా?.. పుష్పరాజ్‌తో షీలావతి!
నెక్స్ట్ సినిమాలివే..
కొత్తగా ‘డేవిడ్ రెడ్డి, రక్షక్’ అనే సినిమాలు చేస్తున్నాను. ఈ రెండూ కూడా హై ఇంటర్సిటీ యాక్షన్ ఉన్న సినిమాలు. అలాగే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న స్క్రిప్ట్ కోసం చూస్తున్నాను. ప్రస్తుతం ‘డేవిడ్ రెడ్డి’కి సంబంధించి వర్క్ షాప్స్ జరుగుతున్నాయి. తమిళ్ నుంచి కూడా కొన్ని కథలు వస్తున్నాయి. ఒక నటుడిగా అన్ని భాషల్లో సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. ‘అహం బ్రహ్మాస్మి’, ‘వాట్ ద ఫిష్’ సినిమాలు కూడా సమయం వచ్చినప్పుడు వస్తాయి. ఇవి కాకుండా ‘నేను మీకు తెలుసా’ టీమ్‌తో ఒక సినిమా చేయాలనే ఆలోచన ఉంది. త్వరలో నా సినిమాల ప్రకటనలు వస్తాయి’’ అని తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు