Mutton-Soup(image :X)
ఎంటర్‌టైన్మెంట్

Mutton Soup:  ‘మటన్ సూప్’ నుంచి మాస్ సాంగ్ రిలీజ్.. ఈల కొట్టించే ఫోక్ లిరిక్స్

Mutton Soup: ఎప్పుడూ కొత్త కథలను తీయడంలో, ప్రోత్సహించడంలో టాలీవుడ్ దర్శకులు నిర్మాతలు ముందుంటారు. అలాంటి సినిమాతోనే మన ముందుకు వస్తుంది ‘మటన్ సూప్’ అనే సినిమా. తాజాగా ఈ సినిమా నుంచి ‘కల్లు కొట్టు కాడ’ సాంగ్ విడుదల చేశారు ప్రముఖ నటుడు, నిర్మాత మురళీ మోహన్. రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు బ్యానర్లపై రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం ‘మటన్ సూప్’. ‘విట్‌నెస్ ది రియ‌ల్ క్రైమ్‌’ ట్యాగ్ లైన్‌. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి నిర్మాతలుగా రానున్న ఈ నూతన చిత్రానికి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌, మోష‌న్ పోస్ట‌ర్‌, పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రీసెంట్‌గా తనికెళ్ల భరణి రిలీజ్ చేసిన ‘హర హర శంకరా’ అనే పాట కూడా మంచి ప్రశంసల్ని దక్కించి, మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది. తాజాగా ప్రముఖ నటుడు మురళీ మోహన్ గారు ‘కల్లు కొట్టు కాడ’ అంటూ సాగే మరో మంచి మాస్ ఎనర్జిటిక్ నంబర్‌ను రిలీజ్ చేశారు. ఈ ప్రత్యేక గీతాన్ని సూరన్న రచించారు. సూరన్న, రేలారే రేలా గోపాల్, సుజాత వాసు కలిసి ఆలపించిన ఈ పాటకు వెంకీ వీణ అందించిన బాణీ ఎంతో క్యాచీగా ఉంది. ఇక లిరికల్ వీడియోని చూస్తుంటే సత్య మాస్టర్ కొరియోగ్రఫీ మరో స్పెషల్ అట్రాక్షన్ కానున్నట్టుగా కనిపిస్తోంది.

Read also-Coolie OTT: అఫీషీయల్.. ‘కూలీ’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే..

మురళీ మోహన్ మాట్లాడుతూ .. ‘‘యంగ్ టీం చేసిన ఈ ప్రయత్నానికి పెద్ద సక్సెస్ దక్కాలి. సాంగ్ చాలా బాగుంది. అల వైకుంఠపురములో సూరన్న మంచి పాటను పాడారు. జాన పద గీతాలు ప్రస్తుతం ఎక్కువ సక్సెస్ అవుతున్నాయి. ‘మటన్ సూప్’ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. చిత్ర దర్శకుడు రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ .. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. ఈ పాట ఎస్ఆర్‌కే వల్లే పుట్టింది. గోపాల్ గారు లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఉండేది కాదు. మా అన్న, రామకృష్ణ నాకు ఈ ప్రయాణంలో అండగా నిలిచారు. మా హీరో రమణ్ సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. మా సినిమాను పర్వతనేని రాంబాబు నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లారు. త్వరలోనే ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతోన్నామ’ని అన్నారు.

Read also-OG USA Box Office: యూఎస్‌‌‌‌లో ‘ఓజీ’ తుఫాన్.. ప్రీ సేల్స్‌‌లో ఆ మార్క్ దాటిన సినిమాగా రికార్డ్

నిర్మాత మల్లిఖార్జున ఎలికా (గోపాల్) మాట్లాడుతూ .. ‘‘కల్లు కొట్టు కాడ’ సాంగ్ చాలా బాగా వచ్చింది. వెంకీ వీణ మంచి బాణీని ఇచ్చారు. ఈ పాట వినగానే గ్రాండ్‌గా తీయాలని ఫిక్స్ అయ్యాం. త్వరలోనే మా ‘మటన్ సూప్’ చిత్రం ఆడియెన్స్ ముందుకు రాబోతోంది’ అని అన్నారు. నిర్మాత రామకృష్ణ సనపల మాట్లాడుతూ .. ‘ఇలాంటి పెద్దల సహకారం వల్లే మా లాంటి చిన్న నిర్మాతలు, మాలాంటి వాళ్లు తీసే చిన్న చిత్రాలు నిలబడుతున్నాయి. త్వరలోనే మా సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతోన్నామ’ని అన్నారు.

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు