Prabhas: అనుష్క శెట్టి, ప్రభాస్ ల మధ్య స్నేహం తెలుగు సినిమా అభిమానులకు ఎప్పుడూ ఆసక్తికరమైన అంశం. వీరిద్దరూ ‘బిల్లా’ (2009), ‘మిర్చి’ (2013), ‘బాహుబలి’ సిరీస్ (2015, 2017) వంటి చిత్రాల్లో కలిసి నటించారు. వీరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఫ్యన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నప్పటికీ, వారి ఆఫ్-స్క్రీన్ స్నేహం కూడా ఎంతో చర్చలకు దారి తీసింది. అనుష్క ప్రభాస్‌ను తన “3 AM ఫ్రెండ్”గా పిలిచింది, అంటే ఎప్పుడైనా సమస్య వచ్చినా మాట్లాడగలిగే సన్నిహిత స్నేహితుడని చెప్పింది. వీరి స్నేహం 15 ఏళ్ళకు పైగా కొనసాగుతోంది. ఈ బంధం వారి సినిమాల్లోని కలయిక కంటే లోతైనదని అనుష్క ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.
Also Read: Kim Jong Un: పుతిన్‌తో కిమ్ భేటీ ముగిసిన వెంటనే సీటును శుభ్రం చేసిన భద్రతా సిబ్బంది.. కారణం ఇదే!
అనుష్క అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఘాటి’ సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది. ఈ మేరకు అనుష్క క్లోజ్ ఫ్రెండ్, రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఘాటీ’ రిలీజ్ గ్లిమ్ప్స్ రిలీజ్ చేస్తూ మూవీ ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. “ఘాటి టీజర్ చాలా ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా ఉంది. ఈ శక్తివంతమైన పాత్రలో నిన్ను చూడటానికి ఎదురుచూడలేకపోతున్నాను. స్వీటీ అంటూ ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ పెట్టారు.
Also Read: Kim Jong Un: పుతిన్‌తో కిమ్ భేటీ ముగిసిన వెంటనే సీటును శుభ్రం చేసిన భద్రతా సిబ్బంది.. కారణం ఇదే!
అయితే, వీరి స్నేహం గురించి ఇప్పటికే ఎన్నో పుకార్లు కూడా వచ్చాయి. కొందరు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారంటూ అనేక వార్తలు చేశారు. 2023లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, ప్రభాస్, అనుష్కల కుటుంబాలు వీరి స్నేహం ప్రేమగా మారాలని కోరుకుంటున్నాయని, కానీ వీరిద్దరూ అందుకు సిద్ధంగా లేరని తెలిపింది. అనుష్క, ప్రభాస్ ఇద్దరూ ఈ పుకార్లను ఎప్పటికప్పుడు ఖండించారు. “మేము కేవలం మంచి స్నేహితులం, అంతకు మించి ఏమీ లేదు,” అని అనుష్క 2018లో స్పష్టం చేసింది. ప్రభాస్ కూడా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటానికి ఇష్టపడనని, పెళ్లి నిర్ణయం తీసుకుంటే ముందు మీడియా మిత్రులకు తెలియజేస్తానని తెలిపాడు.