Land Kabza Three Tahsildars Arrested In Nalgonda District
క్రైమ్

Land Mafia: కబ్జా కేసులో ముగ్గురు తహసీల్దార్ల అరెస్ట్

– 9 ఎకరాల అసైన్‌లాండ్‌కు పట్టాలు
– పాత తహసీల్దార్ సంతకం ఫోర్జరీ
– దీనిపై పిల్ దాఖలు చేసిన లాయర్ మార్తి వెంకట్ రెడ్డి
– ఎట్టకేలకు నిందితులపై చర్యలు

Land Kabza Three Tahsildars Arrested In Nalgonda District: నల్గొండ జిల్లా నిడమనూరు మండలం తుమ్మడం శివారులోని ప్రభుత్వ అసైన్డ్ భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డ కబ్జాకోరులకు ఎట్టకేలకు చెక్ పడుతోంది. 2022 నాటి ఈ కబ్జా కేసులో ఇప్పటికి ఆరుగురు నిందితులను రిమాండ్‌కు తరలించగా పరారీలో ఉన్న నాటి ఎమ్మార్వోల కోసం పోలీసుల గాలింపు జరుగుతోంది. అదే విధంగా ఈ వ్యవహారంలో ప్రభుత్వం భూమికి పట్టాలు పొందిన మరో ఐదుగురిమీదా తాజాగా ఎఫ్ఐఆర్ నమోదైంది. నాటి అక్కడి తహసీల్దార్ ఎడ్ల ప్రమీల, విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలకు ఉపక్రమించారు.

కేసు నేపథ్యం ఇదీ …

వివరాల్లోకి వెళితే, 2022లో నల్గొండ జిల్లాలోని నిడమనూరు మండలం తుమ్మడం శివారులోని 9 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిపై మార్తువారి గూడేనికి చెందిన మార్తి సురేందర్ రెడ్డి, బొమ్ము శ్రీనివాస్ తదితరులు కన్నేశారు. తమ పథకంలో భాగంగా ముందుగా వీరు దీనిపై కన్నేసిన అక్రమార్కులు ముందుగా 2007లో నిడమనూరు తహసీల్దార్‌గా పనిచేసిన విద్యాసాగర్ సంతకాలను అక్కడ వీఆర్‌వో ముదిగొండ సుమన్ చేత ఫోర్జరీ చేయించారు. అనంతరం అసైన్మెంట్ కమిటీ తీర్మానం లేకుండానే పట్టాలు పుట్టించారు. అయితే, దీనిపై 2022లో మార్తివారిగూడెం వాసి, న్యాయవాది మార్తి వెంకట్‌రెడ్డి రెండేళ్ల క్రితం హైకోర్టులో పిల్‌ వేయగా, దీనిపై స్పందించిన కోర్టు సమగ్ర విచారణ చేసి వివరాలు సమర్పించాలని కోరింది. దీంతో ఈ వ్యవహారంపై నాటి కలెక్టర్ ​ప్రశాంత్​జీవన్​పాటిల్​ఆదేశాల మేరకు నిడమనూరు పీఎస్‌లో కేసు నమోదు చేశారు. అనంతర కాలంలో ఈ కేసును నల్లగొండకు బదిలీ చేశారు.

Also Read:నిండు ప్రాణాన్ని బలిగొన్న ప్రైవేట్ హాస్పిటల్!

టాస్క్‌ఫోర్స్ విచారణలో ఈ వ్యవహారంలో ఈ కేసులో గతంలో నిడమనూరు మండలంలో అప్పట్లో తహసీల్దార్లుగా పని చేసిన మందడి నాగార్జున రెడ్డి (ప్రస్తుతం హుజూర్‌నగర్‌ తహసీల్దార్‌), గుగులోత్ దేశ్యానాయక్(ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో తహసీల్దార్‌), ఏఆర్​నాగరాజు, తుమ్మడం వీఆర్వోగా పని చేసిన ముదిగొండ సుమన్‌తో సహా మొత్తం 9 మందికి భాగస్వామ్యం ఉన్నట్లు తేలింది. వీరిలో నాగార్జునరెడ్డి, దేశ్యానాయక్‌, ఏఆర్‌ నాగరాజు అనే ముగ్గురు తహసీల్దార్లతో పాటు తుమ్మడం వీఆర్‌వోగా ఉన్న ముదిగొండ సుమన్‌‌తో బాటు అక్రమంగా భూములు పొందిన మార్తువారిగూడానికి చెందిన మార్తి సురేందర్​రెడ్డి, బొమ్ము శ్రీనివాస్, మరో నలుగురినిరిమాండ్‌కు తరలించారు.

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది