Kavitha: గులాబీ నేతల్లో కవిత గుబులు మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ(BRS Party) అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఏ అవినీతి చేశారనేది కవితకు తెలుసు అనే ప్రచారం జరుగుతుంది. పార్టీ నుంచి సస్పెండ్ కు గురైన తర్వాత బీఆర్ఎస్ నేతలు చేసిన తప్పిదాలను వెల్లడిస్తుంది. పార్టీ ని అడ్డంపెట్టుకొని ఎవరు ఏం చేశారనేది బయటపెడుతుండటంతో ఎప్పుడు ఎవరి పేరు మీడియా ముందు చెబుతుందనే జంకు మొదలైంది.
బీఆర్ఎస్ పార్టీ(BRS Party)లో ఉద్యమకాలం నుంచి సుమారు 20ఏళ్ల వరకు కీలకంగా పనిచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నేతల శైలీపైనా దృష్టిసారించినట్లు ప్రస్తుతం కవిత(Kavitha) వెల్లడిస్తున్న వివరాలతో స్పష్టమవుతోంది. కేసీఆర్(KCR) నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ప్రభుత్వం కోరడంతో కవిత(Kavitha) విమర్శలకు పదును పెట్టింది. తెలంగాణకోసం కృషిచేసిన కేసీఆర్ పై అవినీతి మరకకు కారణం హరీష్ రావు, సంతోష్ రావు అని విమర్శలు చేసింది.
Also Read: Little Hearts Hero: ఎప్పుడో, ఎవరినో, ఏదో అన్నానని బాయ్‌కాట్ అంటున్నారు.. అసలు మీరు మనుషులేనా?
తెరమీదకు పోచంపల్లి శ్రీనివాస్ , నవీన్ రావు పేర్లు
అంతటి తో ఆగకుండా పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్,(MLC Pochampally Srinivas,) నవీన్ రావు పేర్లను తెరమీదకు తెచ్చింది. వారు సంతోష్ రావు(Santhosh Rao) తో కలిసిన బిజినెస్ లు, లావాదేవీలను బయటపెట్టింది. దీంతో కవిత రాబోయే రోజుల్లో మరింత విమర్శలకు పదును పెట్టబోతున్నట్లు సమాచారం. అయితే ఇంకా ఎవరిపేర్లు బయటపెడుతుంది.. ఆమె లిస్టులో ఎవరెవరు ఉన్నారనేది కూడా రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చజరుగుతుంది. కొంత మంది నేతల్లో గుబులు మొదలైంది.
గులాబీకి నష్టం?
పార్టీ నుంచి కవిత సస్పెండ్ తో ఇప్పటివరకు బీఆర్ఎస్, జాగృతి సంస్థ రెండు కలిసి పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవి. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉండేది. ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు సునాయసంగా మారేది. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్, జాగృతి రెండు వర్గాలుగా విడిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక వర్గం కవితకు మద్దతుగా నిలిస్తుంటే, మరో వర్గం హరీష్ రావుకు సంఘీభావంగా నిలుస్తోంది. దీంతో రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చజరుగుతుంది.
ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి, లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం, కంటోన్మెంట్ ఉపఎన్నికలో సిట్టింగ్ స్థానం కోల్పోవడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీ చేసినా విజయం సాధించలేక పోయింది. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు 16.7 శాతానికి పడిపోయింది. తాజాగా కవిత సస్పెన్షన్‌తో పార్టీకి తీవ్రనష్టం జరుగుతుందనే ప్రచారం ఊపందుకుంది.
Also Read: OTT Crime Thriller: ఓటీటీలోకి రాబోతున్న థ్రిల్లర్ మూవీ.. వరుస హత్యలు చేసిందెవరు?