GST Revamp: దేశంలోని పన్నుల వ్యవస్థలో జీఎస్టీ కౌన్సిల్ కీలక మార్పులు చేసింది. ఇకపై జీఎస్టీలో రెండు శ్లాబులు మాత్రమే కొనసాగించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న 12, 28 శాతం శ్లాబ్ లను తొలగించాలని నిర్ణయించినట్లు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆయా శ్లాబ్స్ లో ఉన్న వస్తువులను 5, 18 శాతం శ్లాబుల్లోకి అడ్జస్ట్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పలు వస్తువుల ధరలు భారీగా తగ్గబోతున్నాయి. అయితే కొన్నింటిపై మాత్రం 40 శాతం పన్ను విధించాలని తీర్మానించినట్లు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. మెుత్తంగా ఈ సంస్కరణలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఏ వస్తువులు చవకగా లభించనున్నాయి? వేటి ధరలు పెరగనున్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం.
చవకగా లభించే వస్తువులు (What Gets Cheaper)
ఆహారం, పానీయాలు (Food and beverage)
1. చపాతీ, పరాటా – జీరో ట్యాక్స్ (గతంలో 5% ఉండేది).
2. యూహెచ్ టీ పాలు, చెన్నా/పనీర్, పిజ్జా బ్రెడ్, ఖాఖ్రా పై పన్ను లేదు (మునుపు 5%).
3. వెన్న, నెయ్యి, పొడి కాయలు, కండెన్స్డ్ మిల్క్, సాసేజ్‌లు, జామ్, జెల్లీలు, కొబ్బరి నీరు, న్యాప్ కీన్, 20 లీటర్ల వాటర్ కేన్లు, పండ్ల రసాలు, ఐస్ క్రీమ్స్, పేస్టులు, బిస్కెట్లు, కార్న్ ఫ్లేక్స్, ఇతర ధాన్యాలపై పన్ను 18% నుండి 5% తగ్గింపు.
4. చీజ్, ఇతర ఫ్యాటీ ఫుడ్స్ పై 12% నుండి 5%కు తగ్గింపు
5. ప్లాంట్ మిల్క్, సోయా మిల్క్ డ్రింక్స్ పై 18% – 12%గా ఉన్న పన్ను 5 శాతానికి తగ్గింపు.
గృహోపకరణాలు (Household items)
1. టూత్ పౌడర్, ఫీడింగ్ బాటిల్స్, కిచెన్ వస్తువులు, గొడుగులు, సైకిళ్లు, వెదురు ఫర్నిచర్, దువ్వెనలపై 12% నుంచి 5% కు పన్ను తగ్గింపు.
2. షాంపూ, టాల్కమ్ పౌడర్స్ట్, టూత్‌బ్రష్, సబ్బు, హెయిర్ ఆయిల్ – 18% నుండి 5%.
ఎలక్ట్రానిక్స్ (Electronics)
* ఎయిర్ కండీషనర్లు, డిష్‌వాషర్లు, టీవీలు – 28% నుండి 18%.
స్టేషనరీ (Stationary items)
1. మ్యాప్స్, చార్ట్స్, గ్లోబ్‌లు, పెన్సిల్‌లు, నోట్‌బుక్స్ – జీరో ట్యాక్స్ (మునుపు 12%).
2. ఎరేజర్లు – 0% (మునుపు 5%).
3. దుస్తులు, పాదరక్షలు 12% నుండి 5%
4. టెక్స్ టైల్, పాదరక్షలు – 12% నుండి 5%.
ఆరోగ్య ఉత్పత్తులు (Healthcare)
1. ప్రాణ రక్షక మందులు, మెడికల్ పరికరాలు – 12%/18% నుండి 5% లేదా 0%.
2. థర్మామీటర్లు, మెడికల్ ఆక్సిజన్, డయాగ్నస్టిక్ కిట్లు, గ్లూకోమీటర్, కళ్లజోడులు – 5%.
ఇన్సూరెన్స్ (Insurance and policies)
1. వ్యక్తిగత జీవిత/ఆరోగ్య బీమా – 0%.
2. గూడ్స్ క్యారేజ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ – 12% నుండి 5%.
హోటల్స్, ట్రావెల్ (Hotel tariffs and flights)
1. రూ.7,500లోపు గదులపై 12% నుండి 5%.
2. ఎకానమీ విమాన టికెట్లు – 5%.
వాహనాలు (Vehicles, auto components)
1. 350 cc లోపు బైకులు – 28% నుండి 18%.
2. చిన్న హైబ్రిడ్ కార్లు – తక్కువ పన్ను.
3. ఎలక్ట్రిక్ వాహనాలు – 5%.
4. ఆటో భాగాలు – 28% నుండి 18%.
5. 4 చిన్న కార్లు (పెట్రోల్ <1200 cc, డీజిల్ <1500 cc) – 28% నుండి 18%.
నిర్మాణం, వ్యవసాయ రంగం (Construction And Agriculture)
1. సిమెంట్ – 28% నుండి 18%.
2. డీజిల్ ఇంజిన్లు, హ్యాండ్ పంపులు, స్ప్రింక్లర్లు, ట్రాక్టర్లు, కోత యంత్రాలు – 12% నుండి 5%.
3. ఎరువుల రసాయనాలు – 18% నుండి 5%.
4. బయోపెస్టిసైడ్లు, సూక్ష్మపోషకాలు – 12% నుండి 5%.
5. ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ – 18% నుండి 5%.
బ్యూటీ & ఫిట్‌నెస్ (Beauty and physical services)
1. సలూన్లు, జిమ్, యోగా, హెల్త్ క్లబ్బులు – 18% నుండి 5%.
ఏవి ఖరీదుగా మారతాయి? (What Gets Costlier?)
సాఫ్ట్ డ్రింక్స్ (Soft Drinks)
❄️ కోకా-కోలా, పెప్సీ, ఇతర కార్బోనేటెడ్/కాఫీన్ పానీయాలు – 28% నుండి 40%.
❄️ చక్కెర కలిగిన పానీయాలు – 28% నుండి 40%.
వాహనాలు (Vehicles)
❄️ 1200 cc పైగా కార్లు, 350 cc పైగా బైకులు, యాచ్‌లు, ప్రైవేట్ విమానాలు – 40%.
పొగాకు (Tobacco items)
❄️ పొగాకు ఉత్పత్తులు ప్రస్తుత 28% + సెస్ కొనసాగుతుంది. రుణ చెల్లింపులు పూర్తైన తర్వాత 40%.
Also Read: The Bengal Files: సీఎంకు దర్శకుడు విన్నపం.. చేతులు జోడించినా రాని ఫలితం
వినోదం
❄️ క్యాసినోలు, బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందాలు, IPL టికెట్లు – 40%.
Also Read: Raj Tarun and Lavanya: రాజ్ తరుణ్‌పై మరో కేసు.. ఇప్పుడప్పుడే లావణ్య వదిలేలా లేదుగా!