Sulochana from Someshwaram: పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న టైం లో, కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ అందుకున్నాయి. స్టార్ హీరోలు, హీరోయిన్లు, భారీ వీఎఫ్ఎక్స్, యాక్షన్ సన్నివేశాలు, స్పెషల్ సాంగ్స్, పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా, కొన్ని సినిమాలు కంటెంట్ బలంతో భారీ కలెక్షన్లు రాబడుతున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే.
ఈ చిన్న సినిమా.. రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, రూ.115 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కొత్త రికార్డ్ క్రియోట్ చేసింది. కంటెంటే కింగ్ అని మరోసారి నిరూపించింది. హారర్, కామెడీ, థ్రిల్లర్ జోనర్‌ల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం, నిర్మాతలకు ఊహించని లాభాలను తెచ్చిపెట్టింది. ఇప్పటికీ కొన్ని థియేటర్లలో ఈ చిత్రం రన్ అవుతుంది.
Also Read: Chikoti Praveen: కవిత భాగస్వామ్యం లేకుండా అవినీతి జరిగిందా?.. చికోటి ప్రవీణ్ ఘాటు వ్యాఖ్యలు
ఈ సినిమా కథ కర్ణాటక తీర ప్రాంతంలోని ఓ చిన్న గ్రామం నుంచి మొదలవుతుంది. అశోక్ అనే యువకుడికి ఒక రోజు దెయ్యం పట్టినట్లు అవుతుంది. సోమేశ్వరం అనే ఊరికి చెందిన సులోచన అనే దెయ్యం అతనిలో ఆవహించిందని గ్రామస్తులు భావిస్తారు. దీంతో, ఊరి పెద్ద రవన్న, ఆ దెయ్యాన్ని తరిమేందుకు ఓ స్వామిజీని గ్రామానికి తీసుకొస్తాడు. కానీ, దెయ్యాన్ని వదిలించే ప్రయత్నంలో సమస్య మరింత పెద్దది అవుతుంది. అశోక్‌కు పట్టిన దెయ్యం ఎవరు? అది చివరకు అతన్ని వదిలిందా? ఈ ప్రక్రియలో గ్రామస్తులు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే, ఈ హారర్-కామెడీ థ్రిల్లర్‌ను చూడాల్సిందే. ఈ సినిమా పేరు సు ఫ్రమ్ సో (సులోచన ఫ్రమ్ సోమేశ్వరం).
కన్నడ, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 5 నుంచి జియో హాట్‌స్టార్‌లో ఈ మూవీ అందుబాటులో ఉంటుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. జేపీ తుమినాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా లైటర్ బుద్ధ ఫిల్మ్స్ బ్యానర్‌పై శశిధర్ శెట్టి, రాజ్ బీ శెట్టి, రవి రాయ్ సంయుక్తంగా నిర్మించారు. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయినవారు, మీ ఇంట్లో కూర్చొని జియో హాట్‌స్టార్‌లో చూసి ఆనందించవచ్చు.
Also Read: Jatadhara Movie Update: శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్!.. పండగ చేసుకుంటున్న నిర్మాత