Chikoti Praveen: కవిత వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు డాక్టర్ చికోటి ప్రవీణ్ ఘాటుగా స్పందించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కవిత ఎంతో కీలకంగా ఉన్నారని, అలాంటిది.. కవితకు భాగస్వామ్యం లేకుండా ఇంత మొత్తం అవినీతి జరిగిందా? అని చికోటి ఒక ప్రకటనలో ఆరోపించారు. పదేళ్లు ప్రజల సొమ్ము దోచుకుని ఇప్పుడు వాటాల్లో తేడా వచ్చి బయటపడ్డారని విమర్శలు చేశారు.
Also Read: Sammakka-Saralamma Jatara: తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా సమ్మక్క సారక్క జాతర
ప్రజలపై రుద్దే నాటకం
కవిత నిజాయితీపరురాలు అయితే, తను బీసీల పక్షాన ఉన్నది నిజమే అయితే.. తనంతట తానే ఆధారాలు కోర్టులో కానీ సీబీఐకి కానీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆమె ఇచ్చిన ఆధారాలతో విచారణ చేయడం, చర్యలు తీసుకునేందుకు సులభమవుతుందన్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్ ముఖచిత్రం తెలంగాణలో ఉండదని చికోటి వ్యాఖ్యానించారు. కుటుంబ కలహాలను ప్రజలపై రుద్దే నాటకం సాగుతోందని, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇలాంటి నాటకాలకు తెరతీశాయని ఫైరయ్యారు. బీసీ రిజర్వేషన్లు, రైతు సమస్యలను పక్కదారి పట్టించేందుకు ఈ కుట్ర జరుగుతోందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వారిని ఎవరూ మోసం చేయలేరని చికోటి ప్రవీణ్ తెలిపారు.
Also Read: Mahabubabad District: లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించొద్దని ఎల్‌హెచ్‌పీఎస్ డిమాండ్