CM Revanth Reddy (image credit: twitter)
Politics, నార్త్ తెలంగాణ

CM Revanth Reddy: లబ్ధిదారుల క్షేమ సమాచారం తెలుసుకున్న.. సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: పెద్ద సారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి నిరుపేదకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అన్నాడు. అక్కడే పోయినయ్ ఇప్పటికీ గత ప్రభుత్వంలో సంవత్సరానికి లక్షల ఇండ్లు ఇచ్చిన 20 లక్షలకు నిరుపేదలు యజమానులు అయ్యే వారిని తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) చండ్రుగూడెం మండలంలోని బెండలపాడులో ప్రభుత్వం కేటాయించిన 312 ఇందిరమ్మ పూర్తి కావడంతో అంగరంగ వైభవంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి( మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Pongileti Srinivas Reddy)  తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయి నిర్మించుకున్న ప్రతి ఇంటిని మంత్రి పొంగిలేటితో కలిసి సందర్శించి పర్యవేక్షించారు. ఇందిరమ్మ ఇండ్ల(Indiramma’s houses)లబ్ధిదారులు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించడంతో పండగ వాతావరణం నెలకొంది.

 Also Read: Curd: పెరుగు లేకుండా ఇలా సులభంగా పాలు తోడు పెట్టొచ్చని తెలుసా?

అందరూ ఇండ్లు కట్టుకుంటున్నారా?

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పెద్ద సారు కేసీఆర్ నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అని చెప్పిండు… అవి నిర్మాణం కాక అక్కడే ఉండిపోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలు సంతోషంగా ఉన్నారా! తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరూ ఇండ్లు కట్టుకుంటున్నారా! సన్న బియ్యం రేషన్ కార్డుదారులందరికీ వస్తున్నాయా! ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక రేషన్ కార్డు రాని వారందరికీ రేషన్ కార్డు వచ్చాయా అంటూ అశ్వరావుపేట నియోజకవర్గ చంద్రుగొండ మండలం బెండల పాడు గ్రామానికి చెందిన వారందరి క్షేమ సమాచారాలను రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ఎమ్మెల్యే ఆదినారాయణ మీ గూడానికి కావలసిన ఇండ్ల నన్నింటికి శాంక్షన్ ఇప్పించి నిర్మాణం చేసుకునేలా కృషి చేశారని కొనియాడారు.

మీరందరూ సంతోషంగా ఉంటే ప్రభుత్వం సంతోషంగా ఉంటుంది

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి ఊరు, గ్రామానికి ఇందిరమ్మ ఇండ్ల సహాయం చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారని తెలిపారు. ఆయన కృషితోనే చంద్రుగొండ మండలంలోని బెండల పాడు గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద ఊళ్లో ఉన్న గ్రామస్తులు అందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించి నిర్మాణాలు చేపట్టే కృషి చేశారని కొనియాడారు. పొంగులేటి కృషితో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరిన్ని గ్రామాలకు పూర్తిస్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మీరందరూ సంతోషంగా ఉంటేనే ప్రజా ప్రభుత్వం సంతోషంగా ఉంటుందని పేర్కొన్నారు.

నిరుపేదలు ఇల్లు కట్టుకున్నారు

మహబూబ్నగర్ నుంచి నేను వాకిటి శ్రీహరి కలిసి వచ్చామన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కృషితో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న గ్రామాలలోని నిరుపేదలకు అందరికీ ఇందిరమ్మ ఇండ్లను కేటాయించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. గత ప్రభుత్వంలో ఇండ్లు కట్టుకోలేని దుస్థితి ఏర్పడిందని, అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోని నిరుపేదలు ఇల్లు కట్టుకున్నారని, ప్రజా ప్రభుత్వంలో నిరుపేదలు ఇండ్లు కట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకమైన కృషి చేస్తుందని చెప్పారు. మధ్యలో 10 ఏళ్ల కరువు వచ్చింది.. తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమం ద్వారా సాధించుకున్నామని గొప్పలు చెప్పుకునే కెసిఆర్ హయాంలో నిరుపేదలకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని స్పష్టం చేశారు.

నిరుపేదల కోసం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పని చేస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలోని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మంజూరు చేసి వారు నిర్మాణం చేసుకుంటే బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. కొత్తగా పెళ్లయిన వారికి కూడా మళ్లీ ఇందిరమ్మ ఇండ్లను కేటాయించి వారిని కూడా సొంత ఇండ్లకు యజమానులుగా చేద్దామని చెప్పారు.

 Also Read: Villagers Steal Asphalt: వామ్మో ఇదేం దొంగతనంరా స్వామి.. ఏకంగా కొత్త రోడ్డునే లేపేశారు?

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?