Adluri Laxman Kumar (imagecredit:swetcha)
తెలంగాణ

Adluri Laxman Kumar: గుడ్ న్యూస్.. స్కాలర్‌షిప్‌లు పెంచేందుకు ప్రభుత్వం సిద్దం

Adluri Laxman Kumar: రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర ఎస్సీ(SC), ఎస్టీ(ST), మైనారిటీలు, వికలాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Adluri Laxman Kumar) స్పష్టం చేశారు. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అండ్ హాస్టల్ ఫర్ బాయ్స్( ఆసిఫ్ నగర్ ) భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ భారత ప్రభుత్వం మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రూ. 8.75 కోట్లు వ్యయంతో చేపట్టామని వెల్లడించారు. దీని ద్వారా 160 మంది విద్యార్థులకు ఆధునిక విద్యా, వసతి సదుపాయాలు లభించనున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో రాష్ట్రంలో మైనార్టీ గురుకులాలు, జూనియర్ కాలేజీలు, వసతి గృహాలు వేగంగా పూర్తవుతున్నాయని పేర్కొన్నారు.

సమగ్ర ప్రణాళికతో ప్రభుత్వం

ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన 20 శాతం పనులు పూర్తి చేయడానికి సుమారు రూ.40 కోట్లు అవసరమని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ అంశాన్ని మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి. షఫీఉల్లా, టీజీఎంఆర్ఈఐఎస్. అధ్యక్షులు ఫహీం ఖురేషీతో కలిసి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకువెళ్లినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో, రూ.200 కోట్ల వ్యయంతో “యంగ్ ఇండియా” కాన్సెప్ట్ కింద ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల అభివృద్ధి జరుగుతోందని, ఒకే క్యాంపస్‌లో ప్రాథమిక స్థాయి నుండి డిగ్రీ వరకు విద్యా సదుపాయాలు కల్పించే సమగ్ర ప్రణాళికతో ప్రభుత్వం ముందుకెళతుందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తున్నారని, ఈ యూనివర్సిటీ వందేళ్ల చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని, యువతకు ఇది ఒక కొత్త దిశ చూపుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. పదవ తరగతి ఫలితాలలో మైనార్టీ గురుకులాల విద్యార్థులు 98 శాతం ఉత్తీర్ణత సాధించడం ఉపాధ్యాయుల అంకితభావానికి నిదర్శనమని మంత్రి అభినందించారు.

Also Read: H-Citi Project: టెండర్లు సరే.. పనుల మాటేంటీ?.. మొదలుకాని హెచ్‌సిటీ పనులు

కార్పొరేట్ స్థాయి సదుపాయాలతో

గురుకులాల్లో ఆహార నాణ్యతపై వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని, అల్యూమినియం పాత్రల స్థానంలో స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు వినియోగానికి రూ.7 కోట్ల బడ్జెట్ కేటాయించామని మంత్రి తెలిపారు. మైనార్టీ గురుకులాలకు కూడా ఇదే విధానం త్వరలో అమలు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. అదేవిధంగా డైట్ చార్జీలు, స్కాలర్‌షిప్ రుసుములు పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మైనారిటీ పిల్లల విద్యకు సర్కారు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. కార్పొరేట్ స్థాయి సదుపాయాలతో గురుకులాలు, విశ్వవిద్యాలయాలు తీర్చిదిద్దడం ద్వారా రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నట్లు వెల్లడించారు. ఇది తెలంగాణ యువతకు ఒక కొత్త అధ్యాయమని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి శాసనసభ్యులు మజీద్ హుస్సేన్, హైదరాబాద్ కలెక్టర్ హరి చందన దాసరి(Collector Hari Chandana Dasari), ఆర్డీఓ రామకృష్ణ, డిప్యూటీ సెక్రటరీ జుబేదా, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ జాఫర్ ఖాన్ , మైనార్టీ సంక్షేమ అధికారి ఇలియాస్ అహ్మద్, టీజీఎంఆర్ఈఐఎస్. అధ్యక్షులు ఫహీం ఖురేషీ, మైనారిటీల సంక్షేమశాఖ కార్యదర్శి బి. షఫీఉల్లా, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Also Read: PM Modi: నా తల్లిని తిట్టారు.. నన్ను అవమానించారు.. ప్రధాని ఎమోషనల్

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?