Villagers Steal Asphalt ( Image Source: Twitter)
Viral

Villagers Steal Asphalt: వామ్మో ఇదేం దొంగతనంరా స్వామి.. ఏకంగా కొత్త రోడ్డునే లేపేశారు?

Villagers Steal Asphalt: ఎక్కడైనా కొత్తగా రోడ్డు వేస్తే ప్రజలు చాలా సంతోషిస్తారు. కానీ, బీహార్‌లోని జనాలు మాత్రం కొత్తగా కనిపిస్తే చాలు దాన్ని మాయం చేస్తున్నారు. రోడ్డు వేయడమే ఆలస్యం.. జనం ఎగిరి గంతేస్తారు. ఇక అదే ఊపులో రోడ్డును తవ్వి వాళ్ళకి ఇష్టమొచ్చినట్లు తీసుకెళ్లిపోతారు. ఏ ఊర్లో కొత్తగా రోడ్డు వేసినా సరే.. దాన్ని తవ్వి దొంగతనం చేయాల్సిందే. ఇది అక్కడి ప్రజలకు ఒక ట్రెండ్ లాగా మారిపోయింది. ఏదైనా సరే ఇట్టే తవ్వి తీసుకెళ్లిపోవటం బీహార్‌లోని కొన్ని గ్రామాల్లో కామన్‌గా జరుగుతోంది. కొద్దీ రోజుల క్రితం జెహానాబాద్ జిల్లాలోని ఔడాన్ బిగ్హా గ్రామంలో సిమెంట్ రోడ్డు వేసినప్పుడు కూడా ఇలాగే చేశారు.  ఓ వైపు కూలీలు కష్ట పడి రోడ్డు వేస్తుంటే.. మరో వైపు జనం కాంక్రీట్‌ను తట్టల్లో నింపుకుని ఎత్తుకెళ్లిపోయారు. అప్పట్లో దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: Telugu Directors: తెలుగు మూవీస్ తీస్తే కొత్త డైరెక్టర్స్ చెప్పుతో కొట్టుకోవాల్సిందేనా? ఇదే పెద్ద గుణపాఠం అంటున్న నెటిజన్స్

ఇప్పుడు ఈ ఘటన మరువక ముందే తాజాగా మరో సంఘటన చోటుచేసుకుంది. బీహార్‌లోని ఓ ఊర్లో తాజాగా డాంబర్ రోడ్డు వేశారు. అయితే, రోడ్డు వేసి గంటలు కూడా కాకముందే జనం హద్దులు దాటి రెచ్చిపోయారు. దొరికిందే సందు అనుకుని ఇళ్లలోని పారలతో రోడ్డును తవ్వి, తట్టల్లో తారు నిండుగా నింపుకుని వెళ్లిపోయారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో జనాలు ఒక చోట చేరి.. కొత్తగా వేసిన రోడ్డును చివరి నుంచి తవ్వుతున్నారు. అలా దాదాపు 20 మంది దాకా ఉన్నారు. ఆడవాళ్లు, చిన్న పిల్లలు, వృద్దులు, మగవాళ్లు అన్న తేడా లేకుండా తట్టల్లో తారును నింపుకుని పారిపోతున్నారు. అధికారులు చూస్తారన్న భయం కూడా లేదు.

Also Read: TPCC Mahesh Kumar Goud: కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం స్కామ్ సుస్పష్టం.. మామ అల్లుళ్ల వాటా ఎంతో తేలాలి.. టీపీసీసీ చీఫ్

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!