Sports | థ్యాంక్స్‌ దేవుడా అంటూ రిషబ్ ఎమోషనల్
Thank You God. Wearing The Indian Jersey Fills Me With Gratitude Joy Pride
స్పోర్ట్స్

Sports: థ్యాంక్స్‌ దేవుడా అంటూ రిషబ్ ఎమోషనల్

Thank You God. Wearing The Indian Jersey Fills Me With Gratitude Joy Pride: సుధీర్ఘకాలం అనంతరం టీమిండియా జట్టులోకి భార‌త వికెట్ కీప‌ర్ రిష‌భ్ పంత్ మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భారత జట్టులో చోటు సంపాదించుకున్న రిషబ్. 16 నెల‌ల త‌ర్వాత టీమిండియా జెర్సీ వేసుకుని ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలిపాడు.

వ‌ర‌ల్డ్ క‌ప్‌ జెర్సీ వేసుకున్న సంతోషంలో పంత్ దైవాన్ని గుర్తు చేసుకున్నాడు. త‌న మ‌న‌సులోని మాట‌లని వ్య‌క్త‌ప‌రుస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ డాషింగ్ బ్యాట‌ర్‌ ఓ పోస్ట్ పెట్టాడు. పంత్ త‌న పోస్ట్‌లో పేస‌ర్లు బుమ్రా, సిరాజ్, మిస్ట‌ర్ 360 సూర్య‌కుమార్ యాద‌వ్‌లతో కలిసి దిగిన ఫొటోలని పెట్టాడు. భ‌గ‌వంతుడా నీకు ధ‌న్య‌వాదాలు. ఈ జెర్సీ వేసుకోన్నందుకు నా మ‌న‌సంతా కృత‌జ్ఞ‌తాభావం, సంతోషం, గ‌ర్వంతో నిండిపోయింది. దేశానికి ప్రాతినిధ్యం వ‌హించ‌డం కంటే గొప్ప ఫీలింగ్ ఇంకేముంటుందని పంత్ త‌న పోస్ట్‌కు క్యాప్ష‌న్ రాసుకొచ్చాడు.

Also Read: హెడ్‌కోచ్‌ ఎంపికపై గంగూలీ సంచలన వ్యాఖ్యలు..!

ప్ర‌స్తుతం పంత్‌ పోస్ట్ చేసిన ఆ పోస్ట్ సోషల్‌మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఇక ఈ వార్త చూసిన క్రికెట్‌ లవర్స్, నెటిజన్స్‌ యువర్‌ రియల్లీ అంటూ కామెంట్లతో మనోడిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అంతేకాదు టీమిండియా తరపున బాగా ఆడి దేశానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నారు.

 

View this post on Instagram

 

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..