Kavitha vs BRS (imagecredit:swetcha)
తెలంగాణ

Kavitha vs BRS: కవిత వ్యాఖ్యలతో క్యాడర్ గందరగోళం.. డైలమాలో గులాబీ నేతలు

Kavitha vs BRS: ఎమ్మెల్సీ కవిత పార్టీపై, నేతలపై చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ కేడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయని పార్టీ అధినేత కేసీఆర్(KCR) కు నేతలు తెలిపారు. హరీష్ రావు(Harish Rao), సంతోష్ రావు(Santhosh Rao) పై కవిత మీడియా వేదికగా విమర్శలు చేయడంతో సోమవారం ఎర్రవెల్లిలోని నివాసానికి నేతలు వెళ్లారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తో పాటు ఎమ్మెల్సీ మధుసూదనాచారీ, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు. సుమారు నాలుగు గంటలకు పైగా చర్చించినట్లు సమాచారం. అసెంబ్లీలో కాళేశ్వరంపై జరిగిన చర్చను కేసీఆర్ కు వివరించారు.

ప్రభుత్వ ఆరోపణలు

పార్టీ నేతలు కాంగ్రెస్ నేతల విమర్శలు ఎలా తిప్పికొట్టింది.. హరీష్ రావు కాళేశ్వరంపై మాట్లాడిన తీరు.. సమాధానం ఇచ్చిన విధానంను వివరించారు. అసెంబ్లీ వేదికగా ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టుపై వస్తున్న విమర్శలపై క్లారిటీ ఇచ్చామని, ప్రభుత్వ ఆరోపణలు తప్పని చెప్పామన్నారు. ప్రజల్లోకి వివరించిన తీరు బాగా వెళ్లిందన్నారు. ఆ తర్వాత కవిత నేతలపై చేస్తున్న వ్యాఖ్యలను వివరించారు. పార్టీకి మైలేజ్ వచ్చే తరుణంలో కవిత వ్యాఖ్యలు కేడర్ లో గందరగోళానికి దారితీస్తున్నాయని వెల్లడించారు. ఆమెను పార్టీ మందలించాలని కోరినట్లు సమాచారం. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని దీంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో డ్యామేజ్ అవుతుందని నేతలు వివరించినట్లు సమాచారం. కేసీఆర్ సైతం నేతలు చెప్పిన విషయాలను సావధానంగా విన్నట్లు తెలిసింది.

Also Read: AI-powered Smartphone Tool: అంధత్వానికి చెక్.. గ్లాకోమాను గుర్తించే.. అద్భుతమైన ఏఐ సాధనం రెడీ!

కేసీఆర్ సమాలోచన?

కవిత వరుసగా నేతలపై చేస్తున్న ఆరోపణలపై సమాలోచన చేస్తున్నట్లు సమాచారం. కవిత(Kavitha)పై చర్యలకు పార్టీ నేతలు కోరుతుండటంతో కేసీఆర్(KCR) మాత్రం ఏం నిర్ణయం వెల్లడించాలో తెలియక డైలమాలో పడినట్లు సమాచారం. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మరింత డ్యామేజ్ అవుతుందని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒక వేళ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే పార్టీకి ఆమె వ్యాఖ్యలతో మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ మీ పని మీరు చేసుకోండి. కవిత విషయం నేను చూసుకుంటానని పార్టీ నేతలకు చెప్పినట్లు సమాచారం. ఈ తరుణంలో కవిత వ్యాఖ్యలు చేస్తున్నా ఆసక్తిగా జరుగుతున్న పరిణామాలను కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Also Read: Rajinikanth: రజినీకాంత్ ను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్.. బయటపడ్డ బిగ్గెస్ట్ సీక్రెట్?

Just In

01

Kishan Reddy: రైతులకు గుడ్ న్యూస్.. తెలంగాణకు సరిపడా యూరియా సరఫరా

MGNREGA: ఉపాధి హామీ నిధుల రికవరీ పై ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్!

Thiruveer: ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఎలా ఉంటుందంటే..

Suriya: ఒక కామన్ మ్యాన్‌, కింగ్ సైజ్‌లో కనిపించాలంటే.. రవితేజ తర్వాతే ఎవరైనా?

Revanth Reddy: కమ్మ సంఘాల సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు