Ramchander Rao: మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్(vakulabaranam Krishna Mohan) కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు((Ram Chende Rao), రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్(MP Laxman) ఆధ్వర్యంలో ఆయన బీజేపీలో చేరారు. కాగా కృష్ణమోహన్ కు రాంచందర్ రావు కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. అనంతరం రాంచందర్ రావు మాట్లాడారు. ఇతర పార్టీల నుంచి చాలామంది నాయకులు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గతంలోనే బీజేపీలో చేరారని, తాజాగా వకుళాభరణం చేరారని ఆయన వెల్లడించారు. బీజేపీ మాత్రమే బీసీ(BC) హక్కులను రక్షించే పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. మిగతా పార్టీలు బీసీలను రాజకీయంగా వాడుకుంటున్నాయని విమర్శలు చేశారు.
అసలు ముస్లిం బీసీలా..
అనంతరం కృష్ణమోహన్ మాట్లాడుతూ.. జీవితంలో ఇదొక్క మధురమైన ఘటన అంటూ చెప్పుకొచ్చారు. బీజేపీలో చేరడం ఇల్లు కట్టుకుని గృహ ప్రవేశం చేసినట్టు ఉందని పేర్కొన్నారు. పార్టీలోకి రావాలని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తనను ఆహ్వానించారని చెప్పారు. సామాజిక న్యాయం మోడీ(Modi) ఆధ్వర్యంలో మాత్రమే జరుగుతుందని నమ్మి బీజేపీ(BJP)లో చేరినట్లు వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారంలోకి వచ్చాక బీసీ రిజర్వేషన్లు పోయి ముస్లిం రిజర్వేషన్లు వచ్చాయని విమర్శలు చేశారు. అసలు ముస్లిం బీసీలు ఏంటని ఆయన ప్రశ్నించారు. తమను ముస్లిమేతర బీసీలు అంటున్నారా? అని అనుమానం వ్యక్తంచేశారు. మత ప్రాతిపదిక రిజర్వేషన్లు తప్పని కృష్ణమోహన్ వ్యాఖ్యానించారు.
Also Read: Kunamneni Sambasiva Rao: ఫాసిస్ట్ బాటలో బీజేపీ ప్రభుత్వం.. బాధ్యత మరిచి నిర్లక్ష్యం..!
ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడంపై హైకోర్టు తప్పు పట్టిందని గుర్తుచేశారు. రాజకీయం కోసమే కాంగ్రెస్ ముస్లిం అనే పదాన్ని చేర్చిందన్నారు. కాంగ్రెస్ నేతలు ఎవరు వస్తారో రావాలని, తాను బీసీ బిల్లుపై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అడుగడుగునా కాంగ్రెస్(Congress) తప్పులు చేస్తూబీజేపీపై నిందలు వేస్తోందని విమర్శలు చేశారు. ఆయన చేరికకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య(R Krishnaiah), ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హాజరయ్యారు.
నేడు గుండ్రాంపల్లికి రాంచందర్ రావు
తెలంగాణ బీజేపీ విమోచన కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం, గుండ్రాంపల్లి గ్రామానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వెళ్లనున్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన వీరులకు రాంచందర్ రావు నివాళులర్పించనున్నారు. ఈనెల 17న తెలంగాణ విమోచన వేడుకలను కేంద్రం అధికారికంగా పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తోంది. కాగా ఈ వేడుకల విజయవంతం కోసం పార్టీ కమిటీని ఏర్పాడుచేసింది. ఈ కమిటీ సభ్యులతో కలిసి రాంచందర్ రావు గుండ్రాంపల్లికి వెళ్లనున్నారు.
Also Read: Future City: గుడ్ న్యూస్.. త్వరలో ఫ్యూచర్ సిటీ ఆఫీస్ కు భూమి పూజ..?