Future City: గ్రేటర్ హైదరాబాద్ మహానగరానికి దీటుగా ఫ్యూచర్ సిటీ(Futcher City) ని అభివృద్ది చేయాలన్న సర్కారు సంకల్పం మరో అడుగు ముందుకు పడింది. ఇప్పటికే ఫ్యూచర్ సిటీని ఆశించిన విధంగా నిర్మించేందుకు నిష్ణాతులైన అధికారులకు కీలక బాధ్యతలను కట్టబెట్టిన సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ (FCDA)కు ప్రత్యేకంగా ఓ ఆఫీసు నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరో వారం రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ భూమి పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.
ఫ్యూచర్ సిటీ పనులు
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్(AP) అమరావతి(Amaravathi) నగరంలో నిర్మించిన విధంగానే ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ(Future City Development Authority)కి కూడా తత్కాలిక భవనాలను నిర్మించే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం నానక్ రామ్ గూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో ప్రస్తుతం ఎఫ్ సీడీఏ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ పనులు చేపట్టే సైటు కార్యకలాపాలు కొనసాగుతున్న ఆఫీసుల మధ్య దూరం ఎక్కువగా ఉండటంతో తాత్కాలిక ఆఫీసుల నిర్మాణానికి సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తాత్కాలికంగా నిర్మించే పరిపాలనపరమైన భవనాల నుంచే అన్ని కార్యక్రమాలు అమలు చేయాలని భావిస్తున్నారు.
Also Read: Singer Suchitra: ఈ వయసులో గాయనికి కాబోయే భర్త ఏం చేశాడంటే?.. మరీ అంత దారుణమా!
సర్కారు ఆదేశాలు జారీ
దసరా నాటికి ఆఫీసు పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఎఫ్ సీడీఏ పరిధిలో భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతుల కోసం అధికారులకు ‘లాగిన్’లు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హెచ్ఎండీఏ(HMDA) రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే అనుమతివ్వాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్ సీడీఏ(FCDA) పరిధిలోని 56 గ్రామాలకు గాను, 36 గ్రామాల్లో మాత్రం అన్ని రకాల జోనింగ్ విధానాల ప్రకారమే అనుమతులు జారీ చేయనున్నారు. మిగిలిన 20 గ్రామాల్లో మాత్రమే అధికారులు పలు రకాల జాగ్రత్తలను తీసుకోవల్సి ఉంటుందని అధికారవర్గాల సమాచారం. అయితే త్వరలోనే ఫ్యూచర్ సిటీకి స్పెషల్ మాస్టర్ ప్లాన్ రూపొందించే అవకాశం కూడా ఉందని అధికారవర్గాల సమాచారం.
Also Read: Soundarya: ఆ రహస్యం బట్టబయలు.. సౌందర్య మరణించిన తర్వాత.. హిమాలయాలకు వెళ్లి పూజలు చేసిన స్టార్ హీరో?