Bunny Vas on Little Hearts
ఎంటర్‌టైన్మెంట్

Bunny Vas: టాలీవుడ్‌లో చాలా రూల్స్ ఉన్నాయ్.. కానీ పాటించడమే అసాధ్యం! బన్నీ వాస్ షాకింగ్ కామెంట్స్

Bunny Vas: టాలీవుడ్‌పై బన్నీ వాస్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ సినిమా బ్యాన్ అన్నప్పుడు ఆయన తీవ్రంగా రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడాయన విడుదల చేస్తున్న ‘లిటిల్ హార్ట్స్’ మూవీ (Little Hearts Movie) మీడియా సమావేశంలో టాలీవుడ్‌లో ఒకప్పుడు ఉన్న రూల్స్ ఇప్పుడెందుకు పనికి రావడం లేదని అన్నారు. ఇప్పుడాయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ మౌళి తనుజ్, ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ తెరకెక్కించారు. ‘90s’ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్‌ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్‌ విడుదలకు సిద్ధమైన సందర్భంగా వంశీ నందిపాటితో కలిసి బన్నీ వాస్ మీడియా సమావేశం నిర్వహించారు.

మేము ఇన్వాల్వ్ కాలేదు

ఈ కార్యక్రమంలో బన్నీ వాస్ మాట్లాడుతూ.. ‘లిటిల్ హార్ట్స్’ సినిమా బాగుందని వంశీ నందిపాటి చెప్పాడు. ఆ తర్వాత ఆ చిత్ర నిర్మాత ఆదిత్య హాసన్ వచ్చి మూవీ గురించి చెప్పాడు. సినిమా చూశాను.. నాకు నచ్చింది. వంశీ చెప్పింది కూడా ఈ మూవీ గురించే కదా.. కంటెంట్ బాగుంది. థియేట్రికల్‌గా రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. క్రియేటివ్ పరంగా ఈ మూవీ విషయంలో మేము ఇన్వాల్వ్ కాలేదు. నాకు అనిపించిన సజెషన్స్ కొన్ని మాత్రం చెప్పాను. ఇక అంతా వాళ్లే చేసుకున్నారు. ఇందులో నటించిన వాళ్లు కొత్తవాళ్లు, ఓటీటీలో ఎక్కువ పరిచయమైనవాళ్లు. కాబట్టి ఓపెనింగ్స్ నెమ్మదిగానే మొదలవుతాయని అనుకుంటున్నాం. మ్యాట్నీ, ఫస్ట్ షో నుంచి కలెక్షన్స్ పికప్ అవుతాయనే నమ్మకంతో ఉన్నాం.

Also Read- Anushka Shetty: రానాతో అనుష్క ఫోన్ ఇంటర్వ్యూ.. స్వీటీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!

సెప్టెంబర్ 5నే ఎందుకు అని అంతా అడుగుతున్నారు. ఈ డేట్ తప్పితే మాకు మరో డేట్ సరైనది లభించలేదు. ముందు సెప్టెంబర్ 12న అనుకున్నాం.. కానీ ఆ రోజు చాలా సినిమాలు వస్తున్నాయి. ‘లిటిల్ హార్ట్స్’ బాగుందనే టాక్ వచ్చి.. ఒక వీక్ సస్టెయిన్ అయితే బెటర్ రన్‌కు వెళ్తుంది. మేము 19కి వద్దామంటే ఆ తర్వాత వారమే ‘ఓజీ’ ఉంది. యూత్ కంటెంట్‌తో ఈ సినిమా వస్తుంది. ఎక్కడా అశ్లీలతకు తావు లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఇలాంటి మూవీ నాలుగైదేళ్ల కిందట వచ్చి ఉంటే థియేటర్స్‌లో కుమ్మేసేది. ఈ రెండు మూడు వారాల్లో కూడా యూత్ ఓరియెంటెడ్ ఫన్ మూవీ లేదు కాబట్టి.. అది మాకు అడ్వాంటేజ్ అవుతుందని ఆశిస్తున్నాం. ఫైనల్ కాపీ చూశాను, ప్రేక్షకులు బాగా నవ్వుకుంటారు. ముఖ్యంగా ‘కాత్యాయని నన్ను లవ్ చేయి’ అనే సాంగ్ మాత్రం మంచి మీమ్ కంటెంట్ అవుతుంది. 16 నుంచి 20 ఏళ్ల యూత్‌కు ఈ సినిమా బాగా నచ్చుతుంది.

ఆ అడ్వాంటేజ్ లేదు

హిందీ, మలయాళ చిత్రాలకు థియేట్రికల్‌గా ఉన్న అడ్వాంటేజ్ మనకు తెలుగు చిత్రాలకు లేదు. మనం నాలుగు వారాల్లోనే ఓటీటీకి సినిమాను ఇచ్చేస్తున్నాం. థియేటర్‌లో విడుదలకు చేసిన ప్రమోషన్ ఓటీటీకి పనికొస్తోంది. సినిమాలకు ఆడియన్స్ రావాలని మనం డిమాండ్ చేయడంలో అర్థం లేదు. సినిమా బాగుంటే తప్పకుండా వాళ్లే వస్తారు. ఇది బిజినెస్. మల్టీఫ్లెక్స్‌లో ఫుడ్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయనేది నిజమే. కానీ, సినిమా బాగుంటే ప్రేక్షకుడు ఆ ఖర్చు భరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. మంచి సినిమా చూస్తే, ఆ ఫీల్‌లో ఫ్యామిలీ కోసం ఖర్చు పెడతాడు. చిన్న చిత్రాలకు టికెట్ రేట్స్ 150 పెడితే బాగుంటుంది. అయితే ఈవారం రిలీజయ్యే సినిమాల్లో మా ఒక్క చిత్రానికే టికెట్ రేట్స్ తగ్గించడమంటే కొన్ని సమస్యలు వస్తాయి. మిగతా సినిమా వాళ్లు రూ. 200 పెట్టమని అంటారు. ప్రాక్టికల్‌గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.

Also Read- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫుల్ మీల్స్ పోస్టర్.. హరీష్‌కు ఈసారి టెంపులే!

కంటెంట్ ఉన్న సినిమాలే డిస్ట్రిబ్యూట్ చేస్తాం

మాకు కంటెంట్ నచ్చి, జనాలకు బాగుంటుందని మేము అనుకున్న కంటెంట్ ఉన్న సినిమాలే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఒక్కోసారి అవి ఆదరణ పొందని సందర్భాలూ రావొచ్చు. అన్నింటినీ తీసుకోగలగాలి. గత వారం మేము ఒక సినిమా చేశాం. అది ఓటీటీకి పనికొస్తుందనే ప్రచారం చేశాం. ఇప్పుడు 90 థియేటర్స్‌లో విడుదల అయితే తప్ప ఓటీటీ వాళ్లు కన్సిడర్ చేయడం లేదు. అలాగే ఐదు షోస్ వేయాలనే రూల్ ప్రభుత్వం నుంచి ఉంది కానీ, అది ఎవరూ పాటించడం లేదు. ఇక్కడ (టాలీవుడ్) రూల్స్ ఎన్నో ఉంటాయి.. కానీ వాటిని పాటించడమే అసాధ్యం. కరోనా టైమ్ నుంచి కంటెంట్‌లో చాలా ఛేంజెస్ వచ్చాయి. ప్రచారం చేయాల్సిన తీరులో కూడా మార్పు వచ్చింది. గతంలోని పద్ధతులు ఇప్పుడు పనిచేయడం లేదు. ముందు ట్రైలర్ నచ్చితేనే ప్రేక్షకులు సినిమా పట్ల ఆసక్తి చూపిస్తున్నారని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ