Kannappa OTT Update
ఎంటర్‌టైన్మెంట్

Kannappa Movie OTT: అఫీషీయల్.. కన్నప్ప ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Kannappa Movie OTT: హీరో విష్ణు మంచు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ‘కన్నప్ప’ (Kannappa) చిత్రం పాజిటివ్ టాక్‌నే సొంతం చేసుకుంది. చాలా కాలం తర్వాత మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన చిత్రం పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకోవడంతో.. ఈ సినిమాపై ఆ ఫ్యామిలీ పెట్టుకున్న నమ్మకం నిజమైందని అంతా అనుకున్నారు. కాకపోతే ఆ నమ్మకం ఫస్ట్ వీకెండ్ వరకే మిగలడం విశేషం. ఆ తర్వాత ఈ సినిమాకు అనుకున్నంతగా కలెక్షన్స్ రాలేదు. ప్రమోషన్స్ పరంగా మంచు విష్ణు అస్సలు తగ్గలేదు. సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో.. ప్రమోషన్స్ విషయంలోనూ అంతే కష్టపడి ప్రమోట్ చేసుకున్నాడు. కానీ, ఫైనల్‌గా ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఆయనకు తీవ్ర నిరాశనే మిగిల్చిందనేలా ట్రేడ్ రిపోర్ట్స్ తెలిపారు. థియేటర్లలో ఈ సినిమాను చూసేందుకు ఎందుకనోగానీ, ప్రేక్షకులు అంతగా రాలేదనే చెప్పుకోవాలి.

Also Read- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫుల్ మీల్స్ పోస్టర్.. హరీష్‌కు ఈసారి టెంపులే!

‘కన్నప్ప’ ఓటీటీ రిలీజ్ డేట్.. (Kannappa OTT Release Date)
థియేటర్లలో చూడకపోయినా, ఓటీటీలో ఈ సినిమాను చూద్దాం అనుకున్నవారికి.. ఈ సినిమా ఊరిస్తూనే ఉంది కానీ, అసలెప్పుడు ఓటీటీలోకి వస్తుందనేది కన్ఫ్యూజన్‌గానే మారింది. ఇప్పటి వరకు ‘కన్నప్ప’ ఓటీటీలోకి అంటూ చాలానే డేట్స్ వచ్చాయి. కానీ, ‘కన్నప్ప’ మాత్రం ఓటీటీలోకి రాలేదు. పైనల్‌గా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సంస్థ అఫీషీయల్‌గా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే డేట్‌ని ప్రకటించింది. ఆ సంస్థ చెప్పిన ప్రకారం ‘కన్నప్ప’ చిత్రం 2025 సెప్టెంబర్ 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌‌కు రాబోతోంది. సినిమా థియేటర్లలోకి వచ్చి, రెండు నెలలు అయినా ఓటీటీలోకి రాకపోవడంతో ఏర్పడిన అనేకానేక అనుమానాలకు ఫైనల్‌గా అమెజాన్ ప్రైమ్ తెరదించింది.

Also Read- Ramanaidu Film School: రామానాయుడు ఫిలిం స్కూల్‌లో మహిళా ప్రొఫెసర్‌కు వేధింపులు.. వేధించిందెవరో తెలిస్తే షాకవుతారు?

ఓటీటీలో ఆదరణ ఎలా ఉంటుందో..
మరి థియేటర్లకు ప్రేక్షకులను రాబట్టలేకపోయిన ‘కన్నప్ప’ సినిమా.. ఓటీటీ ప్రేక్షకుల ఆదరణను ఎంత వరకు రాబట్టుకుంటుందో చూడాల్సి ఉంది. దీనిపై ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఇటీవల కొన్ని సినిమాలు ఓటీటీలో మంచి విజయం సాధిస్తున్నాయి. ‘కన్నప్ప’ కూడా ఆ జాబితాలో చేరుతుందో లేదో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేస్తే చాలు. విషయం అర్థమైపోతుంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్ (Prabhas), శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారాగణం నటించిన విషయం తెలిసిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్