Jayammu Nichayammu Raa: సందీప్ రెడ్డి వంగా, రామ్ గోపాల్ వర్మ ఇద్దరూ కలిసి ఒకే వేదికపై కనిపిస్తే ఎంత హంగామా జరుగుతుందో తెలిసిందే. తాజాగా అదే జరిగింది. అదే జరిగింది ZEE5లో ప్రసారమవుతున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షోలో. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న వీరి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. దర్శకులిద్దరూ తమదైన స్టైల్లో మాట్లాడటంతో ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. రామ్ గోపాల్ వర్మను జగపతి బాబు ఆహ్వానించిన తర్వాత ‘ఈయన అందరికీ ఆర్జీవీ నాకు మాత్రం సైతాన్’ అనడంతో అక్కడ ఉన్నవారు అంతా ఆశ్చర్యపోయారు. దీనిని ఆర్జీవీ మాత్రం సరదాగా తీసుకున్నారు. ప్రేక్షకుల కోసం సినిమా ఎప్పుడు తీస్తావు అంటూ జగపతిబాబు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. జీవితంలో ఎవడూ చెప్పేది వినడు.. అంటూ చెప్పుకొచ్చారు. ఇలా షో మొత్తం ఎవరిస్టైల్లో వారు మాట్లాడుతూ నవ్వుల పూవులు పూయించారు.
Read also-India–US partnership: చైనాలో మోదీ, పుతిన్ కలిసిన నిమిషాల వ్యవధిలోనే అమెరికా కీలక ప్రకటన
అనంతరం మరో గెస్ట్ అయిన సందీప్ రెడ్డి వంగను మందు బాటిల్ తో ఆహ్వానించారు జగ్గుబాయ్. దానిని చూసిన ఆర్జీవీ నాకు ఎందుకు ఇవ్వలేదు? అది అంటే.. సందీప్ పెద్ద దర్శకుడు నేనుకాదు అనా.. అంటూ జగ్గూను ఆట పట్టించారు. అలా సాగుతూ ఉండగా వీరి మధ్య ప్రేమ గురించి టాపిక్ వచ్చింది. గర్ల్ ఫ్రెండ్ గురించి అడగ్గా ఆర్జీవీ మమ్మల్ని మేము ప్రేమించుకుంటాకే టైం లేదు మళ్లీ ఇంకొకరినా అంటూ చెప్పుకొచ్చారు. మధ్యలో సందీప్ కలిగించుకుని నాకొక కోరిక ఉండేది నేను మీ క్లాస్ మేట్ అయితే బాగుండేది అన్నారు. దానికి ఆర్జీవీ మనిద్దరిలో ఒకరు అమ్మాయి అయితే బాగుంటుంది అన్నారు. దీనికి అక్కడ ఉన్న వాతావరణం నవ్వల మయం అయిపోయింది. సందీప్ రెడ్డి వంగా ఈ షో గురించి మాట్లాడుతూ, “ఇలాంటి కాన్సెప్ట్ చాలా ఫ్రెష్‌గా ఉంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చేలా ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్ చేసిన విధానం బావుంది” అని ప్రశంసించారు. తన సినిమాలు ఎందుకు ఇలాంటివి కాకుండా వేరేలా ఉంటాయో అన్నదానిపై ఫన్‌గా జోక్ చేస్తూ నవ్వులు పూయించారు.
ఈ వీడియో వైరల్ కావడానికి ప్రధాన కారణం ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం. ఇలా జరగడం చాలా అరుదు. వీరి మధ్య జరిగిన సరదా సంభాషణలు, అద్భుతమైన కామెంట్స్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటున్నాయి. దీంతో నెట్టింట్లో మీమ్స్ వర్షం కురుస్తోంది. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ ఇది జీ 5లో స్ట్రీమింగ్ అవుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ షో. ఇందులోని జయమ్మ క్యారెక్టర్, చుట్టూ జరిగే సరదా సన్నివేశాలు షోకు హైలైట్‌గా నిలుస్తున్నాయి. హాస్యంతో పాటు ఎమోషన్స్ మిక్స్ కావడంతో ప్రేక్షకులు ఈ షోకు గుడ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. వీరిద్దరి రాకతో ఈ షో మరింత ఆదరణ పొందుతుంది.