Kaleshwaram Project Scam(image credit: twitter)
Politics

Kaleshwaram Project Scam: కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు.. అసెంబ్లీలో సీఎం సంచలన వ్యాఖ్యలు!

Kaleshwaram Project Scam: కాళేశ్వరం తప్పిదాలు, , నిర్లక్ష్యంపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్​ ఇన్వెస్టిగేషన్స్ (సీబీఐ) కు అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రకటించారు.  కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై సభ్యుల అభిప్రాయాల తర్వాత అర్థరాత్రి ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ను విచారణ కమిషన్ ను నియమించిందన్నారు. విచారణ కమిషన్ తన నివేదికను 31 జూలై 2025న ప్రభుత్వానికి సమర్పించిందన్నారు.4 ఆగస్టు , 2025న జరిగిన మంత్రి మండలి సమావేశం ఈ నివేదికను ఆమోదించిందన్నారు. తదుపరి చర్చ జరిపేందుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని మంత్రిమండలి చేసిన తీర్మానం ప్రకారం, ఈ నివేదికపై ఆదివారం శాసనసభలో చర్చ జరిగిందన్నారు.

 Also Read: OG Advance Bookings: యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో వాటిని దాటేసిన ‘ఓజీ’.. ఇదెక్కడి మాసురా మామా..

రిటైర్డ్ జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ తమ నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలను గుర్తించిందన్నారు. నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టడం, ఆర్థిక అవకతవకల వంటి అంశాలను ప్రస్తావించిందన్నారు. మూడు బ్యారేజీల నిర్మాణంలో తప్పు జరిగిందని, అసలు ప్లానింగ్ లేదని కమిషన్ తేల్చి చెప్పిందన్నారు.నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదిక ప్రకారం, మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలిందన్నారు. నాణ్యత, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్ డీఎస్ ఏ గుర్తించిందన్నారు.

ఈ అంశాలన్నింటిపై లోతుగా మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్ డీఏస్ ఏ, విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయన్నారు. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలుపంచుకున్నాయన్నారు. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో వాప్కో స్ (WAPCOS) వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పీఎఫ్​ సీ, ఆర్ ఈసీ వంటి ఆర్థిక సంస్థలు పాలుపంచుకున్నందున, ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి అప్పగించడం సముచితంగా శాసన సభతో పాటు, ప్రభుత్వం భావించినట్లు వెల్లడించారు.

కేసీఆర్, హరీష్​ రావులను ఎందుకు శిక్షించకూడదు..?
కేంద్ర ప్రభుత్వం పూర్తిచేయాల్సిన ప్రాణహిత ప్రాజెక్టు ఉసురు తీసి..ఉరి వేసింది కేసీఆర్ కాదా..? అని ప్రశ్నించారు. ఆయనను…హరీష్ రావు ను శిక్షించాల్సిన అవసరం లేదా..? అంటూ సీఎం గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణం కోసం కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.85,449 కోట్లు అప్పు తీసుకున్నారన్నారు. రూ.27, 738 కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 11.5 శాతం వడ్డీకి తీసుకున్నారన్నారు. రూ.30,536 కోట్లు 12 శాతం వడ్డీకి అప్పు తెచ్చారన్నారు. వాళ్లు చేసిన అప్పులకు ఇప్పటి వరకు రూ.19,879 కోట్లు ప్రిన్సిపల్ అమౌంట్ చెల్లించామన్నారు.

రూ.29, 956 కోట్లు వడ్డీ వివిధ బ్యాంకులకు చెల్లించామన్నారు.మొత్తం ఇప్పటివరకు రూ. 49,835 కోట్లు బ్యాంకులకు అప్పు చెల్లించామన్నారు.రూ.60,869 కోట్లు ఇంకా మనపై భారం ఉన్నదన్నారు. అసంపూర్తిగా మిగిలి ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఇంకా రూ. 47 వేల కోట్లు అవసరం ఉన్నదన్నారు. ప్రతీ ఏడాది వెయ్యి కోట్లు సేవ్ చేయగలిగే, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ పిల్లలకు క్వాలిటీ లైఫ్​ అందుతుందన్నారు. బాధ్యతారహితంగా కేసీఆర్, హరీష్​, ఈటల రాజేందర్ లు వ్యవహరించారన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో రీ స్ట్రాక్చర్ చేసేందుకు మరో రూ. 49 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ ప్రజల లక్ష కోట్లు దోపిడి దొర కొల్ల కొట్లాడన్నారు. కాంట్రాక్టర్ల కమిషన్ కోసమే రీ డిజైనింగ్ చేశారన్నారు. అంబేద్కర్ పై కోపంతోనే పేరు మార్చారన్నారు.

నిజం కంటే ధనవంతుడిగా కేసీఆర్(KCR) మారాలనుకున్నాడని, 200 ఏళ్ల పాటు ఆయన ఫ్యామిలీ, వారసత్వం అధికారం చెలాయించాలని భావించినట్లు సీఎం తెలిపారు. తెలంగాణ ప్రజల కోట్లు కొల్లకొట్టి వందల ఎకరాల ఫామ్ హౌజ్ లు, పేపర్లు, టీవీలు పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు. అందుకే  శాసన సభలో సంపూర్ణంగా చర్చించామన్నారు. ఘోష్ కమిషన్ చెప్పినట్లు క్రిమినల్ యాక్షన్ తీసుకునేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థకు ఈ కేసును అప్పగించామన్నారు. ఘోష్​ రిపోర్టు, ఆయన్ను తప్పుబట్టాల్సిన​ అవసరం లేదన్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి జయలత, శశికళ వంటి కేసుల్లో సంచలనాత్మకమైన తీర్పులు ఇచ్చారన్నారు. ఫస్ట్ లోక్ పాల్ చైర్మన్ గా పనిచేశారన్నారు. సుప్రీం కోర్టు చీఫ్​ జస్టీస్ గా పనిచేశారన్నారు. రిపోర్టులో లోపాలు ఉంటే చెప్పాలని, కానీ ఘోష్​ ను విమర్శించడం సరికాదన్నారు.

Also Read: Ram Charan: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భేటీ.. మ్యాటర్ ఏంటంటే?

నిజం కట్టినవి చెక్ చెదరలేదు..
కాకతీయులు కట్టిన చెరువులు, నిజం కాట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్ చెదరలేదన్నారు. ఉమ్మడి మెదక్ లో పోచారం ప్రాజెక్టుకు 103 ఏళ్ల హిస్టరీ ఉన్నదని, గతంలో రూ. 26 లక్షలతో ప్రాజెక్టును కట్టారని గుర్తు చేశారు. ఇటీవల వరదల్లో చెక్ చెదరలేదన్నారు. నిజాంసాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లు వంటివి ఇప్పటికీ డ్యామేజ్ కాలేదన్నారు. కానీ కాళేశ్వరం బీఆర్ ఎస్ హయంలోనే కట్టి, వాళ్ల హయంలోనే కూలిపోవడం విచిత్రకరమన్నారు. నిర్మాణంలో క్వాలిటీ, నిర్వహణ, ప్రాజెక్టు డిజైన్, మెయింటనెన్స్ వంటి లోపాలతో మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందన్నారు.
తద్వారా లక్ష కోట్లు గోదారిలో కలిసి పోయాయన్నారు. జవహర్ లాల్ నెహ్రూ కట్టిన ప్రాజెక్టులు నాగర్జున సాగర్, శ్రీరామ్ సాగర్, శ్రీశైలం వంటి డ్యామ్‌ లు ఇప్పటికీ ఇంచు కూడా డ్యామేజ్ కాలేదన్నారు.

ఉమ్మడి ఏపీలోనే పునాది…
ఉమ్మడి ఏపీ లోనే ప్రాణహిత చెవెళ్లకు పునాది పడిందన్నారు. జలగం వెంకట్రావ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, మహరాష్ట్రకు, మనకు ఒప్పందాలు జరిగాయన్నారు. ఆ తర్వాత 2007–2008 లో వైఎస్సార్ సమయంలో 16 లక్షల ఎకరాలకు రూ. 34 వేల కోట్లతో అంచనాలు మొదలు పెట్టి, ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. 2014 తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత కూడా 5 వేల కోట్లు ఖర్చు పెట్టారన్నారు. మహరాష్ట్ర తుమ్మడిహట్టి వద్ద కట్టవద్దని ఎన్నడూ చెప్పలేదని, 152 నుంచి 148కి ఎత్త తగ్గించి నిర్మించాలని సూచించినట్లు సీఎం వివరించారు. కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధు త్యాగాలతో వచ్చిన తెలంగాణను కేసీఆర్ పూర్తిగా దోపిడికి పాల్పడ్డారన్నారు.

గ్రావిటీ ద్వారా కేవలం 20 పంపులతో 3460 మెగవాట్ల విద్యుత్ తో పూర్తయ్యే ప్రాజెక్టును రెట్టింపు స్థాయిలో ఖర్చు పెట్టే పరిస్థితికి తీసుకువెళ్లారన్నారు. 38 వేల నుంచి లక్షా 47 కు పెరిగిందన్నారు.కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే 18–5–2020న ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వీవీ రమణారెడ్డి కాళేశ్వరం లోపాలపై లేఖ కూడా రాశాడన్నారు. కానీ ఏజెన్సీలు, కంపెనీలు, కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్లకు గత ప్రభుత్వంలోని పెద్దలు, ఆఫీసర్లు కుమ్మక్కయ్యారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 25 రోజుల్లో 3 నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నదన్నారు. రాత్రికి రాత్రికి నిర్ణయాలు తీసుకున్నదన్నారు. రాజీవ్ సాగర్ – ఇందిరా సాగర్ నిర్మాణ వ్యయం 18 వేల కోట్లకు పెంచి దోచుకున్నారన్నారు. తుమ్మిదిహట్టికి బదులు మేడిగడ్డ, కాలేశ్వరం పేరిట ప్రాజెక్టులు ప్రారంభించి లక్ష కోట్లు దోచుకోవాలన్న దురాశతో వ్యవహరించారన్నారు. కేవలం ఒక ఆపరేటర్ ని పిలిచి గూగుల్ మ్యాప్ సాయంతో ప్రాజెక్టులు నిర్మాణానికి కేసీఆర్ ప్లాన్ తయారు చేశారన్నారు.

పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదు..
21 అక్టోబర్ , 2020న మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఇంజనీర్ ఫిర్యాదు చేశారని సీఎం తెలిపారు. కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడే లోపాలు బయటపడ్డాయన్నారు. ప్రాథమిక నివేదిక కూడా కేసీఆర్ కి అందిందన్నారు. అందుకే ఆనాడు మేడిగడ్డ చుట్టూ పోలీసులను పెట్టి ..పిట్టని కూడా రానివ్వలేదన్నారుతుమ్మిడిహెట్టి నుండి ప్రాజెక్టు మేడిగడ్డకు మారడానికి కారణం కేసీఆరే అని పేర్కొన్నారు. నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానం చెప్పింది ఒకటి… వాళ్లు చేసింది ఇంకొకటని తెలిపారు. సాంకేతికతను మార్చడానికి కారకులు హరీష్ రావు అని వెల్లడించారు. దొర..దోపిడి దొంగగా మారి ప్రజల సొమ్ము దోచుకున్నా, ఆనాడు వేసిన శిక్షల మాదిరిగా తాము వాళ్లను రాళ్ళతో కొట్టడం, నడి రోడ్డులో ఉరి వేయలేదన్నారు. పద్ధతి ప్రకారం విచారణకు ఆదేశాలు ఇచ్చామన్నారు.

 Also Read:Loss to Panchayat Raj: పంచాయతీరాజ్ కు రూ.374కోట్లు నష్టం

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?