Telugu Director: ఆగస్ట్ 29న ఎన్నో అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ‘త్రిబాణధారి బార్బరిక్’ (Tribandhari Barbarik) చిత్రం.. అబౌ యావరేజ్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఉన్న కంటెంట్ పరంగా సినిమా చూసిన వారంతా సంతోషాన్నే వ్యక్తం చేస్తున్నారు. కానీ సినిమాను చూడటానికి ప్రేక్షకులే కరువయ్యారు. దీంతో చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. సినిమా విడుదలకు ముందు సినిమాపై ఉన్న కాన్ఫిడెంట్‌తో.. ఈ సినిమా మీకు నచ్చకపోతే.. నా చెప్పుతో నేనే కొట్టుకుంటానంటూ ఛాలెంజ్ విసిరిన మోహన్ శ్రీవత్స (Mohan Srivatsa).. తాజాగా తన చెప్పుతో కొట్టుకుంటూ భోరున భోరున విలపించారు. సినిమా చూస్తేనే కదా.. అది బాగుందో, లేదో తెలిసేది. అసలు సినిమా చూడడానికి రాకుండా ఉంటే.. నాకు ఎలా తెలుస్తుంది? అంటూ బాగా ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో..
సినిమా చూస్తున్న వారిని ఎలా ఉందని అడిగా..
‘‘హలో అండీ.. ఇప్పుడే నేను ‘త్రిబాణాధారి బార్బరిక్’ సినిమాకు వెళ్లాను. థియేటర్‌లో 10 మంది ఉన్నారు. నేను డైరెక్టర్ అని చెప్పకుండా ఆ పది మంది దగ్గరకు వెళ్లి.. సినిమా ఎలా ఉంది? అని అడిగాను. అందరూ కూడా సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది అన్నారు. నిజం చెప్పండి భయ్యా.. నేను డైరెక్టర్‌ని అంటే.. వెంటనే వాళ్లు నన్ను హగ్ చేసుకుని, సార్ మీరు డైరెక్టరా? సినిమా చాలా బాగుంది సార్ అన్నారు. అంతే నాకు కళ్లల్లో నీళ్లు ఆగలేదు. ఎందుకు మరి 10, 15 మందే థియేటర్‌లో ఉన్నారు. ఎందుకో నాకు అర్థం కాలేదు.
Also Read- Sundeep Kishan: యాటిట్యూడ్ స్టార్‌కు హీరో సందీప్ కిషన్ సపోర్ట్.. ఏం చేశాడంటే?
ఆత్మహత్య చేసుకుంటాననుకుంది
అంటే, నేను ఏం చేస్తే వస్తారు థియేటర్‌కి? దాదాపు రెండున్నరేళ్లు పిచ్చికుక్కలా సినిమా కోసం కష్టపడ్డా. అవును రెండున్నరేళ్లు పిచ్చికుక్కలా కష్టపడ్డా. మీకొకటి చెప్పాలి. నేను నిన్న (శనివారం) థియేటర్స్‌కి ఎవరూ రావడం లేదని, చిన్న మనస్థాపానికి గురయ్యాను. ఆఫీస్ వదిలి ఇంటికి వెళ్లిపోయాను. మా ఆవిడ 4.30 షోకి వెళ్లింది. నేను 5కి ఇంటికి వెళుతున్నానని చెప్పా. నువ్వు సినిమా చూసి రా.. నేను ఇంటికి వెళుతున్నా అని చెప్పా. అంతే, తను పరిగెత్తుకుని ఇంటికి వచ్చేసింది భయ్యా. నాకప్పుడు అనిపించింది భయ్యా. నేను ఎక్కడ మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటానో అని వచ్చేసింది.
అలా చెప్పినా జనం రాలేదు
రెండున్నరేళ్ల కష్టం.. నాకు తెలుసు, తనకు తెలుసు. మలయాళం కంటెంట్, మంచి కంటెంట్ చూస్తారు అని చెప్పి చేశాను భయ్యా. నేను కాన్ఫిడెన్స్‌తో ఓ మాట అన్నాను. ఈ సినిమాగానీ మీకు నచ్చకపోతే.. నా చెప్పుతో నేను కొట్టుకుంటాను అని అన్నా. అలా కొట్టుకుంటానని చెప్పినా కూడా జనాలు థియేటర్లకి రాలేదు భయ్యా. జనం రావడం లేదంటే.. ఏంటి అర్థం? అసలు నాకేం అర్థం కావడం లేదు.
Also Read- Ram Charan: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భేటీ.. మ్యాటర్ ఏంటంటే?
మలయాళ ఇండస్ట్రీకి వెళ్లిపోతా..
ఒక పని చేస్తా భయ్యా నేను.. మలయాళం ఇండస్ట్రీకి వెళ్లి, అక్కడే సినిమా తీసుకుని, ఒక తెలుగు ఆడియన్‌గా ప్రూవ్ చేయడానికి వస్తా భయ్యా. తెలుగు ఆడియన్‌కి, తెలుగోడు సినిమా తీస్తే ఎలా ఉంటుందో తీసుకుని వస్తా భయ్యా. మీరు మలయాళం సినిమాలు అయితేనే వస్తున్నారు. అర్థమైంది నాకు.. పరభాషా చిత్రాలు ఆదరిస్తున్నారు. సినిమాకు వెళ్లి, చూసి బాగాలేదంటే నేను ఒప్పుకుంటాను. అసలు సినిమాకే రాకపోతే.. బాగాలేదో, బాగుందో నాకేం తెలుస్తుంది. నా ఛాలెంజ్‌ని నేను రిటన్ తీసుకుంటున్నాను. నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నా’’ అంటూ తన కాలి చెప్పు తీసుకుని తలపై బాదేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు