Attitude Star Chandrahass
ఎంటర్‌టైన్మెంట్

Sundeep Kishan: యాటిట్యూడ్ స్టార్‌కు హీరో సందీప్ కిషన్ సపోర్ట్.. ఏం చేశాడంటే?

Sundeep Kishan: యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌ (Attitude Star Chandrahass)కు హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) సపోర్ట్ అందించారు. మొదటి చిత్రంతోనే యాటిట్యూడ్ స్టార్‌గా గుర్తింపును పొందిన చంద్రహాస్ ఇప్పుడు వరసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ‘బరాబర్ ప్రేమిస్తా’ (Barabar Premistha) అంటూ ఆడియెన్స్‌ను ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతుండగానే చంద్రహాస్ నూతన చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. తాజాగా హీరో సందీప్ కిషన్ ఈ కొత్త చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేసి, చంద్రహాస్ అండ్ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తుంటే.. ఇది రెగ్యులర్ కమర్షియల్ చిత్రంలా అయితే కనిపించడం లేదు.

Also Read- Private school fee: బెంగళూరులో ఒకటో తరగతి పిల్లాడి స్కూల్ ఫీజు ఎంతో తెలిస్తే గుండెదడ ఖాయం!

సెప్టెంబర్ 17న ఫుల్ డిటైల్స్
ఈ కథలో దేశ భక్తికి సంబంధించిన అంశాలను జోడించినట్టుగా అర్థమవుతోంది. ఐదు రూపాయల కాయిన్, వాటి చుట్టూ ఉన్న బుల్లెట్లు, పోస్టర్‌ను డిజైన్ చేసిన తీరు చూస్తుంటే.. ఒక పవర్ ఫుల్ స్టోరీతోనే సినిమా రాబోతోందనేది తెలుస్తోంది. జైరామ్ చిటికెల ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తుండగా, పివికె ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. చంద్రహాస్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 17న ఈ మూవీకి సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తామని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు. ఈ అనౌన్స్‌మెంట్‌తో ప్రస్తుతం చంద్రహాస్ పేరు బాగా వైరల్ అవుతోంది. ఆయన చేసింది ఒక్కటే సినిమా అయినా, అప్పుడే చంద్రహాస్‌కు ఫ్యాన్ బేస్ ఉండటం విశేషం.

Also Read- Ustaad Bhagat Singh update: పవన్ అభిమానులు రెడీగా ఉండండి.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్డేట్ ఎప్పుడంటే?

‘యాటిట్యూడ్ స్టార్’ అని ఎందుకు పిలుస్తారంటే..
చంద్రహాస్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో యువ నటుడుగా కొనసాగుతున్నారు. టీవీ నటుడు ప్రభాకర్ (ఈటీవీ ప్రభాకర్) కుమారుడే చంద్రహాస్. చంద్రహాస్ తన మొదటి సినిమా ప్రకటన సమయంలో, తనపై వచ్చిన ట్రోల్స్, విమర్శలకు దీటుగా స్పందించారు. తన తండ్రి మెగాస్టార్ అని, అందుకే తాను యాటిట్యూడ్ చూపిస్తున్నానని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో బాగా చర్చనీయాంశమయ్యాయి. తన సినిమాపై తనకు ఉన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు తిరిగి ఇస్తానని కూడా ప్రకటించారు. ఈ డేరింగ్, కాన్ఫిడెన్స్ కారణంగానే ఆయనను ‘యాటిట్యూడ్ స్టార్’ అని పిలవడం మొదలు పెట్టారు. ఆయన మొదటి సినిమా ‘రామ్ నగర్ బన్నీ’. వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ విడుదలైనప్పుడు, చంద్రహాస్ యొక్క ప్రత్యేకమైన యాటిట్యూడ్ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఆ యాటిట్యూడ్‌తోనే యువ నటుడిగా చంద్రహాస్ తనదైన ముద్రను ఇండస్ట్రీలో వేసుకున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?