Nabha Natesh: సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే హీరోయిన్స్ అప్పుడపుడు ఆటవిడుపుగా ఆధ్యాత్మిక ప్రదేశాలను కూడా సందర్శిస్తూ ఉంటారు. తాజాగా ఇస్మార్ట్ ముద్దుగుమ్మ నభా నటేష్ తన సొంత పట్టణం శృంగేరికి వెళ్లింది. అక్కడి ప్రసిద్ధ దేవాలయాలు సందర్శించి, ఆ విశేషాలు ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్ లో తన అభిమానులు పెళ్లి ఎప్పుడంటూ కామెంట్లు పెడుతున్నారు. దానికి ఆమె స్పందిస్తూ.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాను. సందర్భం వచ్చినపుడు అన్నీ జరుగుతాయి అంటూ సమాధానమిచ్చింది.
Read also-Star Actress: క్యాన్సర్‌తో ప్రముఖ నటి కన్నుమూత.. విషాదంలో ఇండస్ట్రీ!
సందర్శించిన ప్రదేశాల గురించి చెప్పుకొచ్చారు.. శృంగేరి, నా జన్మస్థలం. రామాయణానికి పూర్వపు పవిత్రమైన చరిత్ర ఈ నగరానికి ఉంది. మహర్షుల తపస్సులచే పవిత్రమైన భూమి ఇది. దశరథుడితో పుత్రకామేష్టి యాగం చేయించిన ఋషి ఋష్యశృంగుడికి కూడా ఈ నగరంతో అనుబంధం ఉంది. త్రేతాయుగానికి అనుసంధానించే గొప్ప చరిత్ర గల నగరమిది. జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు తన మొదటి అమ్నయ పీఠాన్ని స్థాపించడానికి శృంగేరిని ఎంచుకున్నారు. ఆయన జ్ఞాన స్వరూపమైన శారదాంబ దేవతను ప్రతిష్ఠించి, శృంగేరిని అద్వైత వేదాంతానికి ప్రసిద్ధ ప్రాంతంగా మార్చారు. వేదాలు, కళలకు నాకు పరిచయం చేసింది శృంగేరి. చిన్నతనం నుంచి ఈ పవిత్ర పట్టణం అందించిన చరిత్ర, సంస్కృతి, జ్ఞానం నాకెంతో ప్రేరణ ఇచ్చాయి. పెద్దయ్యాక భారతీయ పురాణాలు, ఆధ్యాత్మిక ఆలోచనల పట్ల నాకున్న ఇష్టం మరింత పెరిగింది. దట్టమైన అడవుల మధ్య ఉండి, భారీ వర్షపాతానికి ప్రసిద్ధి చెందిన శృంగేరి సహనం, అంతర్గత బలాన్ని కలిగిస్తుంది. ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ నా చిన్ననాటి జ్ఞాపకాలు పలకరిస్తూ నిత్యం మార్గదర్శనం చేస్తుంటాయి. అని పేర్కొంది.
Read also-Ramesh Varma: నిర్మాతగా రవితేజ ‘ఖిలాడి’ దర్శకుడు.. ఫస్ట్ సినిమా ఏంటంటే?
నభా నటేష్ 2015లో కన్నడ చిత్రం “వజ్రకాయ”తో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తెలుగులో “నన్ను దోచుకుందువటే” (2018) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన “ఇస్మార్ట్ శంకర్” (2019) సినిమాతో ఆమె విశేష గుర్తింపు సాధించింది. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటిస్తున్న “స్వయంభూ” పాన్-ఇండియా చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం ఒక యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. నభా ఈ సినిమాలో ఒక ఆసక్తికరమైన పాత్రలో కనిపించనుందని, ఈ పాత్ర తన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఆమె స్వయంగా పేర్కొన్నారు. మరో పాన్-ఇండియా ప్రాజెక్ట్ లో నభా నటేష్ కీలక పాత్ర పోషిస్తోంది. నభా నటేష్ ఇటీవల ప్రియదర్శితో కలిసి నటించిన “డార్లింగ్” సినిమా జూలై 19, 2024న థియేటర్లలో విడుదలైంది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో ఆమె స్ప్లిట్ పర్సనాలిటీ డిసార్డర్ ఉన్న ఒక పాత్రను పోషించింది, ఇది ఆమె నటనకు గొప్ప అవకాశం ఇచ్చింది. అయితే, సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. 2022లో నభా నటేష్ ఒక యాక్సిడెంట్‌లో గాయపడిన కారణంగా సినిమాలకు కొంత విరామం తీసుకుంది. ఆమె ఎడమ భుజానికి తీవ్ర గాయం కావడంతో సినిమా అవకాశాలను కోల్పోయింది. అయితే, ఆమె 2023 నాటికి పూర్తిగా కోలుకుని, 2024 నుంచి మళ్లీ సినిమాల్లో చురుకుగా పాల్గొంటోంది.