Harish Rao (imagecredit:swetcha)
Politics

Harish Rao: జస్టిస్​ పీసీ.ఘోష్ కమిషన్ రిపోర్టును అడ్డుకునేందుకు హరీష్ రావు ప్లాన్..?

Harish Rao: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జస్టిస్​ పీ.సీ.ఘోష్(P.C. Ghosh)​ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో పెట్టకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ మాజీ మంత్రి హరీష్​ రావు(Harish Rao) హైకోర్టులో హౌస్ మోషన్​ పిటిషన్​ దాఖలు చేశారు. కాగా, దీనిపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఇంతకు ముందే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR), హరీష్​ రావు(Harish Rao)లు కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్​ పీ.సీ.ఘోష్​ కమిషన్​ ఇచ్చిన రిపోర్టును కొట్టి వేయాలంటూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. కమిషన్స్​ ఆఫ్​ ఎంక్వయిరీ యాక్ట్ సెక్షన్​ 8బీ ప్రకారం తమ క్లయింట్లకు నోటీసులు ఇవ్వకుండానే నివేదికను బహిర్గతం చేశారంటూ వారి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం తనకు కావాల్సినట్టుగా నివేదికను తయారు చేయించినట్టుగా ఉందని పేర్కొన్నారు. ఇదంతా కేసీఆర్(KCR)​ ప్రతిష్టను దెబ్బ తీయటానికే చేస్తున్నారని చెప్పారు. అయితే, ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కాళేశ్వరం కమిషన్​ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. పబ్లిక్​ డొమైన్​ లో రిపోర్టును పెట్టి ఉంటే దానిని తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.

Also Read: BCCI: క్రికెటర్లు, బీసీసీఐ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్!

నేడు అసెంబ్లీలో..

కాగా, ప్రభుత్వం నేడు కాళేశ్వరం ప్రాజెక్ట్(kaleshwaram Project)​ పై జస్టిస్​ పీ.సీ.ఘోష్​ కమిషన్​ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో పెట్టనుంది. దీనిపై చర్చ జరుపనుంది. ఈ క్రమంలో హరీష్​ రావు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టకుండా ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థిస్తూ హైకోర్టు(Highcort)లో హౌస్​ మోషన్​ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో నేడు కాళేశ్వరం ప్రాజెక్ట్​ పై అసెంబ్లీలో చర్చ జరగటం ఖాయమైంది.

Also Read: Brahmanda Movie Review: బ్రహ్మాండ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?