Brahmanda Movie Review: ఇటీవలే చిన్న సినిమాలు పెద్ద హిట్ అవుతున్నాయి. అలాంటి సినిమాల్లో బ్రహ్మాండ కూడా (Brahmanda) ఒకటి. ఆమని, కొమరక్క ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం “బ్రహ్మాండ”. ఈ సినిమాకి డైరెక్టర్ రాంబాబు దర్శకత్వం వహించగా, దాసరి సునీత సమర్పణలో తెరకెక్కించారు. ఎంతో కష్టపడి తెరకెక్కించిన చిత్రాన్ని డైరెక్టర్ రాంబాబు చూడకుండానే అకాల మరణంతో ఈ చిత్రం పై అందరి చూపు పడింది. కాగా, ఈ సినిమాని దాసరి సురేష్ నిర్మించారు. వరికుప్పల యాదగిరి సంగీతాన్ని అందించారు. రమేష్ రాయి. జి ఎస్ నారాయణ సంభాషణలు సమకూర్చారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజే రిలీజ్ అయింది. మరి, ఈ సినిమా ఎలా ఉందో ఇక్కడ చదివి తెలుసుకుందాం..
కథ ఏంటంటే?
ఇచ్చోళ అనే ఒక ఊరిలో అర్ధ రాత్రి 12 కాగానే హత్యలు జరుగుతుంటాయి. అలా ఆరు నెలల నుంచి వరుస హత్యలు జరిగి సమాధిగా మారుతుంటారు. దాంతో, ఆ ఊరిలోని ప్రజలు ఉలిక్కి పడి, కంటిమీద కునుకు లేకుండా ఉంటారు. ఈ మర్డర్ మిస్టరీ పోలీసులకు కూడా అంతుచిక్కదు. వారికీ కూడా ఒక పెద్ద సవాల్‌గా మారుతుంది. ఇక చేసేదేమి లేక ఊరిలోని జనాలను అలెర్ట్ చేస్తారు. సాయంత్రం ఆరు గంటలు అవ్వగానే ఎవ్వరూ గ్రామంలో తిరగొద్దని గ్రామ ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తారు. ఇంకా ఎప్పటినుంచో వస్తున్న ఆ ఊళ్ళో జరిగే మల్లన్న జాతరను కూడా ఆపేయాలని పోలీసులు నిర్ణయం తీసుకుంటారు. మరి, ఈ హత్యలకు కారణం ఎవరు? ఎందుకు ఇలా చేస్తున్నారు? పోలీసులు ఆ మర్డర్ మిస్టరీను చేధించారా? లేదా? తదితర విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
విశ్లేషణ
గ్రామీణ నేపథ్యం ఉన్న కళలను వెండితెరపై ఆవిష్కరిస్తే ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు. వాటికి కాస్త ఆధ్యాత్మిక కథను జోడిస్తే మరింత ఆదరిస్తారు. అలాంటి గ్రామీణ నేపథ్యం ఉన్న ఒగ్గు కళాకారుల కథ, కథనాలతో తెరకెక్కిన చిత్రం “బ్రహ్మాండ”. ఇది మర్డర్ మిస్టరీతో తెరకెక్కింది. సినిమా మొదటి నుంచి.. చివరి వరకు వరుస హత్యలతో హడలి పోయిన గ్రామంలో చివరకు ఏం జరిగిందో అనేది క్లైమెక్స్ లో అద్భుతంగా చూపించారు.
ఆమని (Aamani) ఈ మధ్య కాలంలో ఓ మంచి పాత్రను పోషించారనే చెప్పొచ్చు. బలగం జయరాం తన పాత్రకు న్యాయం చేశారు. ఇక కొమరక్క ( komrakka) పాత్ర మూవీకే హైలైట్ గా నిలిచింది. ఆమె చేసిన ఈ పాత్ర బాగా గుర్తుండి పోతుంది. బన్నీ రాజు (Bunny Raaju), కనీకా వాధ్వ పాత్రలు ఆకట్టుకుంటాయి. ఛత్రపతి శేఖర్ ఎప్పటిలాగే తన సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. నటుడు అమిత్ కూడా అద్భుతంగ నటించాడు. ఇక మిగిలిన పాత్రల్లో దిల్ రమేష్, ప్రసన్నకుమార్, దేవిశ్రీ కర్తానందం తదితరులు తమ తమ పాత్రలకు ప్రాణం పోశారనే చెప్పొచ్చు.
దర్శకుడు దివంగత రాంబాబు.. ఓ గ్రామీణ నేపథ్యం ఉన్న కళకి.. ఆధ్యాత్మికతను జోడించి మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ పాయింట్ అయింది. ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. గ్రామీణ వాతావరణం చక్కగా చూపించారు. ఎడిటింగ్ మీద ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బావుండేది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. నిర్మాత దాసరి సురేష్ ఎక్కడా వెనుకాడకుండా ఖర్చు చేశారు. గో అండ్ వాచ్ ఇట్!
ప్లస్ పాయింట్స్:
అమని
కొమరక్క
కథ
ఒగ్గు కళాకారుల నేపథ్యం
హీరో
ప్రొడక్షన్ వాల్యూస్
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ :
సినిమాలో కొంచెం సీరియన్ సెస్ తగ్గింది.
కామెడీ టచ్ లేకపోవడం.
ఒక్క మాటలో చెప్పాలంటే.. చివరగా, తెలంగాణ గ్రామాణ కథలను ఇష్టపడే వాళ్లకు ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుంది.
రేటింగ్: 3/5