Amitabh Bachchan: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) మరోసారి నందమూరి నటసింహం బాలయ్య (Natasimham Nandamuri Balakrishna)కు హ్యాండిచ్చారు. గతంలో ఓసారి కూడా అమితాబ్ విషయంలో బాలయ్య ఫెయిల్ అయ్యారు. అసలు బాలయ్యకు బిగ్ బి అమితాబ్ హ్యాండివ్వడం ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. విషయం ఏంటంటే..
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే గోల్డ్ ఎడిషన్‌లో బాలయ్యకు చోటు
నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆయన సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవకు గానూ ఆయన పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కిన విషయం తెలిసిందే. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ అరుదైన గౌరవానికి ఎంపికైన తొలి హీరో అతనే కావడం విశేషం. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే గోల్డ్ ఎడిషన్‌లో స్థానం కల్పించినట్టుగా సీఈవో సంతోష్ శుక్లా ప్రకటించడమే కాదు, అందుకు సంబంధించిన పురస్కారాన్ని శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో అందించారు. దీనికై బాలయ్యను గ్రాండ్‌గా సత్కరించారు. ఈ వేడుకకు సినిమా, రాజకీయ రంగాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
Also Read- Nandamuri Balakrishna: నాకు ఈ లెక్కలన్నీ గుర్తుండవ్.. అవన్నీ అభిమానులే గుర్తు పెట్టుకుంటారు
అమితాబ్‌కు ఆహ్వానం
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని బిగ్ బి అమితాబ్ బచ్చన్‌ను బాలకృష్ణ ఆహ్వానించారు. కానీ, అదే సమయానికి కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంతో బిజీగా ఉండటం కారణంగా ఈ వేడుకకు రాలేకపోతున్నానని తెలుపుతూ.. ఈ గొప్ప పురస్కారం లభించినందుకు బాలయ్యను బిగ్ బి అభినందించారు. అంతేకాదు, ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని, ఇలాంటివి ఇంకా ఎన్నో బాలయ్య తన కెరీర్‌లో అందుకోవాలని ఆశీర్వదించారు. మరో వైపు రజినీకాంత్ కూడా బాలయ్యకు అభినందనలు తెలుపుతూ ఓ వీడియో మెసేజ్‌ని పంపిన విషయం తెలిసిందే.
Also Read- 50 Years for Balakrishna: కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా! ఈ డైలాగ్ రజినీకాంత్ చెబితే!
బాలయ్య సినిమాలో గెస్ట్ రోల్ చేయనన్న బిగ్ బి
గతంలో కృష్ణవంశీ దర్శకత్వంలో బాలయ్య ‘రైతు’ అనే సినిమా చేయాల్సి ఉంది. కాకపోతే ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రను అమితాబ్ బచ్చన్ చేస్తేనే.. ఆ పాత్రకు వెయిటేజ్ వస్తుందని భావించి, కృష్ణవంశీని తీసుకుని బాలయ్య అమితాబ్‌ని కలవడానికి వెళ్లారు. మరి ఏం జరిగిందో ఏమో.. అమితాబ్ ఆ పాత్రను చేయడానికి ఇష్టపడలేదు. బాలయ్య సినిమాలో గెస్ట్ రోల్ చేయనన్నఅమితాబ్.. ఆ తర్వాత చిరంజీవి ‘సైరా’ సినిమాలో గెస్ట్ రోల్ చేయడంతో.. బాలయ్యకు పరాభవం తప్పలేదు. అమితాబ్ ఆ పాత్రను చేయనని చెప్పడంతో బాలయ్య కూడా ఆ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టేశారు. మళ్లీ ఇప్పుడు ఇలా.. బిగ్ బి హ్యాండిచ్చి బాలయ్యను, ఆయన అభిమానులను డిజప్పాయింట్ చేశారు. అయినా కూడా అమితాబ్ బచ్చన్‌కు వేడుకలో బాలయ్య ధన్యవాదాలు తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు