Little Hearts Trailer: ‘లిటిల్ హార్ట్స్’ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా యువతను ఆకట్టుకునే కథతో రూపొందింది. ఈ సినిమాలో మౌళి తనుజ్, శివానీ నాగరం ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సాయి మార్తాండ్ దర్శకత్వం వహించగా, ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆదిత్య హాసన్ నిర్మించారు. బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 12, 2025న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని విడుదల చేయడంతో భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ సినిమా పక్కా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు.
ఈ సినిమా టీనేజ్ ప్రేమకథను ఫన్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో చూపిస్తుంది. కాలేజ్ లైఫ్, యువత తుంటరి పనులు, ఎమ్‌సెట్ ప్రిపరేషన్ వంటి అంశాలు ప్రేక్షకులకు సుపరిచితంగా, రిలేటబుల్‌గా అనిపించేలా ఉంటాయి. సినిమాలో మౌళి, శివానీ మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఆకట్టుకుంటుందని నిర్మాతలు చెబుతున్నారు. సాంగ్స్‌లో ఒకటైన ‘మళ్లీశ్వరివే’ పాట జెస్సీ గిఫ్ట్ గాయకత్వంలో, స్వరూప్ గోలి రాసిన లిరిక్స్‌తో ఆకట్టుకుంది. సింజిత్ యెర్రమల్లి సంగీతం సమకూర్చగా, సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ, శ్రీధర్ సొంపల్లి ఎడిటింగ్ చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 3న ఇంటర్ విద్యార్థుల కోసం మూడు సెంటర్లలో ఫ్రీ షోస్‌తో ప్రదర్శించనుంది. సెప్టెంబర్ 4 నుంచి పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయి. దాదాపు 200 థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం యువతకు ఒక ఫ్రెష్, ఎంటర్‌టైనింగ్ అనుభవాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.
ట్రైలర్ చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
Read also-Jogulamba Gadwal district: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం.. అన్నదాతలపై దగా చేస్తున్న వ్యాపారులు..?
ట్రైలర్ ను చూస్తుంటే.. ఈ స్టోరీ జియో సిమ్ రాక ముందు జరిగింది అంటూ మొదలవుతోంది. చదువురాని సైనిక్ పూర్ లో ఉంటాడు మన హీరో అనగానే మౌళి కనిపిస్తాడు. చదువులో బాగా వెనకబడిన వాడిలా కనిపిస్తాడు. వాళ్ల నాన్నతో ఎప్పుడూ చదువు విషయంలో తిట్లు తింటూ ఉంటాడు. అదే సమయంలో ఎమ్సెట్ కోచింగ్ కోసం వెళితే అక్కడ కాత్యాయని కనబడుతోంది. ఈమె కూడా చదువులో బాగా వెనకబడే ఉంటుంది. ఇద్దరూ అనుకోకుండా లవ్ లో పడతారు. ఒక సందర్భంలో హీరోయిన్ వేరే ఊరు వెళ్లి పోవాల్సి వస్తుంది. తర్వాత ఏం జరిగింది అన్నదే ఈ స్టోరీ. ట్రైటర్ అందరినీ ఆకట్టుకునేలా కనిపిస్తుంది. ముఖ్యంగా యువతకు బాగా కనెక్ట్ అవుతుంది. కామెడీ టైమింగ్స్ బాగా కుదిరాయి. హీరో హీరోయిన్ మధ్య కామెడీ కూడా ఆకట్టుకునేలా ఉంది. మ్యూజిక్ ఈ సినిమాకు మరింత కలిసొచ్చే అంశంగా కనిపిస్తుంది. డైలాగ్స్ అన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు నెటకొల్పేలా చేసింది.
ఈ పేపర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి- https://epaper.swetchadaily.com/