Telangana Cabinet: తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాలులో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినేట్ సమావేశం జరిగింది. ఈ భేటిలో పలు కీలక అంశాలపై చర్చించి మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. అందులో ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయానికి వచ్చింది. పంచాయతీల్లో రిజర్వేషన్ పై గత ప్రభుత్వం విధించిన పరిమితిని ఎత్తివేస్తూ జీవో తీసుకురావాలని తీర్మానించింది. అలాగే ఎన్నికల కమిషన్ కు ఇవాళ లేఖ రాయాలని నిర్ణయించింది. సెప్టెంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా సూచించాలని అభిప్రాయానికి వచ్చింది.
Also Read: Youtuber Arrested: చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి ఏమో.. అడ్డంగా బుక్కైన యూట్యూబర్
అలాగే గవర్నర్ కోటాలో కోదండరామ్, అజారుద్దీన్ ను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలని కేబినేట్ నిర్ణయించింది. గతంలో సిఫార్సు చేసిన అమేర్ అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్ కు చోటు కల్పించడం గమనార్హం. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అజారుద్దీన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఆయన్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరినీ కాంగ్రెస్ తరపున నిలబెడతారన్న చర్చ మెుదలైంది.
Also Read: BRS Harish Rao Protest: రోడ్లపై పరిగెత్తి.. సచివాలయం వద్ద బైఠాయించి.. హరీశ్ నేతృత్వంలో హైడ్రామా!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంపై సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆయన రాజకీయ నేపథ్యంతో పాటు.. ప్రజాసేవలో అతడు సాధించిన ఘనతలను సీఎం రేవంత్ స్వయంగా అసెంబ్లీలో చదివి వినిపించాడు. రాజకీయాల్లో మార్పు వచ్చినా, మిత్రుడిగా తమ మధ్య ఎలాంటి మార్పు రాలేదని ఈ సందర్భంగా రేవంత్ అన్నారు.