Tummala Nageswara Rao (imagecredit;Twitter)
తెలంగాణ

Tummala Nageswara Rao: పంట నష్టంపై వివరాలు సేకరించాలని మంత్రి ఆదేశం..?

Tummala Nageswara Rao: వ్యవసాయ అధికారులు బృందాలుగా ఏర్పడి జిల్లాల్లో పర్యటించి పంట నష్టం వివరాలను సేకరించి సమగ్ర నివేదిక అందజేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Min Tummala Nageshwar Rao) అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లా కలెక్టర్లతో శుక్రవారం మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గోదావరి వరద ప్రవాహ ఉధృతి పెరగడంతో ఖమ్మం(Khammam), భద్రాద్రి కొత్తగూడెం(Kothagudem) జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశారు. జిల్లాలలోని రిజర్వాయర్లు, నీటి ప్రాజెక్టులపై ఆరా తీశారు. వరద ఉధృతి పెరిగి వాగులు, కల్వర్టుల దగ్గర నీటి ప్రవాహాం పెరిగే అవకాశం ఉందని, దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.

యూరియా ఉత్పత్తి నిలిచిపోవడంతో

ఆర్ఎఫ్సీఎల్ లో యూరియా ఉత్పత్తి నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు కోసం యూరియా సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని పేర్కొన్నారు. రెండ్రోజులలో రాష్ట్రానికి ఇప్కో-ఫుల్ పూర్, ఎన్ఎఫ్ఎల్, ఎంసీఎఫ్ఎల్ , క్రిబ్కో, సీఐఎల్, పీపీఎల్ కంపెనీల నుంచి 21,325 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని తెలిపారు. ఈ యూరియా రాష్ట్రంలోని గద్వాల, పెద్దపల్లి, జగిత్యాల, (Warangal)వరంగల్, సనత్ నగర్, జడ్చర్ల, వరంగల్, కరీంనగర్, పందిళ్లపల్లి, గజ్వెల్, మిర్యాలగూడ, నాగిరెడ్డిపల్లి ప్రాంతాలకు చేరుకుటుందని, అక్కడి నుంచి డిమాండ్ పరంగా జిల్లాలకు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలోగా ఐపీఎల్ , సీఐఎల్ కంపెనీల నుంచి దామ్ర, గంగవరం, కరాయికల్ పోర్టుల ద్వారా మరో 27,950 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని, ఈ యూరియా ఆదిలాబాద్, జడ్చర్ల, గద్వాల, వరంగల్, మిర్యాలగూడ, పందిళ్లపల్లి, సనత్ నగర్, గజ్వెల్, జగిత్యాల, నాగిరెడ్డిపల్లి ప్రాంతాలకు చేరుకోనుందన్నారు.

Also Read: PM Modi: మారుతీ సుజుకి తొలి ఎలక్ట్రిక్ కారు వచ్చేసిందోచ్.. ప్రధాని మోదీ స్వయంగా..

కేంద్ర మంత్రి నడ్డాకు లేఖ

సెప్టెంబర్ లో రైతుల అవసరాలను తీర్చేందుకు తక్షణం అదనపు యూరియా కేటాయింపులు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి నడ్డా(Union Minister Nadda)కు శుక్రవారం మంత్రి తుమ్మల లేఖ రాశారు. వరి పైర్ కు మొదటి, రెండవ విడతల యూరియా వేయడం జరుగుతోందని, త్వరలో మూడవ విడతతో పాటు ఎంఓపీ(MOP) వాడకం కూడా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. వరికే సెప్టెంబర్ లో 2.81 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని ఆయన వివరించారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రాష్ట్రానికి 2.38 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఏర్పడిందని ఈ లోటు రైతులపై తీవ్ర ప్రభావం చూపిందని, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న యూరియా స్టాక్ కేవలం 30,000 మెట్రిక్ టన్నులు మాత్రమేనని, రోజుకు 9,000 నుండి 11,000 మెట్రిక్ టన్నుల వరకు అమ్మకాలవుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ఎరువుల శాఖ (డీఓఎఫ్) రాష్ట్రానికి అదనంగా 2.38 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని, అలాగే సెప్టెంబర్ నెలకు ఇప్పటికే ఆమోదించిన 1.50 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరాకు తోడుగా ఈ అదనపు కేటాయింపును మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాకినాడ పోర్టుకు చేరనున్న ఓబీఈ లోటస్ నౌకలోని 47,500 మెట్రిక్ టన్నులు, గంగవరం పోర్టుకి చేరనున్న రెండు నౌకల (ఎంవీ ఏఎం ఓసియన్ ఫైట్ 45,000 మెట్రిక్ టన్నులు, మెగ్డా 44,000 ఎంటీఎస్) నుంచి 20వేల మెట్రిక్ టన్నుల యూరియా చొప్పున రాష్ట్రానికి మంజూరు చేయాలని కోరారు.

Also Read: Chiranjeevi vs Prabhas: చిరంజీవికి పోటీగా ప్రభాస్ సినిమా.. సంక్రాంతికి ఆసక్తికర పోరు!

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..