Samantha: హీరోయిన్ సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పేరు తెలుగు సినీ అభిమానులకు సుపరిచితం. ‘ఏ మాయ చేశావే’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సమంత, తొలి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టి స్టార్‌డమ్ సంపాదించింది.
ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అదే సమయంలో తమిళ సినిమాల్లోనూ నటించి అక్కడ కూడా తనదైన ముద్ర వేసింది. కానీ, ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడింది. నాగ చైతన్యతో ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్న సమంత, కొన్ని తీవ్రమైన విభేదాల తర్వాత విడాకులు తీసుకుంది.
Also Read: Jogulamba Gadwal district: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం.. అన్నదాతలపై దగా చేస్తున్న వ్యాపారులు..?
విడాకుల తర్వాత నాగ చైతన్య మరో వివాహం చేసుకోగా, సమంత మాత్రం ఇంకా సింగిల్‌గానే కొనసాగుతోంది. ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, అక్కడ కూడా మంచి గుర్తింపు సంపాదించింది. ఇటీవల, సినీ రంగంలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సమంత, సోషల్ మీడియాలో తన జర్నీని గుర్తు చేసుకుంది. ఈ 15 ఏళ్లలో తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాలు రెండూ ఉన్నాయని, కొన్ని విషయాలు ఎంత మర్చిపోవాలనుకున్నా మరిచిపోలేమని, మరికొన్ని సులభంగా మరిచిపోతామని ఆమె ఎమోషనల్ అవుతూఫ్యాన్స్ తో పంచుకుంది.
Also Read: Soundarya: ఆ రహస్యం బట్టబయలు.. సౌందర్య మరణించిన తర్వాత.. హిమాలయాలకు వెళ్లి పూజలు చేసిన స్టార్ హీరో?
ఇదిలా ఉండగా, నాగ చైతన్యతో కలిసి ఉన్న సమయంలో ఓ ఇంటర్వ్యూలో సమంత, కామెడీ కింగ్ బ్రహ్మానందం గురించి ఫన్నీగా చెప్పిన సంగతి ఆసక్తికరం. “ఒకసారి నేను, నాగ చైతన్య, అఖిల్ కలిసి బ్రహ్మానందం గారి ఇంటికి వెళ్లాం. అక్కడ ఆయన అతిథి సత్కారంలో మమ్మల్ని చాలా ఆశ్చర్యపరిచారు. నెయ్యి, చికెన్… ఆపకుండా వడ్డిస్తూనే ఉన్నారు. ‘చాలు’ అన్నా ఆయనకు కోపం వచ్చేట్టు చూశారు. ఇక ఏం చేయాలో తెలియక, ఆయన పెట్టినవన్నీ తిని, ఇంటికి వచ్చాం!” అంటూ సమంత నవ్వుతూ చెప్పుకొచ్చింది.