KCR Assembly
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Telangana Assembly: కేసీఆర్ అసెంబ్లీ వస్తారా?.. బీఆర్ఎస్ వర్గాలు ఏమంటున్నాయంటే?

Telangana Assembly: శనివారం నుంచి అసెంబ్లీ ప్రారంభం

కాళేశ్వరంపైనే ప్రధాన చర్చ
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్‌గా మారే అవకాశం
ఎన్ని రోజులనే దానిపై బీఏసీలో నిర్ణయం
3 నుంచి 4 రోజులపాటు నిర్వహించే ఛాన్స్
కేసీఆర్ అసెంబ్లీకి దూరం?

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly) శనివారం నుంచి ప్రారంభమవుతున్నాయి. సమావేశాల్లో ప్రధాన ఎజెండా కాళేశ్వరం ప్రాజెక్టు అంశం అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుపై జస్టిస్ సీపీ ఘోష్ 600 పేజీలతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దానిని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలను రచిస్తోంది. అధికార, విపక్షాలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ప్రభుత్వం చేసే విమర్శలను తిప్పికొట్టాలనే లక్ష్యంతో, అందుకు అంశాల వారీగా వివరాలు సేకరించాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వివరించనున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన నుంచి మేడిగడ్డ పియర్స్ కుంగుబాటు వరకు, ఆ ప్రాజెక్టుకు చేసిన ఖర్చు, అప్పు, చెల్లిస్తున్న వడ్డీ వివరాలను వివరించేందుకు సిద్ధమవుతున్నారు. దీనిని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సైతం వ్యూహాలను రచిస్తోంది. అసెంబ్లీ వేదికగా వాడీవేడిగా చర్చజరగనుందనే అర్థమవుతోంది.

Read Also- Sridevi Vijaykumar: మీరేంటో చెప్పడానికి మాటలు చాలవు నాన్న.. శ్రీదేవి విజయ్ కుమార్ పోస్ట్ వైరల్

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే సభలో శనివారం తొలిరోజూ జూబ్లీహిల్స్‌ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు సంతాపం తీర్మానం ప్రవేశపెడతారు. సభ సంతాపం తెలిపిన అనంతరం వాయిదా వేయనున్నారు. ఆ తర్వాత స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అధ్యక్షతన బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సభను ఎన్ని రోజులపాటు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. మూడు లేదా నాలుగు రోజులపాటు సమావేశాలు కొనసాగే అవకాశం ఉందని సమాచారం. అయితే, కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై చర్చ, బీసీ రిజర్వేషన్లపై ప్రధానం చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఈ సమావేశాల్లో శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌ ఎన్నుకునే అవకాశం ఉందని, అందుకు తొలిరోజే స్పీకర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు సమాచారం.

Read Also- Ganesh immersion: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు.. అధికారుల ప్లానింగ్ ఇదే

కేసీఆర్ దూరం?
అసెంబ్లీ సమావేశాలకు గులాబీ అధినేత కేసీఆర్ హాజరు కావడం లేదని సమాచారం. ఇప్పటికే పార్టీ నేతలకు ఈ విషయాన్ని చెప్పినట్లుగా తెలిసింది. అంతేగాకుండా బీఆర్ఎస్ఎల్పీ సమావేశం సైతం నిర్వహించడం లేదని తెలిసింది. ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా ముందస్తుగా అసెంబ్లీలో ఎదుర్కునే అంశాలపై కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశనం చేసేవారు. అయితే, ఈసారి కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుపైనే జరుగుతుండటంతో ఆ విమర్శలను తిప్పికొట్టే బాధ్యతలను మాజీ మంత్రి హరీష్ రావుకు అప్పగించినట్లు సమాచారం.

Read Also- Bhupalapally Shocking: అడవిలో యువతి దారుణ హత్య.. కుళ్లిన స్థితిలో మృతదేహాం.. అఘాయిత్యం చేసి చంపారా?

Just In

01

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!