King Nagarjuna
ఎంటర్‌టైన్మెంట్

Nagarjuna: ఇంకా సైమన్ లుక్‌లోనే నాగార్జున.. బర్త్ డే స్పెషల్‌గా ఫ్యాన్స్‌ని మీటైన కింగ్!

Nagarjuna: ఇప్పటి వరకు బాలీవుడ్ స్టార్ హీరోలు తమ పుట్టినరోజున అభిమానులను కలవడం మాత్రమే సోషల్ మీడియాలో హైలైట్ అవుతూ ఉంటుంది. షారుఖ్, సల్మాన్ వంటి వారు వారి ఇంటిపై నుంచి అభిమానులకు థ్యాంక్స్ చెబుతుంటారు. అలాగే వారి పుట్టినరోజున అభిమానులు ఆయా స్టార్ హీరోల ఇంటికి భారీ సంఖ్యలో చేరుకుని జేజేలు పలుకుతుంటారు. ఏది ఎలా ఉన్నా.. బాలీవుడ్‌లో మాత్రం ఇది రొటీనే. ఇప్పుడిదే సంస్కృతి టాలీవుడ్‌లోనూ కంటిన్యూ అవుతుంది. టాలీవుడ్‌కు వచ్చేసరికి ఇలాంటి సంస్కృతి ఒక్క మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)కే పరిమితమైంది. కానీ ఈ మధ్యకాలంలో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వారి బర్త్‌డేలకు కూడా ఫ్యాన్స్ వారి ఇళ్లకు చేరుకుని, శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పుడు కింగ్ నాగార్జున కూడా ఇదే ట్రెండ్‌ని ఫాలో అయ్యారు.

Also Read- Bro Code Movie: నిర్మాతగా జయం రవి.. బ్యానర్ పేరు, తొలి సినిమా వివరాలివే..

భారీగా చేరుకున్న అభిమానులు
కింగ్ నాగార్జున పుట్టినరోజు (ఆగస్ట్ 29)ను పురస్కరించుకుని, ఎప్పుడూ లేనిది ఆయన అభిమానులు (King Nagarjuna Fans) భారీ సంఖ్యలో నాగార్జున ఇంటికి చేరుకున్నారు. తనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన వారందరినీ ప్రేమగా పలకరించి, వారికి ధన్యవాదాలు తెలిపారు నాగార్జున. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం హీరోగా మాత్రమే చేయాలనే రూల్‌ని కాకుండా, వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నారు కింగ్ నాగార్జున. ఇటీవల వచ్చిన ‘కుబేర’, ‘కూలీ’ సినిమాలలో ఆయన పోషించిన పాత్రలే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడనే కాదు.. మొదటి నుంచి నాగార్జున కొత్త టాలెంట్‌కు, వైవిధ్యతకు, కొత్త దర్శకులకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారనే విషయం తెలియంది కాదు. కానీ ఈ బర్త్‌డే‌కు ఆయన స్వయంగా ఇంటిలోపలి నుంచి వచ్చి.. అభిమానుల నుంచి శుభాకాంక్షలు (Happy Birthday King Nagarjuna) స్వీకరించడం మాత్రం విశేషమనే చెప్పుకోవాలి.

Also Read- Thammudu Movie re release: పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్‌గా ‘తమ్ముడు’ రీ రిలీజ్.. హంగామా మొదలైంది

ఇంకా సైమన్ లుక్‌లోనే..
రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చిన ‘కూలీ’ సినిమా టాక్ పరంగా కాస్త డిజప్పాయింట్ చేసినప్పటికీ, కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకెళుతోంది. మరీ ముఖ్యంగా ఇందులో కింగ్ నాగార్జున విలన్ పాత్ర చేయడంతో.. సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమాలో కింగ్ నాగార్జున సైమన్ పాత్రలో కనిపించారు. ఈ సినిమా విడుదలై కూడా చాలా రోజులు అవుతుంది. అయినా కూడా కింగ్ నాగార్జున సైమన్ లుక్‌లోనే దర్శనమివ్వడం చూస్తుంటే.. ఇంకా ఆయన ఆ క్యారెక్టర్‌లో నుంచి బయటికి వచ్చినట్లుగా అనిపించడం లేదు. చూద్దాం.. ఇలా ఇంకెన్ని రోజులు ఉంటారో.

త్వరలోనే 100వ చిత్రం ప్రారంభం
నాగార్జున నెక్ట్స్ చేయబోయే చిత్రం ఆయన కెరీర్‌లో 100వ చిత్రం. ఈ సినిమా విషయంలో ఇప్పటికే ఎంతో మంది దర్శకుల పేర్లు వినిపించాయి. కానీ, నాగార్జున అందరి ఊహలకు బ్రేక్ వేస్తూ.. ఒకే ఒక చిత్ర అనుభవం ఉన్న దర్శకుడికి అవకాశం ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా, ఇటీవల ఓ సెలబ్రిటీ షోలో తెలిపారు. ఆర్. కార్తీక్ దర్శకత్వంలో నాగార్జున 100వ చిత్రం ఉండబోతుంది. ఈ బర్త్‌డే‌కి అధికారిక ప్రకటన వస్తుందని అంతా ఊహించారు కానీ, ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవ్వకపోవడంతో.. అనౌన్స్‌మెంట్‌ని వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?