Srinivas Goud: వైన్స్ షాప్ లలో గౌడ్ లకు ఇచ్చిన 15% జీఓ 93 ను సవరించాలని, 25% తో కూడిన జీఓ ను ఇవ్వాలని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్(Srinivass Goud) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైద్రాబాద్ లోని సెక్రటేరియట్ మీడియా సెంటర్ వద్ద తెలంగాణ గౌడ, కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మూసివేసిన కల్లు దుకాణాలను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న ఎక్స్గ్రేషియా ను ఇచ్చిన హామీ ప్రకారం రూ.10 లక్షలకు పెంచి, తక్షణమే నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. జనగామ(Janagama) జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్(Sardar Sarvai Papanna Goud) పేరును పెట్టాలని డిమాండ్ చేశారు. కేరళ రాష్ట్రంలో మాదిరిగా కల్లుగీత పాలసీని 8.98% ఆల్కహాల్ తో తెలంగాణ లో అధికారికంగా అమలుచేయాలని కోరారు.
రాజ్యాధికార దిశగా అడుగులు
ఈ సమావేశంలో తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజ్, గౌడ కళ్ళు గీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆయిల్ వెంకన్న గౌడ్,గౌడ జన హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఎలుకట్టే విజయ్ కుమార్ గౌడ్, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్, బీసీ సమైక్య అధ్యక్షులు ఎస్ దుర్గయ్య గౌడ్, అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూరెళ్ళ వేములయ్య గౌడ్, శేఖర్, బబూర్ బిక్షపతి గౌడ్ తదితరులు ఉన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో రాజ్యాధికార దిశగా అడుగులు వేద్దామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపు నిచ్చారు. హైద్రాబాద్((Hyderabad)లోని మల్లాపూర్ లో కౌండిన్య గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ తో కలిసి ఆవిష్కరించారు.
Also Read: Tanikella Bharani: ‘మటన్ సూప్’ మూవీకి ఆ విఘ్నేశ్వరుడి దయతో ఏ విఘ్నాలు కలగకూడదు
ఆనాడే ఆయన అంతటి పోరాటం
ఈ సందర్భంగా ఆన మాట్లాడుతూ పాపన్న గౌడ్ మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వీరుడు అన్నారు. పాపన్న గౌడ్ పౌరుషానికి, మన జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని, సర్దార్ పాపన్న చరిత్ర మన జాతికే గర్వకారణం అన్నారు. సామాన్యుల సాహసానికి ఎల్లలు ఉండవు అని నిరూపించిన వ్యక్తి పాపన్న అని కొనియాడారు. ఆనాడే ఆయన అంతటి పోరాటం చేశారు. రాజుకు వ్యతిరేకంగా మాట్లాడితే చీకటి గదిలో వేసి చిత్రహింసలు పెట్టిన రోజులు అవి, వారినే ఓడించి పరిపాలన చేశారు. ఆనాటి నిరంకుశత్వానికి, ప్రజల హింసకు వ్యతిరేకంగా గొప్పగా పోరాడిన మహనీయుడు పాపన్న అన్నారు. గౌడ జాతి గొప్పదనాన్ని, పోరాట స్ఫూర్తిని, త్యాగాల చరిత్రను రాబోయే తరాలకు అందించడానికి మనందరం కృషి చేయాలన్నారు. సర్దార్ పాపన్న గౌడ్ జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అన్నారు.
Also Read: Khammam District: భారీ వర్షాలకు నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి.. ఎక్కడంటే..?
