Ramakrishna Rao: రాష్ట్రంలో పంట నష్టాలపై సర్కార్ సీరియస్‌
Ramakrishna Rao (imagecredit:swetcha)
Telangana News

Ramakrishna Rao: రాష్ట్రంలో పంట నష్టాలపై సర్కార్ సీరియస్‌.. ఎక్స్ గ్రేషియా అందేనా…?

Ramakrishna Rao: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు,వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రాథమిక నివేదికను వెంటనే సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామ కృష్ణారావు(k Ramakrishna Rao) సంబంధిత శాఖల కార్యదర్శులను ఆదేశించారు. రాష్ట్రంలో గత కొద్దీ రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలవలన జరిగిన నష్టాలపై వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అరవింద్ కుమార్(aravindh Kumar), వికాస్ రాజ్(Vikas Raj), సబ్యసాచి ఘోష్(sabayasachi Gosh), ముఖ్య కార్యదర్శులు రాహుల్ బొజ్జ(Rahul bojja), రఘునందన్ రావు(Ragunandan Rao), శ్రీధర్(Srider) , పోలీస్ శాఖ డీజీపీ, అడిషనల్ డీజీ మహేష్ భగవత్ తదితర ఉన్నతాధికారులు ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

నష్టాలను తెలియచేసే ఫోటోలు

ఈ సందర్భంగా సీఎస్(CS) మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రధానంగా నిర్మల్(Nirmal), కామారెడ్డి(Kamareddy), మెదక్(Medak), సిరిసిల్ల(Siricilla) జిల్లాలు అధికంగా నష్టాన్ని చవి చూశాయని, వీటితో పాటు ఇతర జిల్లాల్లో కూడా గణనీయమైన నష్టం వాటిల్లిందని అన్నారు. ఈ నష్టాలకు సంబంధించి ప్రాథమిక నివేదికను వెంటనే సమర్పించాలన్నారు. ఈ ప్రాథమిక నివేదికలతో పాటు జరిగిన నష్టాలను తెలియచేసే ఫోటోలు ,వీడియో క్లిప్పింగులు, పత్రిక క్లిప్పింగులు కూడా జతపర్చాలని సీఎస్ పేర్కొన్నారు. వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత జిల్లా కలెక్టర్లు నష్టాలపై పంపిన ఈ ప్రాథమిక నివేదికలను సంకలనం చేయాలని విపత్తుల నిర్వహణ శాఖ కు తెలిపారు.

Also Read: Hydraa: బిగ్ బ్రేకింగ్.. చెరువుల పై ప్రత్యేక నిఘా.. అలా అస్సలు చేయొద్దు?

నిబంధనలతో ఎక్స్ గ్రేషియా

ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, చెరువులు, విద్యుత్ లైన్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్దరించాలని రామకృష్ణారావు ఆదేశించారు. వర్షాలు మరికొన్ని రోజులు వచ్చే అవకాశం ఉన్నందున మరింత అప్రమత్తతతో ఉండాలని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు నిబంధనలను అనుసరించి ఎక్స్ -గ్రేషియా ను అందచేయాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు యాక్షన్ ప్లాన్ పై పూర్తి స్థాయిలో రెడీగా ఉండాలన్నారు.

Also Read: Khammam District: భారీ వర్షాలకు నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి.. ఎక్కడంటే..?

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క