MLA Murali Naik: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్య పనుల విషయంలో మున్సిపల్ అధికారులు అలసత్వం వహించొద్దని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్(MLA Dr. Bhukya Murali Naik) పేర్కొన్నారు. శుక్రవారం మహబూబాబాద్ మున్సిపాలిటీ లోని 34వ వార్డు సమస్యలపై సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 34వ వార్డుకు సంబంధించి గత ఏడాది ఉదృతమైన వరదల నేపథ్యంలో ఇబ్బందులకు గురైన ప్రాంతాలను సందర్శించారు. నాళాలు ఆక్రమించి నిర్మాణాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నాళాలు పారే వాటిపై ఎవరు ఎలాంటి నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు అత్యవసరమైన అభివృద్ధి పనులను జాబితా తయారుచేసి వెంటనే నిర్మాణ పనులను చేపట్టాలని సూచించారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు
మహబూబాబాద్ మున్సిపాలిటీలో ప్రతి వార్డుకు సంబంధించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వార్డుల్లో ప్రజల నుంచి ఎక్కడ సమస్యలు వచ్చిన వెంటనే వాటిని పరిష్కరించేందుకు మున్సిపల్ అధికారులు కృషి చేయాలన్నారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చిన యుద్ధ ప్రాతిపదికన వాటిని మరమ్మతులు చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. రహదారులకు సంబంధించి ఎక్కడ ఇబ్బందులు ఏర్పడిన సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షించి అందుకు సంబంధించిన ప్రణాళికను తయారుచేసి అందించాలన్నారు. రహదారులు, పారిశుద్ధ్య పనులు, ఇంకా వర్షాకాలంలో అత్యవసర పనుల విషయంలో అధికారులు, సిబ్బంది అలసత్వం వహించరాదన్నారు.
Also Read: Virat Kohli – Pujara: పుజారా రిటైర్మెంట్‌పై తొలిసారి స్పందించిన విరాట్ కోహ్లీ
మురుగునీరు, వరద నీరు నిల్వపై దృష్టి
భారీ వర్షాల నేపథ్యం లో మురుగునీరు, వరద నీరు నిల్వ ఉండే ప్రాంతాలపై మునిసిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజలకు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక ప్రణాళికతో వ్యవహరించాలన్నారు. పారిశుద్ధ్యన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఎక్కడ అపరిశుభ్రత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల ఆరోగ్య లక్ష్యమే ధ్యేయంగా ఈ వర్షాకాలం సీజన్ అంత అధికారులు అప్రమత్తమైన విధులు నిర్వహించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట నీరుటి సురేష్ నాయుడు, సంజీవరెడ్డి, బండారు వెంకటరమణ, ఎడ్ల రమేష్, నాళ్ల నరసింహారావు, మాదరబోయిన యాకయ్య, దిలీప్, మున్సిపల్ డి ఈ ఉపేందర్, క్రాంతి పాల్గొన్నారు.
Also Read: Singer Suchitra: ఈ వయసులో గాయనికి కాబోయే భర్త ఏం చేశాడంటే?.. మరీ అంత దారుణమా!