Rajinikanth in Coolie
ఎంటర్‌టైన్మెంట్

HC on Coolie: సెన్సార్ సర్టిఫికెట్ వివాదంపై.. ‘కూలీ’ నిర్మాతకు షాకిచ్చిన హైకోర్టు

HC on Coolie: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఇచ్చిన ‘A’ సర్టిఫికెట్‌పై జోక్యం చేసుకోవడానికి మద్రాసు హైకోర్టు నిరాకరించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సినిమా నిర్మాతలు సన్ టీవీ నెట్‌వర్క్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఆగస్టు 14న దేశవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ‘A’ సర్టిఫికెట్ ఇవ్వడంతో, 18 ఏళ్ల లోపు వారు ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో.. ఈ సినిమా కంటే హింస, రక్తపాతం ఎక్కువ ఉన్న సినిమాలకు కూడా యుబైఏ ఇచ్చారని, ఈ సినిమాకు ‘A’ సర్టిఫికెట్ ఎలా ఇస్తారంటూ సన్ పిక్చర్స్ నిర్మాత కోర్టును ఆశ్రయించారు.

36 ఏళ్ల తర్వాత ‘A’ సర్టిఫికెట్
‘కూలీ’ సినిమాకు ‘A’ సర్టిఫికెట్ రావడంపై నిర్మాతలే కాదు.. ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే రజినీకాంత్ సినిమాలు పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటాయి. అందుకే ఆయన సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. అలాంటిది 36 ఏళ్ల తర్వాత రజినీకాంత్ నటించిన చిత్రానికి ‘A’ సర్టిఫికెట్ రావడంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఓకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అయినా కూడా రజినీ సినిమా చూడకుండా ఎవరూ ఆగలేరు అంటూ సర్దిపుచ్చుకున్నారు. కానీ, ఈ సినిమా టాక్ కాస్త తేడాగా రావడంతో కలెక్షన్ల విషయంలో నిర్మాత ఊహించినది జరగలేదు. దీంతో సెన్సార్ సర్టిఫికెట్ కారణంగానే సినిమాకు కలెక్షన్స్ రాలేదంటూ నిర్మాత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Also Read- Chiranjeevi – Spirit: ‘స్పిరిట్’లో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్.. సందీప్ వంగా ఏం ప్లాన్ చేశావయ్యా?

అందుకే పిటిషన్ కొట్టేశారు
ఈ కేసులో వాదనలు పరిశీలించిన జస్టిస్ టి.వి. తమిళసెల్వి, CBFC యొక్క ఎగ్జామినింగ్ కమిటీ, రివైజింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని తిరిగి పరిశీలించడానికి నిరాకరిస్తూ, కళానిధి మారన్ యాజమాన్యంలోని నిర్మాణ సంస్థ పిటిషన్‌ను కొట్టివేశారు. ‘కూలీ’ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని సమర్థిస్తూ, CBFC తమ నిర్ణయం 1991లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఉందని తెలిపింది. ఆ మార్గదర్శకాల ప్రకారం, సినిమాలు సినిమాటిక్‌గా మంచి ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో CBFC నిర్ధారించాలి. అందువల్ల, సినిమాలోని హింస, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు పొందుపరచడం, సమర్థించడం వంటివి నిరోధించాల్సిన బాధ్యత సెన్సార్ బోర్డుపై ఉందని వాదించింది. అలాంటి దృశ్యాలు సున్నితమైన మనసులపై దెబ్బతీసే ప్రభావం చూపుతాయని తెలిపింది. కోర్టు దీనిని పరిగణనలోకి తీసుకుని నిర్మాత వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ‘కూలీ’ నిర్మాతకు షాక్ తగిలినట్లయింది.

Also Read- Shilpa Shirodkar: సుధీర్ బాబు ‘జటాధర’లో నమ్రత శిరోద్కర్ సోదరి.. ఫస్ట్ లుక్‌‌తోనే వణికిస్తుందిగా!

CBFC ఏం చెప్పిందంటే..
‘కూలీ’ సినిమా గురించి CBFC మాట్లాడుతూ, మార్గదర్శకాలకు అనుగుణంగా సినిమాను పరిశీలించామని, దానికి ‘A’ సర్టిఫికెట్ మాత్రమే ఇవ్వాలని నిర్ణయించామని పేర్కొంది. ఐదుగురు సభ్యుల ఎగ్జామినింగ్ కమిటీ, పది మంది సభ్యుల రివైజింగ్ కమిటీ రెండూ ఈ విషయంలో ఏకగ్రీవంగా ఉన్నాయని తెలిపింది. ఒకవేళ ‘UA’ సర్టిఫికెట్ కావాలంటే కొన్ని దృశ్యాలను తొలగించాలని నిర్మాతలను కోరినప్పుడు.. వారు అందుకు అంగీకరించలేదని పేర్కొంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?