Spirit Update
ఎంటర్‌టైన్మెంట్

Chiranjeevi – Spirit: ‘స్పిరిట్’లో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్.. సందీప్ వంగా ఏం ప్లాన్ చేశావయ్యా?

Chiranjeevi – Spirit: ‘యానిమల్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) చేయబోయే సినిమాకు చాలా టైమ్ తీసుకున్నారు. ఆయన నుంచి ఇంత గ్యాప్‌ని అభిమానులు కూడా కోరుకోవడం లేదు. అయితే లేటైనా, లేటెస్ట్ మూవీతో సంచలనాలు క్రియేట్ చేయడం పక్కా అనేలా.. ఇప్పటికే అందరికీ హింట్ ఇచ్చేశారు వంగా. ‘యానిమల్’ తర్వాత ఆయన చేయబోయే చిత్రం మరేదో కాదు.. రెబల్ స్టార్ ప్రభాస్‌తో చేయబోయే ‘స్పిరిట్’. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసిన సందీప్.. ప్రభాస్ (Rebel Star Prabhas) ఓకే అంటే సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఈలోపు ఈ సినిమాకు ఎంత క్రేజ్ రావాలో అంతా వచ్చేసింది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే చేసిన హడావుడితో ఈ సినిమా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఇందులో నటించడానికి ఆమె చెప్పిన కారణాలు, ఆ తర్వాత సందీప్ వివరణ ఇవన్నీ కూడా.. సినిమాను నిత్యం వార్తలలో ఉంచేలా చేస్తూ వచ్చాయి. ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరో రూమర్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. అదేంటంటే..

Also Read- Mood of Nation Survey: ఇప్పటికప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఎన్డీయేకి ఎన్ని సీట్లు వస్తాయ్?.. సర్వే విడుదల

గెస్ట్ రోల్‌లో మెగాస్టార్ చిరంజీవి
సందీప్ రెడ్డి వంగా ఏ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నా, మీ అభిమాన నటుడు ఎవరంటే.. వెంటనే మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పేరే చెబుతూ వచ్చారు. సందీప్ రెడ్డి పనితనం తెలిసిన వారంతా, మెగాస్టార్‌తో ఒక్క సినిమా ప్లాన్ చెయ్ అంటూ.. రోజూ సోషల్ మీడియాలో సందీప్‌కు రిక్వెస్ట్‌లు పెడుతుంటారనే విషయం తెలియంది కాదు. మరి ఆ రిక్వెస్ట్‌ల నుంచి పుట్టుకొచ్చిందో, లేదంటే నిజంగానే గెస్ట్ రోల్ చేస్తున్నారో తెలియదు కానీ, ప్రభాస్ – సందీప్ వంగా సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నారనేలా టాక్ మొదలైంది. ‘యానిమల్’లో అనిల్ కపూర్ ఎలా అయితే హైలైట్ అయ్యారో.. ‘స్పిరిట్’లోనూ చిరంజీవికి తగ్గ పాత్రని వంగా సెట్ చేశాడనేలా టాక్ నడుస్తుంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది తెలియదు కానీ, ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో అయితే ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

Also Read- Tribanadhari Barbarik: చిరు బర్త్‌డేకి మిస్సయిన ‘త్రిబాణధారి బార్బరిక్’.. విడుదల ఎప్పుడంటే?

తండ్రి పాత్ర కోసమేనా?
‘స్పిరిట్’ (Spirit Movie) సినిమాలో ప్రభాస్ తండ్రి పాత్ర‌కు మెగాస్టార్ చిరంజీవిని సంప్రదించినట్లుగా ప్రచారం నడుస్తుంది. ఈ పాత్ర చాలా ప్రభావవంతంగా ఉంటుందని, ‘యానిమల్’ సినిమాలోలా కూర్చుని ఉండే పాత్ర కాకుండా, హీరోయిజం ఉట్టిపడేలా ఉంటుందని అంటున్నారు. అయితే చిత్రయూనిట్ నుంచి మాత్రం దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఇది నిజమై, చిరంజీవి ఇందులో నటిస్తే మాత్రం.. మెగా, రెబల్ ఫ్యాన్స్‌ని పట్టుకోవడం ఎవరితరం కాదు. ఏమో వంగా ఏం ప్లాన్ చేస్తున్నాడో? చూడాల్సి ఉంది. ఇందులో ప్రభాస్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడని మాత్రం తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం