Shilpa Shirodkar
ఎంటర్‌టైన్మెంట్

Shilpa Shirodkar: సుధీర్ బాబు ‘జటాధర’లో నమ్రత శిరోద్కర్ సోదరి.. ఫస్ట్ లుక్‌‌తోనే వణికిస్తుందిగా!

Shilpa Shirodkar: సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ అందరికీ పరిచయమే. నటిగా మహేష్ బాబుతో సినిమా చేసిన తర్వాత, వారిద్దరూ ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మహేష్, నమ్రతల లైఫ్‌లో ఏం జరిగిందనేది అందరికీ తెలిసిందే. నమ్రతకు ఓ సోదరి (Namrata Shirodkar’s sister) ఉందని, తరచూ వారు కలుసుకుంటారనేది తెలియంది కాదు. అలాగే ఆమె బాలీవుడ్‌లో స్టార్‌గానూ గుర్తింపు పొందారు. ‘ఖుదా గవా’ సినిమాలో అమితాబ్ బచ్చన్ సరసన ఆమె పోషించిన పాత్రకు మంచి పేరొచ్చింది. శిల్పా శిరోద్కర్ 2000వ దశకం ప్రారంభంలో సినిమాలను వదిలిపెట్టారు. ఆ తర్వాత 2013లో ఓ టీవీ సీరియల్‌తో తిరిగి బుల్లితెరపై అడుగు పెట్టారు. సినిమాలతో పోలిస్తే టీవీ సీరియల్స్‌లోనే ఆమె ఎక్కువగా నటించారు. మళ్లీ చాలా కాలం తర్వాత ఆమె నటిగా వెండితెరపై తన సత్తా చాటబోతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Naga Chaitanya: నాగ చైతన్య 24వ చిత్రంలో ‘లాపతా లేడీస్’ నటుడు.. ఎవరో తెలుసా?

సుధీర్ బాబు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ!
నవ దళపతి సుధీర్ బాబు (Sudheer Babu), బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘జటాధర’. ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు. హై-ఆక్టేన్ విజువల్స్, పౌరాణిక ఇతివృత్తాలతో ఈ చిత్రం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు సిద్ధమవుతోంది. రీసెంట్‌గా వచ్చిన టీజర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేయగా.. తాజాగా మరో బాలీవుడ్ భామ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా తెలుపుతూ.. ఆమె ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాతో సోనాక్షి టాలీవుడ్‌కు పరిచయం అవుతుండగా, ఇదే సినిమాతో నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ (Shilpa Shirodkar) కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.

భయపెట్టేలా ఫస్ట్ లుక్
తాజాగా ఈ సినిమాలో శిల్పా శిరోద్కర్ నటిస్తుందని తెలుపుతూ.. ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. శోభగా శిల్పా శిరోద్కర్‌ ఇందులో కనిపించనున్నారు. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో ఆమె బ్లాక్ చీర కట్టుకుని, హోమగుండం ముందు కూర్చొని.. భయపెట్టే అవతార్‌లో దర్శనమిస్తున్నారు. ఈ పోస్టర్ మొత్తం మిస్టికల్ ఎనర్జీతో తాంత్రిక శక్తులని సింబలైజ్ చేస్తోంది. శిల్పా శిరోద్కర్‌ ఇచ్చిన ఇంటెన్స్, సీరియస్ ప్రెజెన్స్ చూస్తుంటే ఆమె ఇందులో చాలా కీలక పాత్ర చేసినట్లుగా అర్థమవుతోంది. ఈ సినిమా విజయవంతమైతే.. టాలీవుడ్‌లో కొన్నాళ్ల పాటు శిల్పా తన సత్తా చాటే అవకాశం లేకపోలేదు. అందులోనూ సూపర్ ఫ్యామిలీ సపోర్ట్ ఎలాగూ ఉంటుంది.

Also Read- SV Krishna Reddy: ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా ‘వేదవ్యాస్’.. ఈ సినిమా స్పెషల్ ఏంటంటే?

జీ స్టూడియోస్‌, ప్రెర్ణా అరోరా ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమాను ఉమేష్ కుమార్ బన్సాల్, ప్రెర్ణా అరోరా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ జీ మ్యూజిక్ కో, క్రియేటివ్ డైరెక్షన్‌ దివ్య విజయ్‌. జీ స్టూడియోస్‌ స్ట్రాటజిక్ విజనరీ ఉమేష్ కుమార్ బన్సాల్ మద్దతుతో, ప్రొడ్యూసర్స్ శివిన్ నారంగ్, నిఖిల్ నందా, అరుణ అగర్వాల్, శిల్ప సింగాల్, అక్షయ్ కేజ్రివాల్, కుస్సుం అరోరా ఈ సినిమాకు మద్దతు ఇస్తున్నారు. విజనరీ టీమ్‌, అద్భుతమైన కాన్సెప్ట్‌తో ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ థియేట్రికల్ రిలీజ్‌లలో ఒకటిగా ‘జటాధర’ రాబోతుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?